విజయ్ యాదవ్
విజయ్ యాదవ్ (జననం 1967 మార్చి 14) మాజీ భారత క్రికెట్ ఆటగాడు. అతను వికెట్ కీపరు, దూకుడుగా ఆడే దిగువ వరుస బ్యాట్స్‌మెన్. యాదవ్ 1992 నుండి 1994 వరకు భారత జట్టులో 19 వన్డే ఇంటర్నేషనల్స్ ఆడాడు. టెస్టుల్లో భారతదేశం తరపున ఒకసారి కనిపించాడు.[1]
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పుట్టిన తేదీ | గోండా జిల్లా, ఉత్తర ప్రదేశ్ | 1967 మార్చి 14|||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||
బంధువులు | Amrita (wife)dec. 2006 Sonalika (daughter)dec. 2006 | |||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||
| ||||||||||||||||||||||
మూలం: CricInfo, 2006 ఫిబ్రవరి 4 |
క్రికెట్ కెరీర్
మార్చుహర్యానా ఫస్ట్ క్లాస్ జట్టు సభ్యుడైన యాదవ్ 1990–91లో ఆ జట్టుతో రంజీ ట్రోఫీని గెలుచుకున్నాడు. ఆ ట్రోఫీ పోటీల్లో 24 క్యాచ్‌లు, ఆరు స్టంపింగ్‌లు చేశాడు. తరువాతి సీజన్‌లో అతను 25 అవుట్‌లు చేసాడు. 1992/93లో దక్షిణాఫ్రికా పర్యటన కోసం అతన్ని భారత జట్టులోకి తీసుకున్నారు. అప్పటికే జట్టులో నిలదొక్కుకుని ఉన్న కిరణ్ మోరేకు ప్రత్యామ్నాయంగా మాత్రమే పర్యటించినప్పటికీ, యాదవ్ తన తొలి వన్‌డే బ్లూమ్‌ఫోంటీన్‌లో ఆడాడు.
అంతర్జాతీయ కెరీర్
మార్చుఅతని కెరీర్‌లో ఏకైక టెస్టు మ్యాచ్, ఢిల్లీ వేదికగా జింబాబ్వేతో జరిగింది. యాదవ్ 2 స్టంపింగ్‌లు చేసాడు. 8వ స్థానంలో బ్యాటింగుకు వచ్చి, 25 బంతుల్లో 30 పరుగులు చేయడంతో భారత్ ఆ మ్యాచ్‌ను ఇన్నింగ్స్ 13 పరుగుల తేడాతో గెలుచుకుంది.
కొన్నాళ్ళకు నయన్ మోంగియా తెరపైకి రావడంతో, 1994 నాటికి యాదవ్ అంతర్జాతీయ కెరీర్ ముగిసింది. అతని చివరి ODI ఇన్నింగ్స్‌లో అతను కోర్ట్నీ వాల్ష్ చేతిలో మొదటి బంతికే డకౌట్ అయ్యాడు.
2006 ఏప్రిల్‌లో ఫరీదాబాద్ వద్ద జరిగిన కారు ప్రమాదంలో యాదవ్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ప్రమాదంలో తన 11 ఏళ్ల కుమార్తెను కోల్పోయాడు. ఆ తర్వాత ఇండియా ఎ జట్టుకు ఫీల్డింగ్ కోచ్‌గా ఉండమని అడిగారు.
వ్యక్తిగత జీవితం
మార్చుయాదవ్, ఉత్తరప్రదేశ్‌లోని గోండా జిల్లాలో 1967 మార్చి 14న జన్మించాడు.
అతను మూత్రపిండాల వైఫల్యంతో బాధపడుతున్నాడని, చికిత్స కోసం డబ్బు చాలా అవసరం అనీ 2022 మేలో వార్తలు వచ్చాయి. [2] [3] [4]
విజయ్ యాదవ్ గత కొంతకాలంగా డయాలసిస్ చేయించుకుంటున్నాడు. అతనికి రెండుసార్లు గుండెపోటు కూడా వచ్చింది. 2006లో కారు ప్రమాదం జరిగినప్పటి నుంచి ఆయన ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నాడు.
మూలాలు
మార్చు- ↑ "Which Indian batsman made hundreds in five successive Tests this century?". ESPNcricinfo. Retrieved 19 November 2020.
- ↑ "Financial support pours in for ailing former India wicketkeeper Vijay Yadav". Hindustan Times (in ఇంగ్లీష్). 2022-05-08. Retrieved 2022-12-28.
- ↑ "Ex-India Cricketer Vijay Yadav Gets Financial Help After Social Media Uproar" (in ఇంగ్లీష్). News18 India. Retrieved 2022-12-28.
- ↑ "Former Indian Wicketkeeper Vijay Yadav Suffers Complete Kidney Failure, In Dire Need of Money For Treatment". India.com (in ఇంగ్లీష్). 2022-05-08. Retrieved 2022-12-28.