నయన్ రాంలాల్ మోంగియా (జననం 1969 డిసెంబరు 19) భారత మాజీ క్రికెటర్, క్రికెట్ కోచ్. అతను కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్, వికెట్ కీపర్.

నయన్ మోంగియా
వ్యక్తిగత సమాచారం
పుట్టిన తేదీ (1969-12-19) 1969 డిసెంబరు 19 (వయసు 55)
బరోడా, గుజరాత్
బ్యాటింగుకుడిచేతి వాటం
పాత్రవికెట్ కీపరు
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డే
మ్యాచ్‌లు 44 140
చేసిన పరుగులు 1,442 1,272
బ్యాటింగు సగటు 24.03 20.19
100లు/50లు 1/6 0/2
అత్యధిక స్కోరు 152 69
క్యాచ్‌లు/స్టంపింగులు 99/8 110/45
మూలం: CricInfo, 2006 ఫిబ్రవరి 4

నయన్ మోంగియా వెస్టిండీస్‌పై జరిగిన మ్యాచ్‌లో మ్యాచ్ ఫిక్సింగు ఆరోపణలు ఎదుర్కొన్నాడు. చాలా నెమ్మదిగా సెంచరీ చేసిన మనోజ్ ప్రభాకర్‌తో పాటు తాను కూడా చాలా నెమ్మదిగా ఆడి, 21 బంతుల్లో కేవలం 4 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో వెస్టిండీస్ 43 పరుగుల తేడాతో విజయం సాధించింది. 2001లో మోంగియాను జట్టు నుంచి తొలగించారు. అతను లోయర్ ఆర్డర్ వికెట్-కీపర్ బ్యాట్స్‌మన్, 7వ లేదా 8వ స్థానంలో అప్పుడప్పుడు బ్యాటింగ్ చేసేవాడు. మోంగియా 1996, 1999లో 2 ప్రపంచ కప్‌లలో భారతజట్టులో ఆడాడు.

కెరీర్‌

మార్చు

తొలి ఇంగ్లాండ్ పర్యటన

మార్చు

1990లో ఇంగ్లండ్‌లో చేసిన మొదటి పర్యటనలో, అతను అలన్ నాట్‌ను ఆకట్టుకున్నాడు. మోంగియా సహజ ప్రతిభ కలిగిన ఆటగాడని అతను పేర్కొన్నాడు. కిరణ్ మోరే తర్వాత మోంగియా, భారతదేశపు రెండవ విజయవంతమైన వికెట్ కీపర్‌. మోంగియా 1990ల మధ్యలో భారత క్రికెట్ జట్టులో చేరాడు.

ఓపెనింగ్, అత్యధిక స్కోరు

మార్చు

మోంగియా 1996-97లో ఢిల్లీలో జరిగిన భారత పర్యటనలో ఆస్ట్రేలియాతో జరిగిన ఏకైక టెస్టులో తన తొలి టెస్టు సెంచరీని సాధించాడు. ఓపెనింగు స్థానంలో బ్యాటింగ్ ప్రారంభించి, అతను "తక్కువ బౌన్స్‌తో, స్లో టర్నింగ్ వికెట్"పై 152 పరుగులు చేశాడు. [1] ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు వ్రాస్తూ, మాజీ క్రికెటర్ ఇయాన్ చాపెల్ దీనిని "నైపుణ్యం, సహనం, ఏకాగ్రత" లు కలిసిన ఇన్నింగ్స్ అని పేర్కొన్నాడు. [2] అసమ్మతి, మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో మోంగియాను జట్టు నుండి తొలగించారు. [3] మోంగియా 2004 డిసెంబరులో ఫస్ట్ క్లాస్ క్రికెట్ నుండి రిటైరయ్యాడు [4]

వన్డే మ్యాచ్‌లలో రెండుసార్లు ఒకే మ్యాచ్‌లో 5 క్యాచ్‌లు అందుకున్నాడు. MS ధోనీ తన కెరీర్‌లో అది 4 సార్లు సాధించాడు. [5]

1989 నవంబరులో ప్రారంభమైన ఫస్ట్-క్లాస్ కెరీర్‌లో 183 మ్యాచ్‌లలో అతను 353 క్యాచ్‌లు, 43 స్టంపింగ్‌లు చేసాడు. 7000 పైగా పరుగులు చేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో మొత్తం 44 టెస్టులు ఆడి, మోంగియా 2001 మార్చిలో ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుతో జరిగిన కోల్‌కతా టెస్టులో తన టెస్ట్ కెరీర్‌ను ముగించాడు.[6]

కోచింగ్ కెరీర్

మార్చు

2004లో, అతను థాయ్‌లాండ్ జాతీయ క్రికెట్ జట్టుకు కోచ్‌గా వెళ్ళాడు. మలేషియాలో 2004 ACC ట్రోఫీకి ఆ జట్టు కోచ్‌గా ఉన్నారు. జాతీయ జట్టుతో పాటు, అతను థాయ్‌లాండ్ జాతీయ అండర్-19 క్రికెట్ జట్టుకు కూడా కోచ్‌గా పనిచేసాడు. [7]

మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు

మార్చు

2000 సంవత్సరంలో మహ్మద్ అజారుద్దీన్ ఒక మ్యాచ్ ఫిక్సింగ్ కోసం తాను బుకీల నుండి డబ్బు తీసుకున్నట్లు సిబిఐకి తెలిపాడు. అజయ్ జడేజా, నయన్ మోంగియాలు కూడా ఫిక్సింగ్‌కు పాల్పడ్డారని అతను వెల్లడించాడు. [8] బిసిసిఐ మాజీ కార్యదర్శి జయవంత్ లేలే తన పుస్తకంలో మోంగియా ఫిక్సింగ్ చేసి ఉద్దేశపూర్వకంగా నెమ్మదిగా ఆడాడని పేర్కొన్నాడు. లెలే ప్రకారం, మోంగియా డ్రెస్సింగ్ రూమ్‌లో ఒంటరిగా ఉండేవాడు. మోంగియాపై అనుమానాలు పెంచే సంఘటనలు మూడీంటిని అతను వ్రాసాడు. లెలే ప్రకారం, '1994లో వెస్టిండీస్‌తో జరిగిన కాన్పూర్ ODIలో, మోంగియా ఉద్దేశపూర్వకంగా నెమ్మదిగా ఆడుతూ, 9 ఓవర్లలో 16 పరుగులు చేశాడు. ఆ మ్యాచ్‌లో భారత్ ఓడిపోయింది'. ఈ మ్యాచ్ తర్వాత అతడిపై విచారణ జరిగింది. లేలే ఆరోపణలను మోంగియా ఖండించాడు. [9] మహ్మద్ అజారుద్దీన్‌పై సీబీఐ ఇచ్చిన నివేదికలో అతని పేరు ఉంది. తరువాత అతనిపై ఆరోపణలను ఎత్తివేసారు. మళ్ళీ అతను జాతీయ జట్టులోకి తిరిగి వచ్చాడు. 2001లో ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఆస్ట్రేలియాను ఓడించిన జట్టులో అతను భాగం. [10]

మీడియాలో

మార్చు
  • ఐ వాజ్ దేర్-మెమోయిర్స్ ఆఫ్ ఎ క్రికెట్ అడ్మినిస్ట్రేటర్ - మాజీ బీసీసీఐ సెక్రటరీ జయవంత్ లేలే రచించిన పుస్తకం. అందులో లెలె, మోంగియా మ్యాచ్ ఫిక్సింగ్‌లో పాల్గొన్నాడని ఆరోపించాడు. [9]

మూలాలు

మార్చు
  1. "Marvellous Mongia floors 'em". The Indian Express. 12 October 1996. Archived from the original on 20 April 1997. Retrieved 13 October 2018.
  2. Chappell, Ian (12 October 1996). "Mongia's effort adds to selectors' headache". The Indian Express. Archived from the original on 26 May 1997. Retrieved 13 October 2018.
  3. "Match-fixing report: The main points". BBC. 1 November 2000. Retrieved 9 February 2010.
  4. "Nayan Mongia announces retirement". The Hindu. 22 December 2004. Archived from the original on 18 January 2005. Retrieved 9 February 2010.
  5. "Records | One-Day Internationals | Wicketkeeping records | Most dismissals in an innings | ESPNcricinfo.com". Cricinfo. Retrieved 8 July 2021.
  6. Mongia announces his retirement
  7. Nayan Mongia to coach Thailand
  8. "Wrong 'uns". The New Indian Express. Retrieved 2022-05-08.
  9. 9.0 9.1 "'Teammates believed Mongia was involved'". The Indian Express (in ఇంగ్లీష్). 2011-11-03. Retrieved 2022-05-08.
  10. Bose, Saibal (December 23, 2004). "Nayan Mongia quits, blames it on More". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-05-08.