వికీపీడియా చర్చ:యాంత్రిక అనువాద వ్యాసాల సంస్కరణ
మెరుగు చేయుట
మార్చుఈ రచనను వ్యాసంగా పరిగణించలేము. వికీపీడియా అభివృద్ధి కోసం వ్రాసిన మార్గదర్శకాలు, సూచనలు ఇందులో ఉన్నాయి. కనుక దీనిని వికీపీడియా నేమ్ స్పేసుకు మార్చడం సముచితమని నా అభిప్రాయం. అంటే వ్యాసం పేరు అనువాద వ్యాసాల సంస్కరణ నుండి వికీపీడియా:అనువాద వ్యాసాల సంస్కరణ గా మార్చాలి. మరియు ఈ వ్యాసానికి లింకు అనువాదాలు ప్రాజెక్టు పేజీనుండి ఇవ్వాలి. --కాసుబాబు 15:08, 26 సెప్టెంబర్ 2011 (UTC)
- కాసుబాబు గారూ మీ అభిప్రాయం సబబైనదే. దీనిని తెవీకీ వార్త కొరకు అర్జునరావు గారి కోరిక మీద వ్రాసినది. అందుకే ఈ వ్యాసం యొక్క లింకు నా సభ్య పేజీలో ఉంది. ఆయన దీనిని ఉపన్యాసంగా మార్చమని సూచించారు. కనుక మార్పులు చేయవలసి ఉంది. తెవీకీ వార్త కొరకు వ్రాసినది కనుక ఇది తెవీకీ వ్యాసాల విధానాలకు విభేధించి ఉంటుంది. ఇది వీకిపీడియా మార్గదర్శకాలు మరియు సుచనలతో కూడుకుని ఉన్నదన్నది మీ అభిప్రాయమైతే దీనిని వికీపీడియా: అనువాద వ్యాసాల సంస్కరణ గా మార్చి ప్రాజెక్టు పేజీ నుంది లింకు ఇవ్వవచ్చు.t.sujatha
- మీ వాడుకరి స్థలంలోకి మార్చాను. వ్యాసం చాలా బాగుంది. ముద్రా రాక్షసాలు తొలగించాలి. వీటిపై పనిచేసిన ఇంకొంతమంది వికీపీడియన్లనుసమీక్ష చేసి సలహాలివ్వమని కోరతాను. ఆ తరువాత నా మార్పులు సూచిస్తాను. అన్నట్లు గూగుల్ ప్రాజెక్టు అయిపోయింది. ఇక ఏదైనా చేయాలంటే వికీ వాడుకరులు చేయాల్సిందే. వీటి గురించి మరిన్ని వివరాలు తమిళ వికీ సోదరులు వచ్చే వికీ కాన్ఫరెన్స్ లో ప్రసంగం చేస్తారు.అర్జున 21:15, 26 సెప్టెంబర్ 2011 (UTC)
- నాకు తోచినంతవరకు సవరించాను. గూగుల్ అనువాద వ్యాసాలు జాబితాలో లేని వ్యాసాలు చాలా ఉన్నాయి. వాటిని ఒక జాబితా మాదిరిగా తయారుచేసి ఉంచితే ఆయా సభ్యులకు తోచిన వ్యాసాలను సరిచేసే అవకాశం ఉంటుంది.Rajasekhar1961 08:40, 30 సెప్టెంబర్ 2011 (UTC)
- రాజశేఖర్ గారూ మీ అభిప్రాయం సరి అయినదే. అనువాదవ్యాసాలను ఒకచోట చేర్చినప్పుడు వాటిని సరి చేయడానికి వీలు ఉంటుందన్న అభిప్రాయముతో నేను గమనించిన వ్యాసాలతో ప్రారంభించాను. సభ్యులు ఆ వ్యాసంలో తమకు తెలిసినవి చేర్చ వచ్చు. --t.sujatha 16:33, 30 సెప్టెంబర్ 2011 (UTC)
- వర్గం:యాంత్రిక అనువాద వ్యాసాలు వాడవచ్చుకదా. --అర్జున 05:02, 2 అక్టోబర్ 2011 (UTC)
- నేను చేయాలనుకున్న మార్పులు చేశాను. సుజాత గారు. మీరు పరిశీలించి పచ్చజెండా వూపితే తరువాత తెవికీ వార్త లో విడుదలవుతుంది.--అర్జున 05:04, 2 అక్టోబర్ 2011 (UTC)
- అర్జునరావుగారూ మీరు అడిగారు కనుక వ్రాసాను కాని పూర్తి చేసేవరకు నేను సరిగా వ్రాయగలనా అన్న అనుమానం ఉంది. ఈ వ్యాసం వ్రాయడానికి ప్రోత్సహించిన వారికి స్పందనలు తెలియజేసిన వారికి ధన్యవాదాలు. మీరు సిద్ధమైనది అని భావిస్తే ది సరిగానే ఉంటుంది కనుక ఇక దీనిని ప్రచురించ వచ్చు.--t.sujatha 13:07, 2 అక్టోబర్ 2011 (UTC)