2008 ఇండియన్ ప్రీమియర్ లీగ్

2007లో బిసిసిఐ స్థాపించిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ అనే భారత క్రికెట్ సిరీస్ లో మొట్టమొదటిది 2008 ఇండియన్ ప్రీమియర్ లీగ్. 18 ఏప్రిల్ 2008న మొదలైన ఈ సీజన్ 1 జూన్ 2008న ముగిసింది. ఈ పోటీ డబుల్ రౌండ్ రాబిన్ గ్రూప్ స్టేజ్ తో మొదలైంది. ఇందులోని 8 టీంలు ఒక హోం మ్యాచ్, ప్రతీ టీంతో ఇంకో మ్యాచ్ ఆడాయి. ఈ మ్యాచ్ లలో గెలిచిన టీంలు రెండు సెమీ-ఫైనల్ మ్యాచ్ లూ, ఒక ఫైనల్ మ్యాచ్ ఆడాయి.[1]

ఫైనల్ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ పై రాజస్తాన్ రాయల్స్ మూడు  వికెట్ల తేడాతో గెలిచి టైటిల్ ను సాధించింది.[2] యూసఫ్ పఠాన్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గానూ, షేన్ వాట్సన్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గానూ నిలిచారు.[3] ఎక్కువ వికెట్లు తీసిన ఆటగాడుగా సొహెయిల్ తన్వీర్ పర్పుల్ క్యాప్ ను సొంతం చేసుకున్నారు. అత్యంత ఎక్కువ రన్లు చేసిన ఆటగాడుగా షౌన్ మార్ష్ ఆరెంజ్ క్యాప్ అందుకున్నారు. ఉత్తమ అండర్ 19 ఆటగాడుగా శ్రీవత్స్ గోస్వామి పురస్కారం గెలిచారు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు క్రీడా స్ఫూర్తితో ఆడిన జట్టుగా ప్రత్యేక పురస్కారం అందుకోవడం విశేషం.

ఆటగాళ్ళ వేలంసవరించు

 
మహేంద్ర సింగ్ ధోనిని 1.5  మిలియన్ డాలర్లతో చెన్నై  సూపర్ కింగ్స్  కొంది.  ఈ టోర్నమెంట్ లో అతి ఖరీదైన ఆటగాడు ధోని.

సచిన్ టెండూల్కర్సౌరవ్ గంగూలీరాహుల్ ద్రవిడ్యువరాజ్  సింగ్వీరేంద్ర సెహ్వాగ్ తదితరులు ప్రసిద్ధ క్రీడాకురులుగా  వర్గీకరించారు. వీరు తమ తమ స్వంత రాష్ట్రాలకు  చెందిన  జట్లలో   ఆడతారు కాబట్టీ,  వీరిని వేలం వేయలేదు. ముందుగానే  ప్రసిద్ధ క్రీడాకారులతో  తయారైన జట్లు కాకుండా ఉన్న మిగిలిన జట్లలోకి  ఒక అదనపు మార్క్యూ ఆటగాణ్ణి వేలంలో  తీసుకోవచ్చు  అని నిబంధన విధించారు.[4]  20 ఫిబ్రవరి 2008న వేలం వేశారు. ఈ వేలంలో మహేంద్ర సింగ్ ధోనిని 1.5మిలియన్ డాలర్లతో చెన్నై సూపర్ కింగ్స్ కొంది. దీంతో ఆ టోర్నమెంట్ లో అతి ఖరీదైన ఆటగానిగా ధోని నిలవడం విశేషం.[5]

మూలాలుసవరించు

  1. Indian Premier League 2007/08 Fixtures. Cricinfo. URL accessed on 21 October 2008.
  2. "Rajasthan Royals are IPL champions". The Times of India. 2 June 2008. మూలం నుండి 4 June 2008 న ఆర్కైవు చేసారు. Retrieved 2 June 2008. Cite uses deprecated parameter |deadurl= (help)
  3. "Congratulate Rajasthan Royals". The Times of India. 2 June 2008. మూలం నుండి 2 June 2008 న ఆర్కైవు చేసారు. Retrieved 2 June 2008. Cite uses deprecated parameter |deadurl= (help)
  4. IPL auctions to be held.
  5. IPL Auction: Players' worth. Rediff Sports. (20 February 2008). URL accessed on 23 March 2010.