వికీ సమావేశం పాతచిత్రం

సమావేశ నేపథ్యం - రాజశేఖర్ మార్చు

వికీపీడియా 2012 జన్మదిన వేడుకల సందర్భంలో కొత్తగా చేరిన సభ్యుల కోసం ఒక సహాయ కేంద్రాన్ని నిర్వహించడానికి నేను ముందుకు వచ్చాను. దానికి పాల్గొన్న సభ్యుల సమ్మతి లభించినది. దానికి నా ధన్యవాదాలు. దీని గురించి వికీ సభ్యులందరికీ తెలియజేశాను. మన తెలుగువారి రాజధాని నగరమైన హైదరాబాదు లో నెలకొక వికీపీడియా సమావేశాన్ని జరపమే దీని ఉద్దేశం. దానికి ప్రతి నెల మూడవ ఆదివారం మధ్యాహ్నం 2-4 గంటల సమయాన్ని నిర్ణయించాము. hands on work-shop వలె ఇది ఉపయోగపడుతుందని మా ఉద్దేశం. దూరప్రాంతాల వారు స్కైప్ లేక జీటాక్ ద్వారా పాల్గొనవచ్చు. ఈ వివరాలకు నాతో సంప్రదించండి. ముఖ్యంగా హైదరాబాదు మరియు పరిసర ప్రాంతాలవారు వీలుచూసుకొని వారివారి సమస్యలను ఇక్కడికి వచ్చి పరిష్కరించుకోవచ్చును. వారికి తెలిసిన కొత్తవారిని ఇలాంటి దగ్గరికి పంపమని ప్రార్థన.

తేది మరియు సమయం
  • 20 మే 2012, ఆదివారం సాయంత్రం: 2 గంటలనుండి 4 గంటలవరకు
స్థలం

తెవికీ సహాయకేంద్రం c/o చిరునామా : డా. రాజశేఖర్, నేషనల్ పేథాలజీ లేబరేటరీ, 203, శ్రీమాన్ ఐశ్వర్య టవర్స్, దోమల్ గూడ, హైదరాబాద్-500 029.
సూచన: శ్రీ రామకృష్ణ మిషన్, దోమలగూడ నుంచి ఆర్టీసి క్రాస్ రోడ్డు వెళ్లే దారిలో, రహదారికి కుడివైపున శ్రీమాన్ ఐశ్వర్య టవర్స్ ఉన్నది.

కార్యక్రమం
  1. తెలుగు రచనలు చేయడానికి సభ్యులు ఎదుర్కొంటున్న సాధారణ సమస్యలు.. రాజశేఖర్
  2. బొమ్మలు అప్లోడ్ చెయ్యటం ప్రదర్శన .. రాజశేఖర్
  3. << ఇతర విషయాలు ప్రతిపాదించండి>>
నిర్వహణ

రాజశేఖర్: 9246 37 6622 మరియు ఇతర తెవికీ సభ్యులు


పాల్గొనటానికి నిశ్చయించినవారు (మీ అభిప్రాయాలు వీలైతే చర్చాపేజీలో రాయండి) (పేరు రాస్తే ఇతరులకు తెలిసి మిగతా వారుకూడా చేరతారు, ముందుగా పేరు రాయకపోయినా పాల్గొనవచ్చు)
  1. <<ఈ వరుసపై మీ పేరు లేక వాడుకరి పేరు రాయండి>>
బహుశా పాల్గొనేవారు ( మీ అభిప్రాయాలు చర్చాపేజీలో రాయండి)
  1. <<ఈ వరుసపై మీ పేరు లేక వాడుకరి పేరు రాయండి>>
పాల్గొన వీలు కాని వారు ( మీ అభిప్రాయాలు తప్పక చర్చాపేజీలో రాయండి)
  • <<ఈ వరుసపై మీ పేరు లేక వాడుకరి పేరు రాయండి>>
  1. జె.వి.ఆర్.కె.ప్రసాద్
నివేదిక

సమావేశం 20 తేదీన మధ్యాహ్నం 2 నుండి 5 గంటల మధ్య జరిగినది. దీనిలో భాస్కరనాయుడు గారు మరియు ప్రవీణ్ ఇళ్ళ చురుకుగా పాల్గొన్నారు. నాయుడు గారు ప్రతిరోజు ఎదుర్కొంటున్న సమస్యలను చర్చల ద్వారా సందేహనివృత్తి చేసుకున్నారు. విజయనగర చరిత్రను వికీసోర్సులో ఎలా చేర్చాలి అనే అంశం చర్చించిన పిదప ఒక మొలకను ప్రారంభించడం జరిగింది. బొమ్మలను చేర్చుతున్నప్పుడు సంబంధించిన పేజీలో చేర్చడం తెలియజేయడం. చేర్చిన బొమ్మలన్నీ ఎలా చూడాలో చూపించాము. జాతీయాల విషయంలో కూడా చర్చించాము. విక్షనరీలో కూడా సమాచారం చేర్చడం బాగుందని అన్నారు. అలాగే చర్చలలో పాల్గొనడం కూడా చూపించాము. ప్రవీణ్ ఎక్కువగా సాఫ్ట్ వేర్ రచనలు చేస్తున్నారు. అతనికి బాట్లను ఆపరేట్ చేయడానికి ప్రయత్నించమని సూచించాను. ఉపాధ్యాయుల ద్వారా పాఠశాలలో వికీ సమావేశాలను నిర్వహించడానికి చొరవచూపమని చెప్పాను.