విజయం మనదే 1970, జూలై 15న విడుదలైన తెలుగు చలన చిత్రం. జానపద ఫక్కిలో రూపొందిన చక్కటి సందేశాత్మక చిత్రమైన ‘విజయం మనదే’ లో అధికార దాహం పిచ్చిగా వెర్రితలలు వేస్తున్న ఈ రోజుల్లో అధికారమదాంధత్వంతో కావరమెక్కిన ఒక వ్యక్తి దుర్మార్గాలను చూపించడం జరిగింది. ఈ జానపద చిత్రం విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. బి.విఠలాచార్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఎన్.టి.ఆర్. ప్రజా నాయకుడిగా నటించారు. బి.సరోజా దేవి, దేవిక, కైకాల సత్యనారాయణ తదితరులు ముఖ్యపాత్రలను పోషించగా, టి.వి.రాజు సంగీతం అందించారు.[1]

విజయం మనదే
(1970 తెలుగు సినిమా)
దర్శకత్వం బి.విఠలాచార్య
తారాగణం నందమూరి తారక రామారావు,
దేవిక
సంగీతం టి.వి.రాజు
నిర్మాణ సంస్థ పి.ఎస్.ఆర్. పిక్చర్స్
భాష తెలుగు

తారాగణం

మార్చు

నందమూరి తారక రామారావు

దేవిక

బి.సరోజాదేవి

కైకాల సత్యనారాయణ .

సాంకేతిక వర్గం

మార్చు

దర్శకుడు: బి. విఠలాచార్య

సంగీతం: టి.వి.రాజు

నిర్మాత:నందమూరి సాంబశివరావు

నిర్మాణ సంస్థ: రాజేంద్ర ఆర్ట్ ప్రొడక్షన్స్

సాహిత్యం: వీటూరి , సి నారాయణ రెడ్డి,కొసరాజు ,దేవులపల్లి

నేపథ్య గానం: ఘంటసాల వెంకటేశ్వరరావు, పులపాక సుశీల, శిష్ట్లా జానకి

విడుదల:15:07:1970.

పాటలు

మార్చు
  • శ్రీరస్తు చిన్నారి నా చెల్లికి చిరాయురస్తు వరాల మా తల్లికి
  1. ఎవ్వరో పిలిచినట్టుటుంది ఎందుకో గుండె ఝల్లు - ఎస్. జానకి ( ఘంటసాల నవ్వు) రచన: సి నారాయణ రెడ్డి
  2. ఏలుకోరా వీరాధివీరా కళాచతురా కదనధీరా కామినీ - ఎస్. జానకి, రచన: వీటూరి వెంకట సత్య సూర్యనారాయణ మూర్తి
  3. ఓ దేవి ఏమి కన్నులు నీవి కలకల నవ్వే కలువలు - ఘంటసాల,సుశీల - రచన: డా॥ సినారె
  4. ఓహో హోహో రైతన్నా ఈ విజయం నీదన్న - ఘంటసాల, ఎస్. జానకి బృందం - రచన: కొసరాజు
  5. కొంచెం కొంచెం బిడియాలు..శ్రీరస్తు శుభమస్తు - ఘంటసాల బృందం - రచన: దేవులపల్లి
  6. గారడి గారడి బలే బలే గారడి తంజావూరు - ఘంటసాల,సుశీల బృందం - రచన: కొసరాజు
  7. నామదిలో ఉందొక మందిరము ఆ మందిరమెంతొ - సుశీల,ఘంటసాల - రచన: డా॥ సినారె

మూలాలు

మార్చు
  1. ఎపి ప్రెస్ అకాడమీ ఆర్కైవ్ (1970-07-19). విజయం మనదే చిత్ర సమీక్ష. p. 6. Archived from the original on 25 సెప్టెంబరు 2020. Retrieved 14 July 2017.
  • సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అను పాటల సంకలనం నుంచి.