విజయ్ ప్రకాష్

గాయకుడు

విజయ్ ప్రకాష్ దక్షిణ భారతదేశానికి చెందిన గాయకుడు, సంగీత దర్శకుడు. ఈయన కర్ణాటక రాష్ట్రంలోని మైసూరుకు చెందిన వాడు.[1] కన్నడ, తమిళ, తెలుగు, మలయాళ, మరాఠీ, హిందీ సినిమాల్లో పాటలు పాడాడు. ప్రఖ్యాత తబలా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ తో కలిసి ప్రదర్శనలు ఇచ్చాడు.

విజయ్ ప్రకాష్
దస్త్రం:Oscar winning singer Vijay Prakash to have a concert at Bengaluru.jpg
మాతృభాషలో పేరుವಿಜಯ್ ಪ್ರಕಾಶ್
జననం (1976-02-21) 1976 ఫిభ్రవరి 21 (వయస్సు: 44  సంవత్సరాలు)
మైసూరు, కర్ణాటక
నివాసంముంబై, మహారాష్ట్ర
విద్యాసంస్థలుశ్రీ జయచామరాజేంద్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, మైసూరు, కర్ణాటక
వృత్తిగాయకుడు
క్రియాశీలక సంవత్సరాలు1997–ప్రస్తుతం

2008 లో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ గా ఆస్కార్ బహుమతి సాధించిన జయహో పాట పాడిన నలుగురిలో విజయ్ ప్రకాష్ ఒకడు.[2] ఈ పాట మధ్య మధ్యలో తారా స్థాయిలో వినిపించే జయహో అనే గొంతు ఈయనదే.[3]

వ్యక్తిగత జీవితంసవరించు

విజయ్ ప్రకాష్ కర్ణాటకలోని మైసూరు లో కర్ణాటక సంగీత విద్వాంసులైన లోపాముద్ర, ఎల్. రామశేష దంపతులకు జన్మించాడు. చిన్నతనం నుంచి కర్ణాటక సంగీతం అభ్యాసం చేశాడు. శ్రీ జయచామరాజేంద్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నుంచి ఇంజనీరింగ్ పూర్తి చేశాడు.

మూలాలుసవరించు

  1. "Coming up NEXT". Screenindia. Archived from the original on 13 ఫిబ్రవరి 2009. Retrieved 23 February 2008.
  2. Kamaleshan, Kumar (24 February 2009). "Meet the man who said Jai Ho". Times of India. Retrieved 25 February 2009.
  3. Tuteja, Joginder (25 February 2009). "Vijay – The man who too deserves credit for 'Jai Ho'". Bollywood Hungama. Retrieved 4 June 2009.