విగ్రహం

(విగ్రహాలు నుండి దారిమార్పు చెందింది)

విగ్రహాలు లేదా శిల్పాలు (Statues) శిల్పకళ (Sculpture) కు సంబంధించినవి. వీటిని శిల్పులు తయారుచేస్తారు. ఇవి మట్టితో గాని, కలపతో గాని లేదా వివిధ లోహాలతో గాని తయారుచేయబడతాయి.

Auguste Rodin, The Thinker, Bronze, c.1902, Ny Carlsberg Glyptotek in Copenhagen, Denmark
ఏకాంతసేవ రోజున ప్రసన్న వెంకటేశ్వరస్వామి ఉత్సవ విగ్రహం
ఉగాది పండుగ నాడు గ్రామోత్సవంలో శ్రీ చెన్నకేశవ స్వామి ఉత్సవ విగ్రహం

దేవాలయాలలోని మూల విరాట్టు (రాతి విగ్రహం) గర్భాలయం ఇవతల జరిగే ఉత్సవాలను తిలకించడానికి మూల విరాట్టుకు ప్రతిరూపంగా తయారు చేసిన విగ్రహాలను ఉత్సవ విగ్రహాలు (లోహా విగ్రహాలు) అంటారు. ఉత్సవ విగ్రహాలకు ఉత్సవాలను నిర్వహిస్తారు. ఉత్సవ విగ్రహాలకు జరిపే కళ్యాణోత్సవం, గ్రామోత్సవంలను మూల విరాట్టుకు చేసినట్లుగా భావిస్తారు.

విగ్రహారాధన

మార్చు

విగ్రహ ప్రతిష్ఠ

మార్చు

నూతన దేవాలయాన్ని నిర్మించేటపుడు విగ్రహలను స్థాపించే సందర్భంలో విగ్రహలకు జరిపే ఉత్సవ కార్యక్రమాలను నూతన విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం అంటారు.

కార్యక్రమ వివరాలు

మార్చు

విగ్రహ ప్రతిష్ఠలో గణపతి పూజ, వేద మంత్రోచ్చారణలు, పంచగవ్యప్రాశనం, మాతృకాపూజ, రక్షాబంధనం, యాగశీల ప్రవేశం, కలశస్థాపన, మృత్యం గ్రహణం, అంకురారోపణం, పుణ్యాహం, అగ్నిప్రతిష్ఠ, దీక్షాహోమం, జప పారాయణాలు, ప్రాతఃకాల హోమం, సప్త కలిశ స్నపనం, నవ కలశ స్నపనం, క్షీరాధివాసం, ఆదివాస హోమం, హోమం, కుంభ న్యాసం, పారామార్చన, ఆష్ఠాక్షన, మహాన్యాస హోమాలు, పంచగవ్య అధివాసం, జలాధివాసం, ధాన్యాధివాసం, పుష్ప, ఫతాదివాసం, విష్వక్సేన పూజ, యంత్ర ప్రతిష్ఠ, మహా కుంభాభిషేకం, మూర్తి ప్రతిష్ఠ, ధ్వజ ప్రతిష్ఠ, ఆలయ శిఖరంపై కలశాల ప్రతిష్ఠ, ప్రాణ ప్రతిష్ఠ, బింబ కళాన్యాసము, బలిహరణం, శాంతి కల్యాణం, అర్చన, మంగళ హారతి, ఆశీర్వచనం, స్వస్తి మొదలైన కార్యక్రమాలు జరుపుతారు.

గ్యాలరీ

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=విగ్రహం&oldid=3494508" నుండి వెలికితీశారు