విజయసాయి రెడ్డి
విజయసాయి రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఒక రాజకీయ నాయకుడు, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ తరపున రాజ్యసభ సభ్యుడు. ఆయన 10 ఆగష్టు 2021న పార్లమెంట్ లో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[3] ఆయనను 2022 మే 17న వైఎస్సార్‌సీపీ తరపున రెండోసారి రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించింది.[4]
వి. విజయసాయి రెడ్డి | |||
పార్లమెంటు సభ్యుడు, రాజ్యసభ
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 22 జూన్ 2016 | |||
ముందు | జేసుదాసు శీలం, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ | ||
---|---|---|---|
నియోజకవర్గం | ఆంధ్రప్రదేశ్[1] | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | |||
రాజకీయ పార్టీ | వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ | ||
జీవిత భాగస్వామి | సునంద రెడ్డి | ||
బంధువులు | గడికోట ద్వారకనాథరెడ్డి (బావమరిది)[2] |
నేపధ్యం
మార్చువి. విజయసాయి రెడ్డి 1957 జూలై 1 న నెల్లూరు జిల్లా, తాళ్ళపూడి గ్రామంలో జన్మించాడు.ఇతడు చార్టెట్ అకౌంటెన్సీ చదివి పిమ్మట చెన్నై, హైదరాబాదు, బెంగలూరు నగరాలలో తన స్వంత వ్యాపార సంస్థను ప్రారంభించాడు.ఇతడు కొన్ని జాతీయ బ్యాంకులకు బోర్డు సభ్యుడిగా పనిచేశాడు. తరువాత ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ డైరెక్టరుగా పనిచేశాడు.ఆ తర్వాత రాజకీయాలులో చేరిన కొద్ది కాలంలోనే అత్యున్నత రాజకీయ నాయకులు జాబితాలోకి చేరిన రాజకీయ నాయకులు(!?) వీరు [5]
రాజ్యసభ సభ్యత్వం
మార్చుజూన్ 2016 లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున రాజ్యసభకు ఎన్నికయ్యాడు.రాష్ట్ర రాజకీయాల్లో వైసీపీకి చెందిన కీలక నేతగా మారాడు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తూ తెలుగు ప్రజలు హృదయాలు గెలుచుకుంటున్న సమయంలో పార్టీని తన భుజ స్కందాల పై మోసి జగన్ నమ్మకాన్ని నిలబెట్టిన నాయకుడు.సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడి ఇతనిని గురించి ప్రస్తావన చేశాడు. ఇతని గొప్పతనం. కష్టాల్లో జగన్ కు తోడుగా నిలిచి తన వ్యక్తిత్వాన్ని శిఖరపు అంచులుకి చేర్చుకోగలిగాడు.[6] పార్లమెంటు సమావేశాలలో పలు ప్రైవేటు బిల్లులను ప్రవేశపెట్టాడు.తన వాదాన్ని కేంద్రానికి బలంగా చాటి చెప్పిన గొప్ప నాయకుడు...[7]ఆంధ్రప్రదేశ్ కి ఏమి చేసారో చెప్పండి అని అడిగాడు. రాజ్యసభ సభ్యుడుగా అతని పదవీకాలం ఇంకో 3నెలలు మాత్రమే వుంది. [8]
మూలాలు
మార్చు- ↑ "Piyush Goyal, Chidambaram, Suresh Prabhu, Sharad Yadav elected to Rajya Sabha". The Economic Times. 2016.
- ↑ Andhrajyothy (3 January 2024). "విజయసాయిరెడ్డి బావమరిది". Archived from the original on 3 January 2024. Retrieved 3 January 2024.
- ↑ Sakshi (10 August 2021). "పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యుడిగా ఎంపీ విజయసాయిరెడ్డి ఏకగ్రీవ ఎన్నిక". Archived from the original on 10 ఆగస్టు 2021. Retrieved 10 August 2021.
- ↑ Sakshi (17 May 2022). "విజయసాయిరెడ్డి: పార్లమెంట్‌లో సరైన గళం.. అందుకే రెండోసారి". Archived from the original on 18 May 2022. Retrieved 18 May 2022.
- ↑ "Vijay Sai: The kingpin in the Jagan empire". The Times of India. 2012.
- ↑ "YSRCP names Vijay Sai Reddy as candidate for RS polls". NetiAP. 2016. Archived from the original on 2016-08-11. Retrieved 2018-03-29.
- ↑ "MP Track on PRS Legislative Research". PRS Legislative Research.
- ↑ Sakshi (17 May 2022). "వైఎస్సార్‌సీపీ రాజ్యసభ అభ్యర్థులు.. నేపథ్యాలు ఇవే!". Archived from the original on 18 May 2022. Retrieved 18 May 2022.