వికీపీడియా:వ్యాససృష్టికి మార్గసూచీ/కంటెంటు

కాపీహక్కు

వేరే వెబ్‌సైట్ల నుండి పాఠ్యాన్ని కాపీ చేసి ఇక్కడ పెట్టకండి అనేది వికీపీడియాలో సాధారణ నియమం. (కొన్ని పరిమితమైన మినహాయింపులున్నాయి.[1][2] అక్కడున్న కొంత భాగాన్ని ఉల్లేఖిస్తూ ఉన్నదున్నట్లు వ్యాఖ్యగా రాయడం కూడా సబబే.)

- Wikipedia:Copy-paste

వ్యాసంలో కాపీహక్కులున్న కంటెంటును వాడరాదు. వికీపీడియా కాపీహక్కుల విషయంలో చాలా పట్టుదలగా ఉంటుంది.

పాఠ్యాన్ని కాపీ పేస్టు చెయ్యకండి -వెబ్‌సైట్ల నుండి గాని, PDF ల నుండి, పుస్తకాలు, పత్రికలు, మరే ఇతర వనరుల నుండి గాని. వాటి స్వంతదార్లు మిమ్మల్ని వాడుకొమ్మని చెప్పినా సరే. చివరికి అవి మీ స్వంతమే ఐనా సరే! మిమ్మల్ని వాడుకొమ్మని అనుమతి ఇచ్చినంత మాత్రాన, దాన్ని వికీపీడియాలో వాడే అనుమతి ఉన్నట్లు కాదు. అందులోని చిన్నపాటి భాగాన్ని తగు విధమైన ఉల్లేఖన ఇస్తూ ఒక వ్యాఖ్యగా (కొటేషనుగా) వాడుకోవచ్చంతే.

వేరే మూలాల నుండి కాపీ చేసి తెచ్చిన కంటెంటును వికీపీడియా పట్టేసుకుంటుంది. కాపీహక్కులను ఉల్లంఘించే వ్యాసాలను తొలగిస్తుంది.[1]

వ్యాసాన్ని మీ స్వంత వాక్యాల్లో రాయండి అంతే గానీ మూలం లోని వాక్యాలకు బాగా దగ్గరగా ఉండేలా (పారాఫ్రేజింగు) రాయకండి.[2] మీ పాఠ్యం ప్రశస్తంగా (పర్ఫెక్టుగా) లేకపోయినా ఫరవాలేదు — దాన్ని ఎప్పుడైనా సవరించవచ్చు. (అలాగే, వ్యాసం లోకి మీరో బొమ్మను ఎక్కించాలని భావిస్తోంటే, మీరు ఆ పని ఇంతకు ముందెన్నడూ చేసి ఉండకపోతే, కొన్నాళ్ళు ఆగి, ఇతరులు ఆ వ్యాసాన్ని గమనించి దాని గురించి ఏమంటారో తెలుసుకున్నాక చేస్తే మంచిది.[3])


మీ వ్యాసం విషయ ప్రాముఖ్యతను నిరూపించాలి.

విషయ ప్రాముఖ్యత పేజీలో, వ్యాస విషయం వికీపీడియాలో ఎక్కేంత ప్రాముఖ్యత ఉన్నట్లు ఎలా చూపాలో చూసారు. వ్యాసం చదవడం ముగిసేసరికి, విషయానికి ప్రాముఖ్యత ఎందుకుందో పాఠకులకు అర్థమై పోవాలి.


వ్యాసంలో ధోరణి తటస్థంగా ఉండాలి.

వికీపీడియా వ్యాసాల్లో తటస్థ దృక్కోణం ఉండాలి. దానర్థం అవి ఏదో ఒక అంశానికి "అనుకూలంగానో", "ప్రతికూలంగానో" ఉండకూడదు. ప్రశంసలు గానీ, విమర్శలు గానీ సరైన మూలాలు చూపిస్తూ చెయ్యడం భేషైన పనే. అయితే, ఈ పని తటస్థ ధోరణిలో జరగాలి. వాస్తవాల గురించి రాయండి — ఆ వాస్తవం వేరేచోట ప్రచురించిన ఇతరుల అభిప్రాయమైనా ఫరవాలేదు, కానీ మీ స్వంత అభిప్రాయం రాయకండి. అన్ని ముఖ్యమైన దృక్కోణాలూ, సముచితమైన నిష్పత్తిలో, నిష్పాక్షికంగా, వ్యాసంలో ప్రతిఫలించాలి. కేవలం వ్యాస విషయంపై దాడి చేస్తూ సాగే వ్యాసాలను, కేవలం పొగడుతూ రాసే వ్యాసాలనూ తొలగిస్తారు. లేదా తటస్థత చోటు చేసుకునేలా సమూలంగా సవరించేస్తారు.


వ్యాసంలో పొగడ్తలు, భజన ఉండకూడదు.

విషయ ప్రాముఖ్యతను బాగా పెంచి చూపించే క్రమంలో ఈ స్తోత్రం, భజన బయటపడుతాయి. దాని వలన వ్యాసపు తటస్థత దెబ్బతింటుంది. అంచేత దాన్ని నివారించాలి. మహా, గొప్ప, మనీషి, అనితర సాధ్యం, అద్వితీయం, దిగ్గజ,.. వంటి వర్ణనాత్మక పదాలు ఈ భజన కార్యక్రమంలో భాగం ఉంటూంటాయి. ఇలాంటి పదాలు వ్యాస విషయాన్ని ఉన్నదాని కంటే ఎక్కువగా పెంచి చూపిస్తాయి.


వ్యాసం శైలి మార్గదర్శకాలకు అనుగుణంగా ఉండాలి.

వికీపీడియా వ్యాసాలన్నీ ఒకే శైలిని అనుసరిస్తాయి. శైలిని, దాని ఉపపేజీలనూ చదివి వికీ శైలిని గ్రహించండి. లేదా మీరు తలపెట్టిన వ్యాసానికే సంబంధించిన వ్యాసాల్లో మంచి వ్యాసం దేన్నైనా చూడండి. ప్రామాణిక పత్రికల భాషా శైలినే అనుసరించండి.


మీ వ్యాసం, కంటెంటు ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుందా?

నా వ్యాసం తటస్థంగా, విషయ ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. వేరెక్కడి నుండీ కాపీ పేస్టు చేసేది కాదు

నా వ్యాసం వాటికి అనుగుణంగా లేదు (సాయం చెయ్యండి!)


Notes
  1. 1.0 1.1 కాపీహక్కులను ఉల్లంఘించకుండా పెద్దయెత్తున పాఠ్యాన్ని కాపీ చేసుకోగలిగే వెబ్‌సైట్లు (తదితర వనరులు) చాలా తక్కువగా ఉన్నాయి — పబ్లిక్ డోమెయిన్‌లో ఉన్నవి గాని, వికీపీడియాకు అనుగుణమైన లైసెన్సును వాడేవి (ఈ రెండో రకపు వాటికి, సాధారణంగా శ్రేయస్సును ఆపాదించాల్సి ఉంటుంది. వేరే వికీపీడియా వ్యాసాల నుండి కాపీ చేసిన పాఠ్యానికి కూడా శ్రేయస్సును ఆపాదించాల్సి ఉంటుంది en:Wikipedia:Copying within Wikipedia బట్టి). మీ కంటెంటు కాపీహక్కులకు లోబడి ఉందో లేదో సందేహంగా ఉంటే, సహాయకేంద్రంలో అడగండి. సమాధానం వచ్చేవరకూ ఆగండి.
  2. 2.0 2.1 గతంలో ప్రచురితమైన పాఠ్యం మీ స్వంతమే అయితే, లేదా దాన్ని తిరిగి ప్రచురించుకునే అనుమతి మీకు ఉంటే, ఆ అనుమతిని ధ్రువీకరించుకోవాలి. w:Wikipedia:Donating copyrighted materials చూడండి.
  3. సంబంధింత, వివరణాత్మక బొమ్మలు ఉంటే చాలా బాగుంటుంది. కానీ బొమ్మను సృష్టించినది మీరు కాకపోతే, కాపీహక్కుల వ్యవహారాలు చాలా సంక్లిష్టంగా పరిణమించవచ్చు. గతంలో ప్రచురితమైన బొమ్మను వాడదలిస్తే, సహాయ కేంద్రంలో దాని గురించి అడగవచ్చు; తెలుగు వికీపీడియాలో గానీ, వికీమీడియా కామన్సులో గానీ తగిన బొమ్మలేమైనా ఉన్నాయేమో వెతకవచ్చు. (కామన్సులో ఉండే బొమ్మలను వికీపీడియాలో ఉన్న బొమ్మల లాగానే వాడుకోవచ్చు.)