వికీపీడియా చర్చ:వికీప్రాజెక్టు/తెలుగు గ్రంథాలయం/వీరేశలింగ కవి సమాజ గ్రంథాలయ పుస్తకాల జాబితా -1
తాజా వ్యాఖ్య: తప్పులు టాపిక్‌లో 9 సంవత్సరాల క్రితం. రాసినది: విశ్వనాధ్.బి.కె.
తప్పులు
మార్చు- విశ్వనాధ్.బి.కె. గారు, ఈ జాబితాలో చాలా ఎక్కువ తప్పులు దొర్లాయి. ఉదా: మహాభాగవతము అని ఉన్న చోట రచయిత పేరు నన్నయ్య అని ఉంది. ఇంతకు ముందు మీకు మెయిల్ ద్వారా ఫేస్బుక్ చాట్ ద్వారా తెలియచేస్తూ కొన్ని తప్పులను తెలిపాను, అలానే ఆ తప్పులలో కొన్నిటిని మీరు దాటవేస్తే నేను సరి చేస్తున్నాను. అందువలన తెవికీలో వీటిని చేర్చే ముందు, ఒకసారి మీరు చేసిన జాబితాను సరి చూసేందుకు పంచుకుంటే ఇలాంటివి జరగకుండా అరికట్టవచ్చు. --రహ్మానుద్దీన్ (చర్చ) 06:11, 5 సెప్టెంబరు 2015 (UTC)
- రహ్మానుద్దీన్ గారు తెలియచేసినందుకు ధన్యవాదాలు. అవి గ్రంథాలయ సిబ్బంది ద్వారా చేయిస్తున్న పనులు, పిఠాపురం వాళ్ళు మనం ప్రోత్సహించాక లైబ్రరీలో కంప్యూటర్ పెట్టుకున్నారు. అలాగే కుముదవల్లి వారికి కూడా టైపింగ్ కొత్తే - వాళ్ళకూ కొత్తే కాని చేయాలని ఉత్సాహం. మొదటపేజీ అప్పటికప్పుడు వాళ్ళకు చూపిస్తూ చేయించినది. తప్పులుంటాయని తెలుసు. కాని వాళ్లను నిరుత్సాహపరచకూడదు కనుక ఎలా ఉన్నా పెట్టించాను. మిగతా పేజీలలో అంతగా ఉండవు. దానిని గురించి తరువాత మిగతా వికీ మిత్రులకు మౌకికంగానూ, మేయిల్స్ ద్వారానూ తెలియచేసాను. ఇలాంటి తప్పులు ఈ విధంగా దొర్లుతాయి, వాటిని పరిశీలించి సరిచేసేందుకు సహకరించమని. - పనిలో సహనం అవసరం, మీకంటే ముందుగా మిగతా వాళ్ళు నాకు తెలియపరచారు. వాళ్లకు తెలియపరచాను. ఇపూడు మీకు కూడా తెలియపరుస్తున్నాను. నాకు ఇన్ని మార్గాలలో తెలియచేస్తున్నందుకు సర్వదా కృతజ్నలు, మీకు కూడా అలాటివి మీకు కనిపిస్తే దయచేసి వాటిని సరిచేయడంలో సహకరించి ఈ కార్యాన్ని విజయవంతం చేయగలరు. --Viswanadh (చర్చ) 07:15, 6 సెప్టెంబరు 2015 (UTC)