విక్రమోర్వశీయము

కాళిదాసు రచించిన నాటకం
ఊర్వశి, పురూరవుడు - రాజా రవివర్మ చిత్రం.

విక్రమోర్వశీయము మహాకవి కాళిదాసు విరచిత సంస్కృత నాటకము. ఇది పురూరవుడు అను రాజు, దేవేంద్రుని ఆస్థాన నర్తకి అయిన ఊర్వశి ల ప్రణయగాథ. ఈ నాటకములోని నాయకుడు పురూరవుడు అయినప్పటికీ, చక్రవర్తి చంద్రగుప్త విక్రమాదిత్యుని ఆస్థానములోని నవరత్నములలో ఒకడైన కాళిదాసు ఆయనపై గల ప్రేమ, గౌరవ భావముచే ఈ కృతికి ఆ పేరు పెట్టెనని కొందరి భావన.