విజయ్ మోహన్‌రాజ్

భారత మాజీ ఫస్ట్ క్లాస్ క్రికెటర్.

విజయ్ మోహన్‌రాజ్ (జననం 9 సెప్టెంబరు 1955) భారత మాజీ ఫస్ట్ క్లాస్ క్రికెటర్. బొంబాయి, హైదరాబాదు జట్ల తరఫున ప్రాతినిధ్యం వహించాడు. పదవీ విరమణ తరువాత, హైదరాబాదు జట్టు కోచ్ గా, సెలెక్టర్ గా పనిచేశాడు.

విజయ్ మోహన్‌రాజ్
వ్యక్తిగత సమాచారం
పుట్టిన తేదీ (1955-09-09) 1955 సెప్టెంబరు 9 (వయసు 68)
ముంబాయి, మహారాష్ట్ర, భారతదేశం
బ్యాటింగుఎడమచేతి వాటం
పాత్రబ్యాట్ మెన్; వికెట్-కీపర్ (అప్పుడప్పుడు)
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1975/76–1977/78ముంబాయి క్రికెట్ జట్టు
1979/80–1987/88హైదరాబాదు క్రికెట్ జట్టు
కెరీర్ గణాంకాలు
పోటీ ఫస్ట్ లిస్ట్ ఏ
మ్యాచ్‌లు 54 1
చేసిన పరుగులు 3,302 5
బ్యాటింగు సగటు 45.86 5.00
100లు/50లు 6/19 0/0
అత్యధిక స్కోరు 211* 5
వేసిన బంతులు 101
వికెట్లు 4
బౌలింగు సగటు 12.25
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 n/a
అత్యుత్తమ బౌలింగు 1/0
క్యాచ్‌లు/స్టంపింగులు 21/1 0/–

జననం మార్చు

విజయ్ మోహన్‌రాజ్ 1955, సెప్టెంబరు 9న మహారాష్ట్రలోని ముంబాయిలో జన్మించాడు.

క్రీడారంగం మార్చు

విజయ్ మోహన్‌రాజ్ బొంబాయి, హైదరాబాదు, సౌత్ జోన్ లకు ఎడమచేతి వాటం టాప్ ఆర్డర్ బ్యాట్స్ మాన్ గా సేవలు అందించాడు. 1975 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లలో, 1975/76, 1987/88 మధ్యకాలంలో లిస్ట్ ఎ మ్యాచ్ లలో ఆడాడు. 1976–77 రంజీ ట్రోఫీని గెలుచుకున్న ముంబాయి జట్టులో, 1986–87 రంజీ ట్రోఫీని గెలుచుకున్న హైదరాబాదు జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. 1986-87 రంజీ ఫైనల్ లో ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో 211 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.[1] 75.10 సగటున 751 పరుగులతో టోర్నమెంట్లో నాలుగో అత్యధిక పరుగులు సాధించాడు.[2]

పదవీ విరమణ తరువాత కొంతకాలం హైదరాబాదు క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సిఎ)కు కోచ్ గా, సెలెక్టర్ గా ఉన్నాడు.[3] నేషనల్ క్రికెట్ అకాడమీకి అర్హత కలిగిన క్రికెట్ కోచ్ గా కూడా ఉన్నాడు.[4] 2008 ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో డెక్కన్ చార్జర్స్ కు మేనేజర్‌గా పనిచేశాడు.[5] వెటరన్స్ క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ హెచ్‌సీఏ కార్యదర్శి కూడా పనిచేశాడు.[6]

యునిగ్లోబ్ సమీరా ట్రావెల్స్ మేనేజింగ్ డైరెక్టర్, యునిగ్లోబ్ ట్రావెల్స్ అసోసియేట్ గా ఉన్నాడు.[7][4]

మూలాలు మార్చు

  1. "Delhi v Hyderabad in 1986/87". CricketArchive. Retrieved జూలై 22 2021. {{cite web}}: Check date values in: |access-date= (help)
  2. "Batting and Fielding in Ranji Trophy 1986/87 (Ordered by Runs)". CricketArchive. Retrieved జూలై 22 2021. {{cite web}}: Check date values in: |access-date= (help)
  3. "ఇండియాn board receives slew of applications for coach". ESPNcricinfo. Retrieved జూలై 22 2021. {{cite web}}: Check date values in: |access-date= (help)
  4. 4.0 4.1 "Uniglobe Sameera plans to foray into cricket tourism". Business Standard. Retrieved జూలై 22 2021. {{cite web}}: Check date values in: |access-date= (help)
  5. "Laxman removal 'unfair'". ESPNcricinfo. Retrieved జూలై 22 2021. {{cite web}}: Check date values in: |access-date= (help)
  6. "Veterans Meet". The New Indian Express. Archived from the original on 2016-08-16. Retrieved జూలై 22 2021. {{cite web}}: Check date values in: |access-date= (help)
  7. "Kapil, a true friend in need and deed". The Hindu. Retrieved జూలై 22 2021. {{cite web}}: Check date values in: |access-date= (help)

బయటి లింకులు మార్చు