వికీపీడియా:ఐదు మూలస్తంభాలు

(వికీపీడియా:Five pillars నుండి దారిమార్పు చెందింది)
అడ్డదారి:
WP:5P
First pillar
వికీపీడియా ఒక విజ్ఞాన సర్వస్వం. ఇది మౌలిక డాక్యుమెంట్లు దొరికే వనరు కాదు , వార్తాపత్రిక కాదు, ఉచితంగానో, వెలకో వెబ్‌లో స్థలం ఇచ్చే సంస్థ కాదు. ప్రజాస్వామ్యంపైనో, అరాచకత్వంపైనో చేసే ప్రయోగమేమీ కాదు. మీ స్వంత అభిప్రాయాలు, అనుభవాలు, వాదనలు ప్రచురించుకునే స్థలం అంతకంటే కాదు.
 
Second pillar
వికీపీడియా తటస్థ దృక్కోణాన్ని అనుసరిస్తుంది. అంటే వ్యాసాలు ఏ ఒక్క దృక్కోణాన్నీ ప్రతిబింబించవు. దీనికోసం ఒక్కోసారి వివిధ దృక్కోణాలను చూపవలసి రావచ్చు; విషయానికి సంబంధించిన అన్ని దృక్కోణాలను నిష్పాక్షికంగా, అది ఎవరి దృక్కోణమో వివరంగా తెలిసేలా సందర్భశుద్ధిగా ప్రతిబింబించాలి. దీనివలన చదువరులకు అది ఎవరి దృక్కోణమో తెలుస్తుంది. ఫలానా దృక్కోణం నిజమనీ, సరైనదనీ చూపించరాదు. అవసరమైనచోట మీ వ్యాస మూలాలను, వనరులను ఉటంకించాలి. మరీ ముఖ్యంగా, వివాదాస్పద విషయాల్లో ఇది చాలా అవసరం.
 
Third pillar
వికీపీడియా స్వేచ్ఛగా పంచుకోగల విజ్ఞానసర్వస్వం. ఎవరైనా మార్చవచ్చు. వాడటం, సవరించటం, పంపిణి చేయటం చెయ్యవచ్చు.: సంపాదకులందరూ సమాజానికి ఉచితంగా తమ కృతులను అందచేస్తారు కాబట్టి, ఇక్కడి వ్యాసాలు ఏ ఒక్క సంపాదకునికీ సొంతం కాదు. రచనలు నిర్దాక్షిణ్యంగా మార్పులకు లోనవుతాయి. పంపిణీ కూడా అవుతాయి. నకలు హక్కుల చట్టాలను గౌరవించండి. మూలాల నుండి దొంగతనం చేయవద్దు. ఉచితం కాని మాధ్యమాలను సముచిత వినియోగం నిబంధన క్రింద వాడుకోవచ్చు. కాని స్వేచ్ఛగా పంచుకోగల మూలాల కోసమే ముందు వెతకాలి.
 
Fourth pillar
వికీపీడియా తోటి సభ్యులను - వారితో మీరు ఏకీభవించకపోయినా - గౌరవించండి. వ్యక్తిగతమైన దాడికి దిగకండి. వ్యర్థ వివాదాలకు తావివ్వకండి. మీ వాదనను నిరూపించుకునేందుకు వికీపీడియాలో అడ్డంకులు సృష్టించక, నిబద్ధతతో ఉండండి. ఇతరులు కూడా అంతే నిబద్ధతతో ఉన్నారని భావించండి - అలా లేరనేందుకు మీదగ్గర తిరుగులేని సాక్ష్యం ఉంటే తప్ప. కొత్తవారిని ఆహ్వానించండి. వివాదాలేమైనా తలెత్తితే, సరైన చర్చాపేజీలో మృదువుగా చర్చించండి. మీరు కృషి చేసేందుకు వికీపీడియాలో ఇంక బోలెడు పేజీలున్నాయని గుర్తుంచుకోండి. మీ వాదనకు అనుకూలంగా బలం పెంచుకునేందుకు మిథ్యా సభ్యులను సృష్టించకండి.
 
Fifth pillar
వికీపీడియాలో విధానాలు, మార్గదర్శకాలూ ఉన్నాయి. అయితే ఏవీ కూడా శిలాశాసనాలు కాదు; నిరంతరం రూపుదిద్దుకుంటూ ఉంటాయి. అక్షరాలు, మాటల కంటే వాటి స్ఫూర్తి, ఆదర్శమూ ముఖ్యం. కొన్ని సందర్భాల్లో వికీపీడియాను మెరుగుపరచేందుకు, నియమాలను పక్కన పెట్టాల్సి ఉండొచ్చు. వ్యాసాలలో మార్పులు చేర్పులు చేసేందుకు చొరవగా ముందుకు రండి, అయితే నిర్లక్ష్యంగా ఉండకండి. వ్యాసాన్ని చెడగొడతామేమోనని వెనకాడవద్దు. పాత కూర్పులన్నీ జాగ్రత్తగానే ఉంటాయి కాబట్టి, తిరిగి సరిదిద్దలేనంతగా చెడగొట్టే అవకాశం లేదు. అయితే, ఒక్క విషయం..మీరు ఇక్కడ రాసేది శాశ్వతంగా ఉండే అవకాశం ఉందని గ్రహించండి.