వికీపీడియా:వ్యాససృష్టికి మార్గసూచీ

వ్యాసాన్ని సృష్టించే మార్గసూచీకి స్వాగతం!

వికీపీడియాకు కొత్త వ్యాసాన్ని సమర్పించే ప్రక్రియలో ఈ సూచీ మీకు సహాయం చేస్తుంది. మీకు ఏ సమయంలోనైనా ప్రశ్నలు ఉంటే, మీరు సహాయ కేంద్రానికి వెళ్ళి అక్కడ ఇతర వికీపీడియన్ల నుండి సహాయం పొందవచ్చు.

వ్యాసాన్ని సృష్టించేందుకు మీరు సిద్ధంగా ఉన్నారా?

మీ మొదటి వ్యాసాన్ని సృష్టించే ముందు ఈసరికే ఉన్న వ్యాసాల్లో కొన్ని దిద్దుబాట్లు చేసే ప్రయత్నం చెయ్యండి. తెవికీలో, మూలాల్లేని వ్యాసాలను తరచూ తొలగిస్తూంటారు. విశ్వసనీయ మూలాలను ఉల్లేఖించడమెలాగో ముందే తెలుసుకుంటే మీ కృషి విజయవంతమయ్యే అవకాశాలు మెరుగ్గా ఉంటాయి.

దిద్దుబాటుకు చెందిన ప్రాథమికాంశాలను తెలుసుకునేందుకు, ఈపాఠం చదవండి.

మొదలుపెట్టే ముందు, దిద్దుబాటుకు సంబంధించి కొన్ని ప్రాథమిక విషయాల పట్ల మీకు అవగాహన ఉండాలి. అది ఉంటే, మామూలుగా జరిగే కొన్ని పొరపాట్లను నివారించవచ్చు.

ఏం చెయ్యాలనుకుంటున్నారు?

వ్యాసం సృష్టించడం మొదలు పెట్టండి (కొత్త వాడుకరుల కోసం) కొత్త వ్యాసం రాయమని ఎవరినైనా అడగండి మరేదైనా సృష్టించండి (కాస్త అనుభవమున్న వాడుకరుల కోసం)