వికీపీడియా చర్చ:తెవికీ దశాబ్ది ఉత్సవాలు-Tewiki 10th Anniversary/Sponsors

కనీస మొత్తం?

మార్చు

కనీస మొత్తం మరీ ఎక్కువగా వుండి వికీస్ఫూర్తికి భిన్నంగా వున్నట్లుంది. ఎంత మొత్తమైనా స్వీకరించి ఎక్కువమొత్తం ఇచ్చేవారికి కలిగే లాభాలు వివరించడం మంచిది --అర్జున (చర్చ) 04:35, 13 డిసెంబర్ 2013 (UTC)

అర్జున గారికి కనీస మొత్తం ఇంత అని వికీ స్పూర్తిని ఎంతమాత్రం తక్కువ చేయడం మా అభిమతం కాదు. అయితే చిన్న చిన్న మొత్తాల బిల్లులకు, ఓచర్లు లాంటివి ఇవ్వడం కష్టసాద్యం అవుతుందనే ఉద్దేశ్యంతో అలా కనీస మొత్తం అని చెప్పటం జరిగింది...విశ్వనాధ్ (చర్చ) 08:03, 13 జనవరి 2014 (UTC)Reply
  • విశ్వనాధ్ గారికి, మీ స్పందనకు ధన్యవాదాలు. రసీదు మరియు దాని బట్వాడా ఖర్చుకంటే ఎక్కువగా ఎంత ఇచ్చినా తీసుకోవటం మంచిది.వికీమీడియా భారతదేశం లేక సిఐఎస్ కి బ్యాంకు ట్రాన్స్ఫర్ ద్వారా విరాళం తీసుకునే వీలున్నప్పుడు మరియు ఆయాసంస్థల ద్వారా రసీదులు పంపించే వీలున్నప్పుడు కనీస మొత్తం తగ్గించమని కోరుతున్నాను. --అర్జున (చర్చ) 09:04, 13 జనవరి 2014 (UTC)Reply
  • అర్జునగారూ తప్పని సరిగా మార్చుదాము. ఇప్పటికే దశాబ్ధి ఉత్సవాలకొరకై విష్ణు, మరియు రాధాకృష్ణ వంటి వారు కొంత విరాళం ప్రకటించారు. వాటిని ప్రదర్శించాలా లేక కార్యక్రమంలోనే తగిన గుర్తింపు ఇవ్వాలా. సభ్యులు సలహాలు సూచనలు ఇవ్వగలరు..విశ్వనాధ్ (చర్చ) 11:10, 13 జనవరి 2014 (UTC)Reply
  • విశ్వనాధ్ గారికి, విరాళాలిచ్చినవారికి ఏ విధంగా గుర్తించాలన్నది కార్యనిర్వాహకవర్గం చర్చించి నిర్ణయం తీసుకుంటే మంచిది. కనీస మొత్తం తగ్గించడం గురించి స్పందన ఇంకా తెలపలేదు. దానిగురించి త్వరలో స్పందించండి.--అర్జున (చర్చ) 01:48, 24 జనవరి 2014 (UTC)Reply
  • అర్జున గారూ, మీరు చెప్పిన వికీస్ఫూర్తికి మంచి సూచనే. కాకపోతే కనీసం 5,000/- విరాళం లిమిట్ వల్ల విరాళ సేకరణ కార్యవర్గానికి ఆచరణ సాధ్యమౌతుంది. చిన్న విరాళాలతో సమయం వెచ్చించడం ప్రస్తుతం కార్యవర్గం చేయలేని పని. ఈ నిర్ణయం దశాబ్ది కార్యక్రమం జయప్రదం చేయడానికి కార్యవర్గానికి ఉన్న తక్కువసమయం దృష్టిలో ఉంచుకొని తీసుకున్న నిర్ణయం. ఇది వికీస్ఫూర్తికి భిన్నం కాదని గమనించగలరు. ఏ దాత నుండి 5,000/- కంటే ఎక్కువ మొత్తం వచ్చినా వారి ఓదార్యాన్ని గుర్తిస్తూ వారి పేరును తెవికీ దశబ్ది ఉత్సవాల పేజిలో మరియు వారికి ఒక అదనపు మొమెంటో మరియు టీ షర్టు ఇవ్వబడతాయి....దశాబ్ధి కార్యవర్గం....విశ్వనాధ్ (చర్చ) 05:02, 24 జనవరి 2014 (UTC)Reply
Return to the project page "తెవికీ దశాబ్ది ఉత్సవాలు-Tewiki 10th Anniversary/Sponsors".