విజయ్ వర్మ
విజయ్ వర్మ ఒక తెలుగు, హిందీ సినీ నటుడు.
విజయ్ వర్మ | |
---|---|
![]() 2017లో విజయ్ వర్మ | |
జననం | |
వృత్తి | సినిమా నటుడు |
క్రియాశీల సంవత్సరాలు | 2013–ప్రస్తుతం |
వ్యక్తిగత జీవితం మార్చు
విజయ్ వర్మ హైదరాబాదులో స్థిరపడిన ఒక మార్వాడీ కుటుంబంలో జన్మించాడు. సినిమా రంగం మీద ఆసక్తితో పుణె లోని ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ కి దరఖాస్తు చేశాడు. తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో స్నేహితుల సాయంతో అందులో ఎఫ్. టి. ఐ. ఐ కోర్సులో చేరాడు.[1]
నటవృత్తి మార్చు
విజయ్ ముందుగా హైదరాబాదులోని నాటకరంగంలో నటుడిగా తన ప్రస్థానం ప్రారంభించాడు. కొద్దికాలం తర్వాత పుణెలోని ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ లో చేరాడు. అక్కడ రెండేళ్ళ పాటు శిక్షణ పొందాడు. అది పూర్తయిన తర్వాత అవకాశాల కోసం ముంబై వెళ్ళాడు. ముందుగా రాజ్ నిడిమోరు, కృష్ణ డి. కె రూపొందించిన ఒక లఘుచిత్రంలో నటించాడు. ఈ చిత్రం న్యూయార్క్ లో జరిగిన చిత్రోత్సవంలో మొదటి బహుమతి చేజిక్కించుకుంది.[2]
సినిమాలు మార్చు
వ.సం | సంవత్సరం | సినిమా | పాత్ర | దర్శకులు | భాష | గమనిక |
---|---|---|---|---|---|---|
1 | 2012 | చిట్టగాంగ్ | సుభోద్ రాయ్ | బేదబ్రత పెయిన్ | హిందీ | |
2 | 2013 | రంగ్రేజ్ | పక్యా | ప్రియదర్శన్ | హిందీ | |
3 | 2014 | గ్యాంగ్ ఆఫ్ ఘోస్ట్స్ | రాబిన్ హూడా | సతీష్ కౌశిక్ | హిందీ | |
4 | 2016 | పింక్ | అంకిత్ మల్హోత్రా | అనిరుద్ధ రాయ్ చౌదరి | హిందీ | |
5 | 2017 | మాన్ సూన్ షూటవుట్ | అమిత్ కుమార్ | హిందీ | ||
6 | 2017 | మిడిల్ క్లాస్ అబ్బాయి | శివ | వేణు శ్రీరామ్ | తెలుగు |