విఠల్ భాయ్ పటేల్
విఠల్ భాయ్ పటేల్, (1873 సెప్టెంబరు 27 - 1933 అక్టోబరు 22) [1] భారతీయ కేంద్ర శాసనసభ సభ్యుడు, రాజకీయ నాయకుడు, స్వరాజ్ పార్టీ వ్యవస్థాపకుడు. విఠల్ భాయ్ పటేల్ 1873 సెప్టెంబరు 27న గుజరాత్ రాష్ట్రం, నాడియడ్ పట్టణంలో జన్మించాడు. ఇతను, ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా గా ప్రసిద్ధి చెందిన సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు అన్న. స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నాడు. విఠల్ భాయ్ విద్యాభ్యాసం నాడియాడ్, బొంబాయి లలో జరిగింది. గోధ్రా, బార్శద్ కోర్టులలో జూనియర్ లాయర్ గా పని చేశాడు. చిన్న వయస్సులోనే దివాలిబా అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. 1913 మిడిల్ టెంపుల్ ఇన్, లండన్ నుండి ఉన్నత చదువులు పూర్తి చేసి, భారతదేశానికి తిరిగి వచ్చాడు. బొంబాయ్ అహ్మదాబాద్ కోర్టులలో ఒక న్యాయవాదిగా పనిచేశాడు. [2] 1915లో ఇతని భార్య మరణించింది.
రాజకీయ జీవితం
మార్చువల్లభాయ్ పటేల్ రాజకీయాల్లోకి రాకముందే, విఠల్‌భాయ్ రాజకీయాలలో ప్రవేశించాడు. భారత స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నాడు. బాంబే లెజిస్లేటివ్ కౌన్సిల్‌లో సీటు గెలుచుకున్నాడు. చౌరీ చౌరా సంఘటన, 1922 లో సహాయ నిరాకరణ ఉద్యమం ముగిసిన తరువాత, విఠల్‌భాయ్, చిత్తరంజన్ దాస్, మోతీలాల్ నెహ్రూలతో కలిసి కాంగ్రెస్‌ను విడిచిపెట్టి స్వరాజ్ పార్టీ అనే సొంత పార్టీని స్థాపించారు. ఈ పార్టీ ప్రధాన లక్ష్యం కౌన్సిల్స్‌లోకి ప్రవేశించడం, బ్రిటిష్ వారు నడుపుతున్న ప్రభుత్వాన్ని రద్దు చేయడం. బెంగాల్ ఒడంబడిక తర్వాత 1923 ఎన్నికల్లో చాలామంది స్వరాజ్ పార్టీ అభ్యర్థులు గెలిచి సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. చట్టసభలో ప్రభుత్వ అన్యాయాల్ని వ్యతిరేకించారు. [3]1923 లో సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. తరువాత 1925 లో, అసెంబ్లీ ప్రెసిడెంట్ అయ్యాడు. తరువాత విఠల్‌భాయ్ కాంగ్రెస్‌లో చేరి భారతదేశ స్వాతంత్ర్యం కోసం తన పోరాటాన్ని సాగించాడు. [4][5][6] చిత్తరంజన్ దాస్ మరణం తర్వాత ఈ పార్టీ చీలిపోయింది. [7]
మరణం
మార్చువిఠల్భాయ్ 1933 అక్టోబరు 22న స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో కన్నుమూశారు. అతని మృతదేహాన్ని భారతదేశానికి తీసుకువచ్చి నవంబరు 10 న బొంబాయిలో అంత్యక్రియలు చేశారు. మరణించే సమయానికి వయస్సు 60 సంవత్సరాలు.
మూలాలు
మార్చు- ↑ Gordhanbhai I. Patel. Vithalbhai Patel Life And Times Book Two.
- ↑ "Veer Vithalbhai Patel - Sardar Patel Trust". web.archive.org. 2007-10-10. Archived from the original on 2007-10-10. Retrieved 2021-09-22.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ Chandra, Bipan (2000). India's Struggle for Independence. Penguin Books Limited. pp. 249–251. ISBN 978-81-8475-183-3.
- ↑ Ajita Ranjan Mukherjea (1983) Parliamentary Procedure in India. Oxford. p. 43
- ↑ Philip Laundy (1984) The Office of Speaker in the Parliaments of the Commonwealth. Quiller. p. 175
- ↑ LOK SABHA SYNOPSIS OF DEBATES (Proceedings other than Questions & Answers) Friday, 25 August 2000 at parliamentofindia.nic.in
- ↑ Misra, Chitta Ranjan (2012). "Bengal Pact, 1923". In Islam, Sirajul; Jamal, Ahmed A. (eds.). Banglapedia: National Encyclopedia of Bangladesh (Second ed.). Asiatic Socie7ty of Bangladesh.