వికీపీడియా:వ్యాససృష్టికి మార్గసూచీ/దారిమార్పు
దారిమార్పు పేజీ, ఆ పేజీకి వచ్చిన సందర్శకులను ఆటోమాటిగ్గా వేరే పేజికి పంపిస్తుంది – దారిని మారుస్తుంది. ఆ వ్యాసానికి సంబంధించిన ఇతర పేర్లతో వెతికినపుడు కూడా ఆ పేజీకి వెళ్ళేలా చేసే పేజీ అది. దారిమార్పు పేజీని సృష్టించాల్సిన కారణాల్లో కొన్ని ఇవి:
- సాధారణంగా వాడే పొట్టిపేర్లు (ఎబ్రీవియేషన్లు) (ఎన్.టి.ఆర్ పేజీ, నందమూరి తారక రామారావు పేజీకి తీసుకుపోతుంది)
- సాధారణంగా రాస్తూండే తప్పు అక్షరక్రమం (జీవిత భీమా పేజీ, జీవిత బీమా కు దారి మారుస్తుంది)
- వేరే పేర్లు (ఆల్ ఇండియా రేడియో, ఆకాశవాణి పేజీకి దారి మారుస్తుంది)
- అసలు పేరుతో ఉన్న పేజీ నుండి విస్తారంగా వ్యాప్తిలో ఉన్న పేరుకు (భాగవతుల సదాశివశంకర శాస్త్రి పేజీ, ఆరుద్ర కు మళ్ళిస్తుంది)
గమనిక: తెలుగు వికీపీడియాలో ఉనికిలో ఉన్న పేజీకే దారిమార్పును సృష్టించగలరు. ఉనికిలో లేని పేజీకో, వేరే భాషకు చెందిన వికీపీడియా వ్యాసానికో, వేరే వెబ్సైటుకో చెయ్యలేరు.
కింది బొత్తాన్ని నొక్కినపుడు, మిమ్మల్నొక దిద్దుబాటు పేజీకి తీసుకువెళ్తుంది. అక్కడ ఈ పని ఎలా చెయ్యాలో మీకు సూచనలు లభిస్తాయి.
తరవాతేం జరుగుతుంది: మీరు మీ అభ్యర్ధనను సమర్పించాక, దాన్ని ఇతర వాడుకరులు పరిశీలించి ఆ దారిమార్పు పేజీ ఉండవచ్చో లేదీ నిర్ణయిస్తారు. అది సముచితమైతే, దారిమార్పు పేజీ తయారౌతుంది. లేదంటే అవదు.
మీ సూచనను తిరస్కరించిన సందర్భంలో: వ్యక్తిగతంగా తీసుకోకండి! మీ ప్రతిపాదన తిరస్కరించబడినంత మాత్రాన మిమ్మల్ని తక్కువ చేసినట్లేమీ కాదు. ప్రాజెక్టులో మీ విలువేమీ తగ్గదు. వికీపీడియాలో మీ కృషి కొనసాగించాలని కోరుకుంటాం.