వికీపీడియా:గోసంగి కులం

(వికీపీడియా:Gosangi నుండి దారిమార్పు చెందింది)

Fake news about gosangi.. Gosangi కులాన్ని అడ్డు పెట్టుకొని గొల్లకులం గొప్ప చెప్పుకున్నట్టు వుంది ఇదంతా.. నమ్మకండి మోసపోకండి రాజేష్ జన్నారపు అబద్ధపు ప్రచారం చేస్తున్నాడు.. తెలంగాణ గోసంగి గురించి మాట్లాడండి..

కాపీ రైటు

మార్చు

ఈ వ్యాసంలోని సమాచారంలో చాలా భాగం ఈ లింకు నుంచి కాపీ చేసినట్లుంది. ఈ దయచేసి ఈ వ్యాసాన్ని సృష్టించిన వారు దయచేసి వాటిని తిరగ రాయండి. లేదంటే కాపీరైటు కింద ఆ సమాచారాన్ని మొత్తం తొలగించవలసి ఉంటుంది - రవిచంద్ర (చర్చ) 17:50, 14 డిసెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

రవిచంద్ర గారు చెప్పినట్లు ఈ వ్యాసంలో చాలా భాగం యదాతథంగా కాపీ పేస్టు చేసినది. దీనిని తిరగ రాయకపోతే ఆయా భాగాలు తొలగించబడతాయి. – K.Venkataramana  – 23:54, 14 డిసెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
వెబ్ సైట్ లో ఉన్న విషయాన్ని యదాతథంగా కాగ వివిధ మూలాలు, వనరులనుపయోగించి వ్యాసం కొంత సమయం తీసుకుని తిరగ రాయండి. తొలగించనవసరం లేదు. యదాతథంగా ఉన్న విభాగాలను తొలగించవలసి ఉంటుంది. – K.Venkataramana  – 07:18, 15 డిసెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

గురువు గారు, ఎక్కువ శాతం కాపీ పేస్ట్ చేసిన పేజీ కావున తొలగించగలరు. ప్రభాకర్ గౌడ్ నోముల చర్చ 07:28, 15 డిసెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ వ్యాసంలో కాపీ హక్కులు ఉల్లంఘించిన పాఠ్యాన్ని తీసేసి, నిర్వహణ మూస తీసేస్తున్నాను. - రవిచంద్ర (చర్చ) 07:02, 16 డిసెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
రవిచంద్ర గారు, రవి సూర్యుడు, చంద్ర చంద్రుడు, మీ పేరుకు అనుగుణమే మీ ప్రవర్తన ఉంటుంది. ఈ వ్యాసము కాపీహక్కుల పాఠ్యాన్ని తీసి సరి చేసినందుకు ధన్యవాదాలు. -- ప్రభాకర్ గౌడ్ నోముల చర్చ 07:26, 16 డిసెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
వెంకట రమణ గారు గోసంగి కులం గురించి క్షేత్ర స్థాయి లో తెలుసుకొని ప్రచురించండి.00:18, 27 May 2022‎ Rajesh jannarapu talk contribs block
Rajesh jannarapu గారూ మీరు ఈ వ్యాసంలో గోసంగి కులం గురించి మూలాలతో చేర్చవచ్చు. ఇందులో ఏవైనా దోషాలు మీకు ఉన్నట్లు అనిపించినపుడి వ్యాస చర్చా పేజీలో తెలియజేయండి. మూలాలలో సరైన సమాచారాన్ని చేర్చండి. కానీ మొత్తం సమాచారమంతా తీసివేయడం సరికాదు. అందువలన మీకు ఈ వ్యాసంలో మార్పులు చేయకుండా నిరోధించాను. గోసంగి కులం గురించి ఏవైనా పత్రికాలలో వచ్చిన మూలాలు, పుస్తక మూలాలు ఉంటే చర్చా పేజీలో తెలియజేయండి. ఈ వ్యాసంలో సరికాని పాఠ్యం ఏదైనా ఉంటే తెలియజేయండి.➤ కె.వెంకటరమణచర్చ 06:14, 27 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]
Thank you Ramana garu
వాస్తవానికి గోసంగిచరిత్ర వేరు మీరు పోస్ట్ చేసినచరిత్ర వేరు అందుకే దానిని తొలగించాను అన్యధా భావించకండి.. 2401:4900:2167:85FF:2:2:A000:AB77 18:14, 4 జూన్ 2023 (UTC)[ప్రత్యుత్తరం]

గోసంగి

మార్చు

గోసంగి

చారిత్రక అంశాల పరిచయం,                                                                                                భారతదేశం అతి ప్రాచీన చరిత్ర కలిగిన దేశం.హిందూ మహాసముద్రం బంగాళాఖాతం అరేబియా సముద్రం మూడు దిశల్లో ఉండి మరో దిక్కు హిమాలయాలు ఉండడంతో ఇక్కడ నివసించే వారికి చాలావరకు రక్షణ ఏర్పడింది.భూమి అత్యంత సారవంతమైనది కావడంతో పరిణామంలో మానవజాతి ఇక్కడ ఏర్పడి అతివేగంగా అభివృద్ధి చెందింది. క్రీస్తు పూర్వం 4000 నుంచి  200 వరకు సింధు నాగరికత విలసిల్లింది. అటు తర్వాత నదుల ప్రవాహాల్లో మార్పుల వల్ల ఆ సంస్కృతులు ధ్వంసం అయ్యాయి. అక్కడి వారంతా దక్షిణాది వరకు వ్యాపించారు. క్రీస్తు పూర్వం 600 లో గౌతమ బుద్ధుడు పుట్టాడు. అతను బౌద్ధాన్ని వ్యాప్తి చేశాడు. క్రీస్తుపూర్వం 300 కాలంలో మగధ సామ్రాజ్యం ఏర్పడింది. దక్షిణాదిన శాతవాహనులు పాలించారు. తర్వాత ఉత్తరాదిన గుప్తులు తర్వాత రాజపుత్రులు పాలించారు. దక్షిణాదిన చాళుక్యులు పాలించారు. తర్వాత ముస్లిం పాలన ఉత్తరాదిన ప్రారంభమైంది.                                                         తెలుగు ప్రాంతాన్ని చోళులు క్రీస్తు శకం తొమ్మిదో శతాబ్దం నుంచి పదవ శతాబ్దం వరకు పాలించారు.వీరు రేనాటి చోళులు,వెలనాటి చోళులు, పల్నాటి చోళులు, నెల్లూరు చోళులు, కొందరు చోళులు. వీరు తెలుగు సారస్వతానికి ఎంతో సేవ చేస్తూ ఐకమత్యంతో అనేక యుద్ధాలు చేశారు.ఈ చోళులకు సామంత రాజులు కూడా ఉండేవారు. నెల్లూరు  చోళులకు కాటమరాజు ఒక సామంతుడే ఈయన అనుమాయాలు చాలామంది గోసంగులు ఉండేవారు. నల్ల సిద్దిరాజుకు కాటమరాజుకు యుద్ధం జరగడంతో కాటమరాజు తరఫున పోరాడిన గోసంగుల వీరత్వం జానపద హృదయాలలో నిలిచిపోయింది నేటికీ ఈ వీర గాధను పాడుతూనే ఉంటారు.                                                   గోసంగి కుల చరిత్ర యాదవ పురాణం చుట్టూ అల్లుకొని సాగుతూ వస్తుంది. యాదవ పురాణం చెప్పే కొమ్ముల వారు ఈ గోసంగి సంతతికి చెందిన వాళ్ళుగానే కనిపిస్తున్నారు. యుద్ధ సైనికులు కాలంతరంలో పాలకులకు ఆశ్రిత  కులాలుగా మారిన చరిత్ర ఈ గోసంగులది. వైశ్య పురాణంలో విష్ణువర్ధనుని సైన్యం కన్యకు దాసులై వీరభద్రులుగా స్థిరపడ్డారు. అలాగే గోసంగులు యాదవుల తో పుట్టి యాదవుల తో పెరిగి యుద్ధ వీరులుగా కొమ్ములాడుతూ యుద్ధ రంగంలో సాగే చరిత్ర.                                                                                        

పుట్టుపూర్వోత్తరాలు:-                                                                                                                            గోసంగి జాతి పుట్టుపూర్వోత్తరాలు  తెలియాలంటే తెలుగు జాతి చరిత్ర సంస్కృతులు తెలియాలి అందులో ముఖ్యంగా వృత్తి సంస్కృతి గురించి బాగా తెలియాలి.  గోసంగిలుగా, గుర్తింపు పొందాలని ఉన్న  ఔత్సాహికులకు, కూడా వారి వృత్తి గురించి గానీ కుల సంస్కృతి గురించి గానీ అంతగా తెలియదేమోననిపిస్తుంది. బయట ప్రపంచం కంటే భిన్నంగా వృత్తి పురాణాల్లో గోసంగి ల పుట్టుపూర్వోత్తరాలు స్పష్టంగా కనిపిస్తుంది                                                                                            యాదవ పురాణంలో బీరినేడు పుట్టుకతోనే గోసంగిల పుట్టుక మొదలైనట్లు కనిపిస్తుంది పురాణ లక్షణాల్లో ముఖ్యంగా ఉండాల్సింది పౌరాణిక ఇతివృత్తంతం బీరీనేడు జన్మ వృత్తాంతం దీనికి సరిగ్గా సరిపోతుంది.                                                                           ఒకనాడు పార్వతి దేవి ముట్టైన తన చీరను తీసి బీరతీగల మీదికి విసిరేస్తే అందులోంచి పుట్టుకొచ్చినవాడు బీరినేడు.  ఆ పసిబాలుణ్ణి చూసి పోలురాజు భార్య సిరిదేవి చూసి మాతృత్వం పొంది బాలుడిని ఒడిలోకి తీసుకొని తన చనుపాలిచ్చి పెంచుకున్నది. ఉలువన్నా అనే గోసంగి వేరుని కూడా సిరిదేవి తన చను పాలిచ్చి పెంచింది. ఎంగిలి పాలు తాగారు కాబట్టి మీరు యాదవ కులానికి పరాన్న జీవులైనారు. వులవన్నేమో ఆలమంద  వద్ద కావాలిగా ఉంటే బీరినేడు యాదవులకు అశ్రిత కులాలుగా మారి కాటమరాజు పురాణ చక్రం చెప్పుకుంటూ వస్తున్నారు.    

                                                                                                               సేకరణ:- రాజేష్ జన్నారపు                                                                                                                                                                               

గోసంగిలు:

దక్షిణ భారతదేశంలోని తెలుగు మాట్లాడే ప్రాంతాలకు చెందిన అంటరాని వర్గాలలో ఒకటైన గోసంగిలను గోషికలు, గోసికొల్లు లేదా గోసంగోళ్లు అని కూడా అంటారు. ఎడ్గార్ థర్స్టన్ గోసంగి మరియు మాదిగ అనే పదాలను పర్యాయపదంగా ఉపయోగించారు మరియు దీనిని సమర్థించడానికి అతను మద్రాసులో 1901 జనాభా లెక్కల నివేదిక యొక్క సాక్ష్యాన్ని అందించాడు.                                                                                           సిరాజ్-ఉల్-హసన్ తన పుస్తకం, కాస్ట్స్ అండ్ ట్రైబ్స్ ఆఫ్ HEH నిజాంస్ డొమినియన్‌లో గోసంగి అనే పదం‘గో హంసకా’ నుండి వచ్చిందని పేర్కొన్నాడు,  ఈ వాదనకు మద్దతు ఇస్తూ, సిరాజ్-ఉల్-హసన్, గోసంగిలు ఆవుల కాపరులిగా జీవనోపాధి పొందుతారని నాగేంద్ర కె. ఆర్. సింగ్ పేర్కొన్నాడు. వారిని గోసికలు అని పిలుస్తారు కాలక్రమేణా గోసిక అనే పేరు చెడిపోయిందని అతను మరింత వివరణ ఇచ్చాడు.    వారి వృత్తులపై. ఈ ఉపకులాలు, కాలక్రమేణా, ఆశ్రిత కులాలు, ఉపకులాలు లేదా వారి స్వంత గుర్తింపు కలిగిన కులాలుగా విడిపోయాయి. సమాజంలో ఒక భాగమైన గోసంగిలు గోవుల కాపరుల జీవితాలను కొనసాగించారు.                                                                                                                            గోసంగిల గురించి మరింత వివరిస్తూ, పాలకుల సైన్యంలో సైనికులుగా పనిచేస్తున్న గోసంగి జాతి ప్రజలను గోసంగి సైనికులుగా పిలిచేవారని సిరాజ్-ఉల్-హసన్ పేర్కొన్నాడు. ఈ గోసంగి సైనికుల ప్రస్తావన మధ్యయుగ తెలుగు చోడుల చరిత్రలో కనిపిస్తుంది. కాటమరాజు వీరగాథలను వివరించే తంగిరాల వెంకటసుబ్బారావు రచించిన కాటమరాజు ఇతిహాసం ప్రకారం, నల్లసిద్ధితో జరిగిన యుద్ధంలో గోసంగి సైనికుల బృందం కాటమరాజు కోసం పోరాడింది.                                                                                                                      ఈ యుధ్దం ఎర్రగడ్డలపాడులో జరిగింది. మంగళిపాడు ప్రాంతానికి చెందిన గోసంగి యోధుడు బీరినీడు   వీరమరణం పొందాడు. అతను 6000 మంది గోసంగి సైనికులతో కూడిన సైన్యానికి నాయకుడు. ఇతిహాసం ప్రకారం, ఈ సైనికుల యూనిట్ వారు ఆవులను చంపడానికి ఉపయోగించిన అదే ఖడ్గాన్ని ఉపయోగించారు. ఇతిహాసం అందించిన ఈ చారిత్రాత్మక సాక్ష్యాన్ని బట్టి, ఈ గోసంగిలు తెలుగు చోడ రాజు నల్లసిద్ధి – III రాజ్యంలో నివసిస్తున్న గోసంగులుగా తెలియవస్తుంది.                                ఇంకా, గోసంగి యోధుడు బీరినీడు మరియు ఇతర గోసంగిలు యాదవ నాయకుడి క్రింద గోవుల కాపరులుగా మరియు పశువుల మందల సంరక్షకులుగా పనిచేశారని ఇతిహాసం వివరిస్తుంది.                                                                       కాటమరాజు మరియు నల్లసిద్ధి కి మధ్య మేత భూమిపై పన్నుల గురించిన ఒడంబడికలో విఘాతం ఏర్పడింది, చివరికి ఎర్రగడ్డలపాడులో జరిగిన యుద్ధంలో కాటమరాజు, బీరినీడు మరియు అనేక మంది గోసంగి యోధులు ప్రాణాలు కోల్పోయారు. ఇతిహాసం అందించిన ఆధారాలు గోసంగిలు కేవలం పశువుల కాపరులే కాదు. సైనికుల రక్షకులు కూడా.

గోసంగిల వృత్తాంతాలు:-యాదవ పురాణంలో గోసంగిలో వృత్తంధాన్ని తెలిపే ప్రాసాంఘిక పురాణాల కథలు అనేకం కనిపిస్తున్నాయి.శ్రీకృష్ణుని కాలంలోనే గోసంగి వీరుడు జాగిలాలు ఆవులమందలలో వరం వల్లే పుట్టాయి.కాటమరాజు ఉత్తరాదిలో ఆవులని మేపు కోవడానికి వెళ్ళినప్పుడు నల్ల సిద్ధితో జరిగిన యుద్ధంలో గోసంగిలే... ప్రధాన పాత్ర పోషించారు. మాతంగ గోత్ర పాలుండు జనులెన్నగా నుర్వి జాంభవకులుడ, వీరన్న వీరపుత్ర వినుత సాహనులు బీరన్న (బీరినేడు) మెరిసి గోసంగుల మెండుగా నడవ బిరుదుల నీడన బీరన్న కదిలే” అంటూ గోసంగి జాతి మూల పురుషుని గురించిన ప్రస్తావన ఒకటి కనిపిస్తుంది.ఈ బీరినేడు గోసంగి లకు రాజ్యం కావాలని అడిగిన తీరు యాదవ పురాణంలో కనిపిస్తుంది.“ధరణిశ మాకు ఒక రాజ్యమేర్పరిచి వరగంగ వరమిచ్చి పంపు మీ నన్ను”అంటూ బీరినేడు అడగగానే యాదవ రాజు విరివిగా నిను గొలుచు  వీర శూరులు న వర గంగ మంగలి పొడుస ‘ న నిలుపుమంటూ అతని రాజుని చేయగానే కొలువుండే బీరన్న కుల బాంధవులతో”

గోసంగి వీరులు కల్లందుల మారినేడు, నెరీబల్యాధుడు మసలి వేరు మొదలగు గోసంగులు ఉన్నారని యాదవుల కోసం యుద్ధ రంగంలో అసువులు బాసరనీ చెప్పడం కూడా వారి ఉనికిని తెలుపుతోంది.

                                                                                                                సేకరణ:- రాజేష్ జన్నారపు

 

నల్ల సిద్ధి రాజు భార్య కుందుమాదేవి తన పెంపుడు చిలుకలను ఉసిగొల్పి కాటమరాజు ఆలమందల్ని పొడిపించింది. దానికి ప్రతీకారంగా నెల్లూరు పట్టణాన్ని ముట్టడించిందిగోసంగి వీరులే. వారు ధర్మగ్రహంతో పోయి బోయలతో తలపడి ఐదుగురు బోయల తలల్ని నరికి తెచ్చి విశ్వాసాన్ని చాటుకున్నారు. బీరినేడు తన ఏనుర గోసంగి వీరులతో కలిసి యుద్ధంలో కొన ఊపిరి ఉన్నంతవరకు శత్రువులతో పోరాడి అసువులు బాసాడు. యాదవ రాజుల్లో చివరివాడైన భక్తిరన్న కాలంలో కొమ్ము కీసరేడు, దారంభినేడు, నల్ల సిద్ధి రాజు నీ ఎదిరించి పోరాడారు.తమ కోసం ప్రాణాలర్పించినందువల్ల, భక్తి రన్న ఈ కొమ్ముల వారికి యాదవ కథలు చెప్పే మిరాశి హక్కు శాసానాన్ని రాసిచ్చాడు. గోసంగిల వృత్తి ప్రస్తావన యాదవ పురాణంలో కనిపిస్తుంది. వీరు జాంబాబుని వారసులనేది సుస్పస్టం. అయితే పూర్వం మీరు యాదవ రాజులకి ప్రత్యేక సైన్యంగా కొనసాగి, భక్తిరన్న కాలానికి రాజ్యాలు అంతరించగానే, అశ్రిత కులాలుగా మారారనే దాన్ని వృత్తి పురాణాలు ధృవపరుస్తున్నాయి.

యాదవ పురాణాలు చెప్పే వృత్తాంతాల ఆధారంగా గోసంగులలోని ఒక తెగ కొమ్ముల వారైనారని చెప్పే అవకాశం ఉంది. గొల్ల సుద్దులు చెప్పే కథల్లో భక్తిరన్న కాశి నుంచి 12 మంది శిష్యులని (కళాకారులని) వెంట తీసుకువచ్చి యాదవ కథలు ప్రచారం చేయవలసిందిగా ఆజ్ఞాపించారని వారితో పాటు కొమ్ముల వారికి కూడా మీరాశి హక్కులు ఇచ్చాడు అనేది కూడా కనబడుతుంది. చారిత్రాత్మకంగా పరిశీలిస్తే నిజంగా గోసంగి ల వృత్తి సైనిక వృత్తిగానే కనిపిస్తుంది అందులో కొందరు రణరంగంలో కొమ్ములూది సైనిక సంరంబం చేసేవారు. కాబట్టి రాజ్యాలు పతనమైన తర్వాత కొమ్ముల వారికి యాదవ పురాణాలు చెప్పే హక్కు భుక్తమైంది

గోసంగి జాతి మూలపురుషుడైన బీరినేడు సంతతివారే ఈ కొమ్ముల వారనేది పురాణాల్లో కనిపిస్తుంది. యాదవుల తల్లులు చనుపాలు ఇచ్చి పెంచిన వారే కాదు ఈ కొమ్ముల వారు యాదవుల జీవితాలతో తమ జీవితాలను పెన వేసుకున్న వారు కూడా, మీదు మిక్కిలి స్థానికులు అందుకే యాదవులు గొల్ల సుద్దుల కంటే కూడా వీరిని ఎక్కువ ప్రేమాభిమానాలతో ఆదరిస్తారు..

ప్రదర్శించే కళారూపమేది:-

జానపద కళారూపాలెన్నో వృత్తి పురాణాలకు మాధ్యమాలుగా,ఉపయోగపడుతూ వచ్చాయి. చిత్రపటం మాధ్యమంగా కొమ్ముల వారు ప్రదర్శించే ఈ కళారూపం కాస్త భిన్నంగా ఉంటుంది. సామాన్యంగా ఉండే  చిత్రపటం గుడ్డ మీద రంగులతో బొమ్మలు చిత్రించి యాదవుల కుల దైవాలైన గంగాదేవి, కాటమరాజు, కథనాలతో కూడిన బొమ్మల్ని పెద్ద గుడ్డల మీద అతికించి చిత్రపటాన్ని తయారు చేస్తారు. దీనిని ప్రదర్శించేందుకు ప్రత్యేకంగా గుడారాలు వేసి ఆ గుడారాల కోసం నిర్మించిన గోడలకు ఈ అతుకుల చిత్ర పటాన్ని కట్టి దాని ఆధారంగా యాదవ పురాణాన్ని చెప్తారు. కథ గానానికి సహకార వాద్యాలుగా, కొమ్ము, వీరణాలు , తాళాలు వీరత్రాడులు మొదలైన వాటిని ఉపయోగిస్తారు. ఇవేగాక ఒంటి కొమ్ము బొల్లావు బొమ్మ, బసవ దేవుని విగ్రహాలు, కూడా కథా గానానికి ఉపయోగపడతాయి. ముగ్గురు లేదా నలుగురు ఒక బృందంగా ఏర్పడి ఈ కథ గానం చేయడం ఒక సాంప్రదాయంగా వస్తుంది. తెర చీరల మాధ్యమంగా కాటమరాజు పురాణ కథ గానం చేయడం వల్లనే కొమ్ముల వారికి తెరచీర భక్తులను పేరు వచ్చింది.

సాహిత్యంశాలు:

కాటమరాజు కథలతో పెను వయసుకుపోయినవే గోసంగి కథలు ప్రధాన కథ స్రవంతిలో అనుషంగిక పురాణాలుగా అవి కొనసాగిపోవడం సాటిలైట్ లక్షణాల్ని తెలియజేస్తుంది.యాదవ పురాణమంతా దేశీ చందంలోనే సాగిపోయింది. కథాగేయానికి ద్విపద చందమే ఎంతో అనుగుణంగా ఉంటుంది. ఆశ్రిత కళాకారులు చేసే కథ గానంలో ద్విపద పదాలు తమ రూపాన్ని కోల్పోతుంటాయి. గానయోగ్యంగా ఉండేందుకు ఏర్పరచుకున్న బాణీలవల్లనే ద్విపద కాస్త మంజరి ద్విపద లోకి జారిపోతుంది. అప్పుడప్పుడు జానపదులకు ఇష్టమైన పొలాల్లోకి మారి అద్భుత గానంగా సాగిపోతుంటుంది. సన్నివేశాన్ని బట్టి సాహిత్య తీవ్రత గంభీరథ చోటు చేసుకుంటుంది. యుద్ద రంగంలో, వీరమరణాల్లో, వేగవంతమైన దరువుల్లో రౌద్రం చోటుచేసుకుని ఉగ్రంగా కనిపించే సాహిత్యమే దర్శనమిస్తోంది. యాదవల వృత్తి పురాణం ఆధారంగా సాగే గోసంగిల కథల్లో కనిపించే    .గోసంగి వీరుల్లో ప్రథమంగా దర్శనమిచ్చేది కల్లందుల మారినేడు, మసిలినేడు కల్లందుల మారినేయుడు బల్లెంబు వడ తిప్పే పటు రౌద్రగతిని రమ్ము నాతో యుద్ధ రంగంబు కనుచు, కాటమరాజు ఎదురొమ్ము నాటి, గదమి బల్లెం రవిగానగా బొడిచే ఇమ్మడక్కను రాజు నేల మీద కూర్చి, పూర్వీపై మరదలిచి ఒరిగే మారన్న, అంటూ జానపదులు ఆయన ప్రతాపాన్ని, వీరమరణాన్ని, అద్భుతంగా వర్ణించారు.

                                                                                                               సేకరణ:- రాజేష్ జన్నారపు                                                                                                 

ముసలి నాయందు వీరబల్లానుపై విరగబడినంత కసిధీర బల్లానుని వెనుశిరం దృంచి, పోల్రాజు తలచి ధర గూలే మసిలన్న, అంటూ సాహసంగా ఎదుర్కొని వాడిని సంహరించి తాను యుద్ద భూమిలో ఒరిగిపోయిన పోయిన సన్నివేశం కూడా అద్భుతంగా వర్ణించారు.  గోసంగి వారు యాదవుల దాయాదులుగానే ముసులుతూ వచ్చారు. యాదవ రాజు మంగలి పాడు రాజ్యాన్ని వారికి ఇచ్చింది దాయాది భాగం కిందనే అనేది విస్మరించవద్దు. ఈ అనుబంధాన్ని అనుసుతంగా వచ్చే కథ గానంలో చూస్తే తప్ప మనం నమ్మలేము కదా! పేరు గల మాతంగ బిరుదు సాహసుడ! వరి శౌర్య గుణధీర వార్త మన్నీడ, అటు గనుక మీకు మా కాదు విష్ణుడు కట్టడి చేసి నట్లు గావించినాడు.మాకు మీరన్న ఇట్లు మర్యాద గలదు. యుగములు జగములు ఉన్నన్నాళ్ళు, మీకు మాకు దాయాదులుగా, లక్షణంబుగా, ఏమి లాభంబులేక, పక్షపాతము లేక పంపుగా వింతు, అని కాటమరాజు అనడం లోనే ప్రాచీన యుగం నుంచే పాలీ భాగాలు ఉన్నాయనేది అర్థమవుతుంది.

యాదవ వీరులు యుద్ధరంగంలో మరణిస్తే, యాదవ సతులు సతీసహగమనం చేసినట్లుగానే, గోసంగి వీరులు రణంలో మరణిస్తే మాతంగి సతులు సతిసహగమనం చేసే మరొక ముఖ్య అంశం కూడా ఈ పురాణంలో కనిపిస్తుంది.గోసంగి మారినేని, మారమ్మ సతీసహగమనం చేసేటప్పుడు కూడా, వర్ణన అసామాన్యంగానే కనిపిస్తుంది. అంతట మార్నేనీ అతివ మారమ్మ తరలాక్షి వేంచేసి తన విభూనీ చూసి చరణంలపై వాలి చిరునవ్వు నవ్వి పుప్పర్ల పిలిపించి ఒప్పుగానప్పుడు, కర్పూర వీడ్యమూల్ కట్నాలు ఇచ్చి, సరుగున త్రవ్విరి సరస గుండం బు చందన తరవులు చాలవేయించి,పొందిమిచరపుడు పొసగ గుండముల తెగువతో నేతెంచే తెరవ నవ్వుచును అగ్నికి మారెమ్మ అయేత్త పడెను. దండ మెప్పుగా పెట్టీ ధర్మ సభ కెల్ల గుండబు దుమికె గురువు సెలవంద అంటూ దళితుల సతీ సహగమణాన్ని కళ్లకు కట్టించారు. జానపదులు.

దాయాదుల భాగాలు, రాజ్యాల పంపకం లోనే కాదు, అనాథ పిల్లలైన గోసంగి పిల్లలను పెంచడం లోనూ కనిపిస్తోంది.మారెమ్మ సతీ సహా గమనం చేసిన తరువాత మసిలినేనీ కుమారు మరి బీరినేని వంతు కెక్కినయట్టి పరసతుల తెచ్చి, శిశువు పెంచగ దమ్ము సిరీదేవి నీవు. స్థన్య పానములుగ సఖియ లేవరో చిన్ని బాలల అంది చేరదీయమ్మ అంటూ అనాధలనిచ్చారు.ఇందులోని సాహిత్యాన్ని ఏ సన్నివేశం లో చూసిన హృదయం పరవశించి పోక తప్పదు.

పల్నాటి బ్రహ్మ నాయుడు కాలం లో గోసంగులు:-

గోసంగులు క్రీ.శ.9-10 శతాబ్దాలలో ఉత్తర భారత దేశం నుండి, దక్షిణానికి వచ్చినట్లు,పల్నాటి గ్రంథ ప్రమాణాలు ధృవ పరుస్తున్నాయి.వీరూ తొలి నాళ్లలో జైన మతాన్ని పాటించారు. గోసంగులలో మూడు శాఖాలున్నాయి.                     1)దైవపూజలో పాల్గొనే వారు దాసులుగాను,2) మత ప్రచారం లో గోసంగులుగాను 3) చరిత్ర గానం చేసేవారు వీర విద్యావంతులు/వీర గంధాలు గాను చెప్ప బడినారు. వీర విద్య వంతులు వైష్ణవ శాఖకు, వీర గాంధలు శైవ శాఖకు చెందిన వారిగా గుర్తించ బడినారు.                                                                                                          గోసంగులు అంత గొప్ప యుద్ద వీరులు, ప్రభు భక్తి పారాయణులు,యుద్ధ భూమిలో సైన్యం లో ముందు వరుసలో ఉండి, శత్రు సైన్యాలను, ఎదుర్కునే వారు, ఆత్మ శుద్ది, ప్రభు భక్తి,దేశ భక్తి, నిండుగా నింపుకొన్న, యోధులు ధర్మ ధర్మ విచక్షణ పరులు,ధర్మ మార్గంలో శత్రువు ఉన్నప్పటికీ, హర్షించి హత్తుకునే స్వభావం కలవారు.                                                                    గోసంగుల లోని దాసులు దళితులు గా పరిగణింప పడినప్పటికీ ఆ కాలం లో బ్రాహ్మణ వర్గాలతో సమాన ప్రతి పత్తిని అనుభవించారు.మధ్య యుగం లో దండలు కట్టి దేవునికి సమర్పించడం వద్ద నుండి దేవాలయాలలో భక్తి గీతాలాపన చేయడం, అర్చకత్వం నిర్వహించడం వంటి ఉన్నత ప్రమాణాలతో జీవించారు.                                                                పల్నాటి చరిత్ర 12 వ శతాబ్దికి చెందినది శ్రీనాథుడు ఈ గాథను పలనాటి  వీర చరిత్ర గా, 15 వ శతాబ్దిలో ద్విపద సాహితీ ప్రక్రియ లో కావ్య కరణ గావించారు. శ్రీనాథ కావ్యం లో గోసంగుల ప్రస్తావన స్పష్టంగ ఉంది.పలనాటి వీర చరిత్ర లో మాచర్ల రాజ్య సైన్యాధ్యక్షుునీ గోసంగి కన్నమ నీ పేర్కొనడం జరిగింది.                                                                              యుద్ద పరిణామాలు గమనించిన సందర్భం లో బ్రహ్మ నాయుడు సైన్యం లో ఇరవై నాలుగు వేల మంది గోసంగులు ఉండే వారని స్పష్టమైంది.యుద్ధ భూమికి గురిజాల మాచార్ల సైన్యాలు చేరుకున్న తరువాత నాయకురాలి ప్రతి పాదన  మూలంగా ఇరు రాజ్యాల మధ్య సంధి సపలమై యుద్దం నిలిచి పోవడానికి దోహదం కలిగింది.                                                        ఈ యుద్ద రంగం లో బాల చంద్రుని దుందుడుకు ఆగాడల మూలముగా సంధి సఫలమైన నేపథ్యంలో నాయాకురాలిపై యుధ్దం చేయడానికి కారణం లేదని ఆమె సంధి చేసుకోని శాంతి మార్గం చూపిందని అందువలన ఆమె సైన్యం పై యుధ్దం చేయడం లో అర్దం లేదని చెబుతూ గోసంగులంత ధర్మ విశ్లేషణ చేసి యుద్ద రంగం నుండి వైదొలుగుతారు.                                                                                                                                    B                                                                                                           సేకరణ:- రాజేష్ జన్నారపు    ఈ విధంగా నాయకురాలి పక్షం శత్రు వర్గం అయినప్పటికీ ధర్మ, ధర్మ విచక్షణ తో ఆమె పట్ల సానుబూతి తో వ్యవహరించిన గోసంగులు నీతి మంతులుగా నిలిచిపోయారు. గోసంగుల మద్దతు కోసం, మారు దూత తోను, మరో మారు స్వయంగా బ్రహ్మ నాయుడు రాయ భారం నడిపిన మాటకు కట్టుబడి వారు తిరిగి యుద్ద భూమికి రాలేదు.                                        గోసంగి కన్నమ రెండు రాజ్యాలుగా విభజన జరిగిన తరువాత మాత్రమే మాచర్ల రాజ్యానికి సైన్యాధ్యక్ష పదవి లోకి వచ్చాడు. కన్నమ దాసుని బ్రహ్మ నాయుడు మానస పుత్రునిగా స్వీకరించి సైన్యాధ్యక్షుడు గా, గౌరవించి గొప్ప దళిత ప్రేమికుని గా కీర్తింప బడినాడు.

అయితే కన్నమ దాసు కి సైన్యాధ్యక్ష పదవి ఎవరో ఇస్తే పుచ్చుకునే బిక్ష కాదు, ఎందుకంటే కన్నమదాసు తండ్రీ తెప్పలనీడుపల్నాడు రాజ్య వ్యవస్థాపకుడైన అనుగు రాజు ఆస్థానంలో సైన్యాధ్యక్షుడు. ఇతను అరగండ్ల యుద్ధంలో మరణించాడు.ఈకార్యక్రమంలో పారంపర్య సంస్కృతి నడిచే రాజరీక వ్యవస్థలో తండ్రి తిప్పలనీడు సైన్యాధ్యక్ష పదవికన్నమదాసు కు లభించడం సాధారణ విషయమే,

సైన్యాధ్యక్షునిగా, కన్నమదాసుని తప్పించి అలరాజును ఆ స్థానంలో నియమించాడు. అలరాజు మరణాంతరం తిరిగి ఆ పదవి చేపట్టిన కన్నమదాసు కు యుద్ధభూమిలో బ్రహ్మనాయుడు సైన్యాధ్యక్షుడు గౌరవం ఇవ్వలేదు. తొలుత బాలచంద్రుని సైన్య అధ్యక్షునిగా ప్రథమ తాంబూలం ఇచ్చి యుద్ధం ప్రారంభం చేయగా, బాలచంద్రుని మరణాంతరం కొమ్ము రాజు కి సైన్యాధ్యక్షుడు గా గౌరవం లభించింది. అనంతరం తానే సైన్యాధ్యక్షుడు అయ్యాడు. బ్రహ్మన్న సైన్యాధ్యక్షునిగా రణభూమికి చేరే నాటికి కన్నమదాసు యుద్ధంలో మరణించాడు. ఈ విధంగా గోసంగి కన్నమను బ్రహ్మనాయుడు పలు విధాలుగా వంచించాడు. గోసంగి కన్నముకు సైన్యాధ్యక్ష పదవి జన్మహక్కు. వాస్తవానికి గోసంగులు పల్నాడు ప్రాంతానికి వలస రాకమునుపే వివిధ ప్రాంతాల

లో చెన్నకేశవ స్వామి ఆలయాల్లో అర్చకులుగా ఉన్నట్లు చరిత్రలో ధ్రువ పడుతుంది. బ్రహ్మనాయుడు మంత్రి పదవి స్వీకరించక పూర్వమే పల్నాడు రెండు రాజ్యాలుగా చీలిపోకముందే గోసంగులు ఆలయ అర్చకత్వం నిర్వహించేవారు.

పల్నాటి యుద్ధానంతరం పల్నాటిలలో తీవ్ర కరువు పరిస్థితి ఏర్పడి, జీవనాధారం కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిపోయారు, బ్రహ్మనాయుడు సైన్యంలో అన్ని జాతుల వీరులు ఉండేవారు అందులోనూ పంచములకు గోసంగులని పేరు…18వ శతాబ్ది వరకు పల్నాడు ఔరంగాజేబ్ ఆధీనంలోకి వచ్చేనాటికి మాచర్ల ఆలయానికి గోసంగి దాసులే అర్చకులు, ఔరంగాజేబు పాలన సౌలభ్యం కోసం రామరాజ మంత్రప్పను దేశముఖలుగా 'కుమారా' వంశజుని దేశ పాండ్యాగా నియమించిన సందర్భంలో ఈ పాలకులు మాచర్ల చెన్నకేశవ ఆలయ అర్చకులుగా వైష్ణవాచార్యులను నియమించుకొని అప్పటివరకు అర్చకత్వం నిర్వహిస్తున్న గోసంగుల స్థానాన్ని కోల్పోయేలా చేశారు.

కారంపూడి  యుద్దానంతరం కాలగమనంలో గోసంగులు వారి పూర్వ స్థావరాలకు ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు.

కొందరు వారి పూర్వ ప్రాంతమైన ప్రొద్దుటూరుకు సమీపంలోని పెన్నా నదికి ఆవలగల మాలపాడు చేరారు. కొందరు పశ్చిమగోదావరి జిల్లా భీమవరం ఉప్పులూరు చేరారు.

చందవోలు దుర్జయ గొంక రాజులకు పల్నాడు స్వాధీనమైన కాలంలో కుందూరు చోడుల ఆశ్రయంలో మహబూబ్ నగర్ జిల్లా అచ్చంపేట తాలూకా అమరాబాద్ మండలంలోని మధవాని పల్లె చేరి అక్కడి రాయల గండి కొండలమీద నిర్మించుకున్న వారి పూర్వపు దేవాలయాలైన చగోసవ స్వామి ఆలయానికి అర్చకత్వం నేర్పిన వారు దాశరథి వారు.

గోసంగి కన్నమదాసు కు చెందిన వంశోజులు గోసంగులు వివిధ ప్రాంతాలకు తరలిపోవడం జరిగింది.                      కన్నమదాసు వంశస్థులు నెల్లూరు జిల్లా ఉదయగిరిలో ఉన్నట్లు సమాచారం                                                                                  సే                                                                                                                       సేకరణ:- రాజేష్ జన్నారపు.                                                                                                               కారంపూడి లో వీర్ల గుడి ప్రాంగణంలో నాటి పల్నాటి యుద్ధభూమిలో వాడేనా ఆయుధాలు వీటిని కొన తాళ్ళు అంటారు. మాచర్ల మినీ ట్యాంక్ బండ్గా  పిలవబడే అంబేద్కర్ సెంటర్లోని కన్నమదాసు కాంస్య విగ్రహం ఉందని సమాచారం.

ఒక వ్యక్తి ముఖ్యమైన పదవిలో ఉన్నప్పుడు ఆయన అనుచరణ కూడా కనిపిస్తుంది అట్లా కనిపించినదే  24 వేల మంది గోసంగి సైన్యం.

పల్నాటి కాలం నుండే గోసంగులు ఉన్నట్టు వారు సైనికులుగా, ఆ కాలం లో తమ విధిని నిర్వర్తించారని తెలుస్తున్నది.

క్రీ.శ 12 వ శతాబ్దం కాటమ రాజు కాలం లో గోసంగుల ఉనికిని తెలియజేసే అంశాలు:-

నెల్లూరు రాజ్యం లోని పచ్చిక బీళ్ళలో తన గోగణము మేపుకొనుటకు కాటమరాజు నెల్లూరు పాలకుడైన నల్ల సిద్ది (మనుమ)సిద్ధితో పుల్లరి( సుంకము, పన్ను) చెల్లించుటకు ఒప్పందం చేసుకొనెను. నెల్లూర్ సీమ లో ఉన్నంత కాలం తన మందలో పుట్టిన కోడె దూడలను నల్ల సిద్ది కి ఇత్తునని ఒప్పుకొనేను. ఈ ఒప్పందం ప్రకారం ఆల మందలు పచ్చిక బీళ్ళలోనే మేత మేయాలి. కాని పశు గణము వరి పొలం (పంట పొలం) సైతం విడవ కుండా మేయ సాగేను, అందువల్ల నల్ల సిద్ధి భార్య కుందుమా దేవి బోయలచే కాటమ రాజు ఆలమందలను పొడిపించేను.నల్ల సిద్ధి కి ఈ విషయం తెలియదు.గో హత్యలు నల్ల సిద్ది యే చేయించెను అని అపార్థం చేసుకొని కాటమ రాజు పుల్లరి చెల్లించడం మానివేసెను.                      

అది వారిద్దరి మధ్య యుద్దానికి కారణమైంది.క్రీ.శ. 12 వ శతాబ్దం నాటికి  గోసంగులు ప్రత్యేకంగా గుర్తింప బడ్డారు. వీరు గొప్ప పరాక్రమ వంతులు,అనేక యుద్ధ తంత్రములు తెలిసిన వారు.            

కాటమ రాజు తరుపున గోసంగి దళానికి చెందిన బీరీనేడు   మసిలన్న (మసిలినేడు) ( ఇతను కూడా గోసంగి వీరుడే) వీరందరూ కలిసి తమ ఆరువేల సైన్యముతో యుధ్దం లో పాల్గొన్న సంఘటనలు మొదటి, రెండు సంపుటాలలో తంగిరాల వెంకట సుబ్బారావు గారు చాలా చక్కగా పేర్కొన్నాడు.

బీరినేడు యుధ్దం:-

పాల్గుణ  బహుళ ఏక దశి నాడు, బోళ్ళావు  వైకుంటమేగంగా, ద్వాదశి నాడు బీరినేడు యుధ్దం చేసెను.ఆ రోజు శనివారం కావలెను”మంగిల్లి పాడు ఠా ణ్య మున వేచి ఉన్న గోసంగి వీరుడు ఆరు వేల  గోసంగి దళమునకు నాయకుడు కొంగ వాలు కత్తి, గోసంగి వీరుల ఆయుధం ఇతని తండ్రి మసిలినేడు బల్లి కురువ యుద్ధమున మరణించెను. తల్లి సతీ సహా గమనం చేసింది.

అడ్డావుకట్ట దగ్గర బొల్లావు మరణించగా, నల్ల సిద్ధి సైన్యంల ఆ  ఠా ణ్య మును విడిచి మరికొంత ముందునకు నడిచి మంగల్లి పాటికి వచ్చి నిలిచెను, సిద్దిరాజు రాకను జూచి బీరీనేడు తన గోసంగి వీరులను పిలిచెను. నాలుగు వేల గోసంగులు వచ్చి బీరన్నను కీర్తించిరీ బీరన్న ఆ గోసంగి వీరులతో కలిసి అయితమ రాజు కడకేగి యుద్ధమున కనుజ్ఞ వేడెను. తరువాత వీర భద్రుని ప్రార్థించి, అతని విశ్వరూపాన్ని పొంది తన కత్తి పదును చూచుటకై ఒక మద్ది మాను ను నరికినాడు.(గంగ జాతరలో నేటికీ మద్ది మ్రానుని నరుకుట ఒక  ముఖ్య భాగం) బీరినేడు వేషం వేసిన వ్యక్తీ కత్తి నీ చేత బట్టి ఊరి బయటకు పోయి అట భూమి లో పాత బడి యున్న అరటి బొదను నరుకును.

తరువాత తన గోసంగులతో కలిసి నల్ల సిద్ది సైన్యం పై బడెను.

                                                                                                                                 సేకరణ :- రాజేష్ జన్నారపు

బారులై యుండెడు బలముల జూచి                                                                                                                యుగ్రుడై బీరన్న యురిమి తాజూచి                                                                                                                       చేతి పట్టి కత్తి చెరిగి జలిపించే                                                                                                                           తళుకు తళుకు మెరిసే దందర కుడువ.                                                                                                             గొదకొని బీరన్న గోసంగులంత    

                 ఇట్లు ఘోర రణం చేయుచున్న గోసంగి వీరులను జూచి నల్ల సిద్ది రాజు కలవరమొంది.తన సరదారులైన పరాకును బాపెను.వారును ఉత్సహపూరితులై గోసంగుల పై విజ్రంభించిరి.  గోసంగులును బీరినేడు ను గొంత తడువు యుధ్దం చేసి బీరినేడు ను గోసంగులను మరణించు సరికి ప్రొద్దు గూకెను.నల్ల సిద్ది అట దగ్గరలో నున్న “కొప్ప కొండలో గుహలెక్కువ కలవని అక్కడ విస్మరింపదలచి తన సైన్యముతో నా కొండకడకేగేను.ఆ కొండ దగ్గర కాచియున్న “కొమ్ము కసినేడు”తలి కొండ పాడులో నున్న దార సంబినేడు అను వీరులిర్వురును నల్ల సిద్ది నేదిరించిరీ వీరును కాటమరాజు పక్షమునకు చెందిన గోసంగి వీరులే వీరితో పోరుసరికి తెల్లవారెను.  

      గోసంగి వీరుడగు మసిలినేడు అతని భార్య పేరు కూడా మారెమ్మయే  ఈ మసిలినేని కుమారుడే బీరినేడు. ఈ ఇరువురు వీరులును ముక్కంటి మనుమలతో పోరాడిరీ.  

(శ్రీశైలం నుండి బాల రాజుల సహయమని కల్లందుల మారినేడు గోసంగి వీరుడు, మసిలినేడు, బొల్లావు ఏడు ఎద్దుల బల్లి కురువ కు వచ్చుట)  

గోసంగి వీరుడగు మసలి నేడు అతని భార్య పేరు కూడా మారమ్మయే ఈ ముసలి నేని కుమారుడే బీరినేడు ఈ ఇరువురు వీరులును ముక్కంటి మనుమలతో పోరాడిరి భైరవరాజు కనుమలలో మరణించినది ఒక్క కళ్ళందుల పోలినేడు మాత్రమే ఇతడు కళ్ళందుల మారినేని కుమారుడు.

(శ్రీశైలం నుండి బాలరాజుల సహాయమని కళ్ళందుల మారినేడు గోసంగి వీరుడు మసిలినీడు బొల్లావు ఏడెద్దులు బల్లికురవకు వచ్చుట.)

వీరందరూ కలిసి శ్రీశైల వాసునికి పూజ కార్యక్రమాలు చేసి, భోజనం చేసి, పోదాం అనుకున్న సమయంలో పిడుగు లాంటి వార్త వారికి చేరింది. యుద్ధం నందు పళ్ళావు పోల్రాజు ఒరిగిన వార్త విని నిశ్చేస్తులైనారు.

గోసంగి లేనురు గోపాల మరులు

అసహయ లేనూరు అమిత విక్రములు

మదిగ జంబులకైనా మనము వెరమింక

వచ్చిరి గోసంగి వర సమూహంబు

చొచ్చి పొడిపొంతుము చొరవలు గాను.

                                                                  2401:4900:2167:85FF:2:2:A000:AB77 18:16, 4 జూన్ 2023 (UTC)[ప్రత్యుత్తరం]

బాగా రాసారు

మార్చు

Nice 2409:408C:2C9E:BC8A:0:0:4C8:9D11 15:38, 18 ఫిబ్రవరి 2024 (UTC)[ప్రత్యుత్తరం]