వికీపీడియా చర్చ:వికీప్రాజెక్టు/ప్రాజెక్టు టైగర్ రచనా పోటీ/2018

వ్యాసపు కనీస నిడివి మార్చు

వ్యాసపు కనీస నిడివి కనీసం 3 వేల బైట్లు, 300 పదాలు ఉండాలని ఒకచోట, కనీసం 9 వేల బైట్లు, 300 పదాలు ఉండాలని మరోచోటా ఉంది. ఏది సరైనదో తికమక లేకుండా, స్పష్టంగా రాయాలి. __చదువరి (చర్చరచనలు) 06:45, 1 మార్చి 2018 (UTC)Reply

అది అనువదించేప్పుడు ఆంగ్ల వికీపీడియాలోని పేజీ అనువదించడం వల్ల వచ్చిన దోషం. ఆంగ్ల వికీపీడియాలో 3 వేల బైట్లు ఉంటే 300 పదాల నిడివి కల వ్యాసం అవుతుందనీ, అదే భారతీయ భాషల్లో అయితే 300 పదాల నిడివి 9 వేల బైట్లు అయిపోతుందని అంచనా వేసి, భారతీయ భాషలకు 9 వేల బైట్లు, 300 పదాలు, ఆంగ్లానికి 3 వేల బైట్లు, 300 పదాలు చేశారు. ఇప్పుడు సరిదిద్దడం పూర్తైంది.--పవన్ సంతోష్ (చర్చ) 09:57, 7 మార్చి 2018 (UTC)Reply

తెవికీ ప్రాధాన్యతా జాబితా మార్చు

గూగుల్ ఇచ్చిన లిస్ట్ ఎక్కువ హిందీ సినీ తారల, సినిమాలు ఉన్నాయి. వాటిల్లో మన ప్రాధాన్యతలు తక్కువ. సైన్స్, చరిత్ర, సంగీతం, సాహిత్యం చాలా చాలా తక్కువ వ్యాసాలు. వాటికి బదులుగా మనం ఒక లిస్ట్ మన ప్రాధాన్యతా అంశాలపై తయారు చేసుకోవాలి. గూగుల్‌కు అవసరమైన అంశాల గురించి మర్చిపోవచ్చు. తెలుగు వికీకి కావల్సిన అంశాలకు దగ్గరగా మనం వ్యాసాలను ఎంపిక చేసుకోవచ్చు. లేదా మొలక వ్యాసాలను అభివృద్ది క్రమంలో ముందుకు తీసుకు వచ్చి. ఎక్కువ మొలకలను అభివృద్ది చేసిన, గూగుల్ అనువాద వ్యాసాల్లో అవసరమైన వాటిని శుద్ది చేసిన వారికి బహుమతులకు ఎంపిక చేయవచ్చు...--విశ్వనాధ్ (Viswanadh) (చర్చ) 04:41, 2 మార్చి 2018 (UTC)Reply

నా ప్రతిపాదన మార్చు

ఇదే ప్రతిపాదన రచ్చబండలోనూ చేశాను. మళ్ళీ చర్చ ఇక్కడ జరుగుతూండడం, చదువరి గారు చర్చను ఇక్కడ కొనసాగించమని రచ్చబండలో సూచించడం కారణాలుగా మళ్ళీ ఇక్కడ పేస్టు చేస్తున్నాను. --పవన్ సంతోష్ (చర్చ) 08:14, 2 మార్చి 2018 (UTC)Reply
ఈ వ్యాసాలను ఏయే ప్రాంతాల నుంచి వినియోగదారులు ఏయే అంశాలను (ఆంగ్లంలో అయినా సరే) ఎక్కువగా వెతుకుతున్నారన్న అంశాన్ని, ఆ వెతికినవారు (సాధారణంగా ఆంగ్ల వికీ) వికీపీడియాలోకి వెళ్ళి ఎలా చదువుతున్నారన్న అంశాన్ని పరిగణించి గూగుల్ వారు తయారుచేసిన జాబితా అని తెలిసిందండీ. స్థానిక భాషలలో వెతికడం బాగా తక్కువ కాబట్టి వారు తెలుగులో తెలుగువారు ఏ సమాచారం వెతుకున్నారన్నది ఇవ్వలేకపోతూన్నారని కార్యక్రమ నిర్వాహకుల నుంచి తెలుసుకున్నాను. ఒకవేళ ఇచ్చినా తెలుగు వికీపీడియా వైవిధ్యానికి దోహదపడకపోవచ్చు, ఎందుకంటే ఫలానా రకం సమాచారం తెలుగు అంతర్జాలంలో దొరకదని తెలిసినప్పుడు వెతకడం కూడా ఉండదు. అంతమాత్రాన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల వారు ఆంగ్లంలో ఏం వెతుకుతున్నారో చూసి అదే రాయాల్సిన అవసరమూ లేదు. నేను ప్రతిపాదించినదేమంటే - మన భారతీయ భాషలలో విస్తారమైన పాఠకులు ఉన్న పత్రికలు ఉన్నాయి కదా. 2018 రీడర్‌షిప్ సర్వే ప్రకారం భారతీయ భాషల పాఠకులు భారీ సంఖ్యలో పెరుగుతున్నారు. ఇలా పెరగడానికి వారు పాఠకులకు అవసరమైన సమాచారం, వార్తల గురించి ఎన్నో సర్వేలు చేసి తెలుసుకుంటూంటారు. ఆ ఫలితాలను మనం ఉపయోగించుకుని - తెలుగువారికి ఎలాంటి సమాచారం కావాలో తెలుసుకోవచ్చు. అంటే ఈనాడు వాళ్ళు ఇ-నాడు (టెక్నాలజీ, సాంకేతిక ఉపకరణాలు), చదువు (జనరల్ స్టడీస్, జనరల్ నాలెడ్జ్ వగైరా), సుఖీభవ (ఆరోగ్యం, వైద్యం), వసుంధర (మహిళల గురించి) వగైరా టాబ్లాయిడ్లు చాలా ప్రయోగాల ద్వారా రూపకల్పన చేశారు కదా. మనం టెక్నాలజీ, సాంకేతిక ఉపకరణాలు, జనరల్ స్టడీస్, జనరల్ నాలెడ్జ్, ఆరోగ్యం, వైద్యం, మహిళలు వంటి టాపిక్స్‌లో తెలుగు ప్రాంతాల వారు ఏయే వ్యాసాలను ఎక్కువగా వెతుకుతున్నారని అడగవచ్చు. (ఉదాహరణ మాత్రమే, ఆలోచన నచ్చితే ఇతర పెద్ద పత్రికల నుంచి మనం విశ్లేషణ చేసి టాపక్స్ ఎంపిక చేయొచ్చు) తద్వారా పత్రికలు భారీ ఎత్తున చేపట్టిన సర్వేల ఫలితంగా రూపొందిన విధానాలనే ఉపయోగించుకుని ఇప్పటికే భారీ సంఖ్యలో (ప్రధాన పత్రికల రీడర్‌షిప్ కలుపుకుంటే కోట్లు దాటుతోంది) ఉన్న తెలుగు పాఠకుల సమూహానికి అవసరమైన సమాచారం రూపొందించవచ్చు. ఈ ప్రతిపాదన ఇక్కడ మెటా-వికీలో చేశాను. అక్కడ కూడా చర్చ సాగించవచ్చు. --పవన్ సంతోష్ (చర్చ) 10:59, 1 మార్చి 2018 (UTC)Reply

నా అభ్యర్ధనా విన్నపము మార్చు

ప్రాజెక్టు టైగర్ రచనా పోటీలో నిర్వాహకులు పోటీదారులకు ధన, వస్తు రూపంలో అందించే ఏవీ నేను స్వీకరించను. నేను కేవలం ఇతర సభ్యులను ఉత్సాహపరిచేందుకు మాత్రమే పాల్గొంటున్నాను. నిర్వాహకులు మొమెంటో, సర్టిఫికేట్, ట్రోఫీ, ఇత్యాది మాత్రమే దయచేసి నాకు అందించండి. ఇది దయచేసి నా అంగీకార ధృవపత్రంగా నిర్వాహకులు నిర్వాహకులు పరిగణించ గలరు. ధన్యవాదములు.00:14, 19 ఏప్రిల్ 2018 (UTC)--2018-04-19T05:44:13 User:JVRKPRASAD

Asish boddu మార్చు

Ntg Asishboddu (చర్చ) 14:07, 19 మే 2018 (UTC)Reply

Return to the project page "వికీప్రాజెక్టు/ప్రాజెక్టు టైగర్ రచనా పోటీ/2018".