విద్యా మాల్వాదే

విద్యా మాల్వాదే (జననం 1973 మార్చి 2) ఒక భారతీయ నటి.

విద్యా మాల్వాదే
2023లో విద్యా మాల్వాదే
జననం (1973-03-02) 1973 మార్చి 2 (వయసు 51)
వృత్తిఎయిర్ హోస్టెస్, నటి
క్రియాశీల సంవత్సరాలు2003–ప్రస్తుతం
జీవిత భాగస్వామి
అరవింద్ సింగ్ బగ్గా
(m. 1997; died 2000)
సంజయ్ దయామా
(m. 2009)

ప్రారంభ జీవితం

మార్చు

విద్యా మాల్వాదే 1973 మార్చి 2న మహారాష్ట్రలోని ముంబైలో జన్మించింది.[1][2] ఆమె ప్రముఖ నటి స్మితా పాటిల్ మేనకోడలు. ఆమెకు ఇద్దరు సోదరీమణులు ఉన్నారు.[3]

కెరీర్

మార్చు

విద్య ఎయిర్ హోస్టెస్‌గా కెరీర్‌ని ప్రారంభించింది. ఆ తరువాత, ఆమె మోడలింగ్ రంగంలోకి దిగింది. ఆమెను ప్రకటనల కోసం యాడ్ ఫిల్మ్ మేకర్ ప్రహ్లాద్ కక్కర్ ఎంపిక చేసుకున్నాడు. ఆమె తొలిసారిగా విక్రమ్ భట్ దర్శకత్వంలో వచ్చిన ఇంతేహా (2003)లో నటించింది. అది బాక్సాఫీస్ వద్ద విఫలమైంది.[4] అయినా, తదపరి వరుస విజయవంతమైన సినిమాలు, అనేక ప్రకటనల తర్వాత, ఆమె 2007లో చక్ దే ఇండియాలో భారత మహిళల జాతీయ హాకీ జట్టుకు కెప్టెన్‌గా నటించింది.[5] ఆమె యారా సిల్లీ సిల్లీలోనూ నటించింది.[6]

వ్యక్తిగత జీవితం

మార్చు

విద్య లా చదివి ఎయిర్ హోస్టెస్‌గా పనిచేసింది.[7] ఆమె మొదటి భర్త, కెప్టెన్ అరవింద్ సింగ్ బగ్గా[8], అలయన్స్ ఎయిర్‌లో పైలట్. 2000లో అతని విమానం అలయన్స్ ఎయిర్ ఫ్లైట్ 7412 పాట్నాలోని ఒక భవనంపై కూలిపోవడంతో మరణించాడు.[9] 2009లో, ఆమె ఆస్కార్ అవార్డ్-నామినేట్ అయిన లగాన్‌లో సినిమా స్క్రీన్‌ప్లే రచయిత, అసోసియేట్ డైరెక్టర్‌గా అశుతోష్ గోవారికర్‌తో కలిసి పనిచేసిన సంజయ్ దైయామాను వివాహం చేసుకుంది.[10]

ఫిల్మోగ్రఫీ

మార్చు

సినిమాలు

మార్చు
సంవత్సరం సినిమా పాత్ర నోట్స్
2003 ఇంతేహా నందిని సక్సేనా
2005 మషూకా మోనికా
యూ, బమ్సీ ఎన్ మీ షెహనాజ్
2007 చక్ దే! ఇండియా విద్యా శర్మ
2008 బీనామ్
కిడ్నాప్ మల్లికా రైనా
2010 తుమ్ మీలో తో సాహి అనితా నాగ్‌పాల్
ఆప్ కే లియే హమ్
నో ప్రాబ్లమ్
దస్ తోలా ఖాజీ బేగం- ప్రత్యేక ప్రదర్శన
స్ట్రైకర్ దేవి
2012 చక్రధర్ అవంతిక
1920: ఈవిల్ రిటర్న్స్ కరుణా
శోభన 7 నైట్స్
2013 వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ముంబై దొబారా! అతిధి పాత్ర
2014 లవ్... ఫిర్ కభీ
2015 యారా సిల్లీ సిల్లీ అక్షర
2017 హార్ట్ బీట్స్ నైనా
2021 కోయి జానే నా రష్మీ అమెజాన్ ప్రైమ్ వీడియో ఫిల్మ్
2023 స్టార్ ఫిష్ సుకన్య సల్గాంకర్

టెలివిజన్

మార్చు
సంవత్సరం షో / ధారావాహిక పాత్ర నోట్స్
2005 మిర్చి టాప్ 20 హోస్ట్ మ్యూజిక్ హిట్స్ షో
2006 ఫ్యామిలీ నం. 1 ప్రధాన పాత్ర సోనీ ఎంటర్‌టైన్‌మెంట్ టెలివిజన్ (ఇండియా)లో ప్రసారం చేయబడింది
2008 ఫియర్ ఫ్యాక్టర్ - ఖత్రోన్ కే ఖిలాడి పోటీదారు కలర్స్ టీవీలో ప్రసారమైంది
2015 డర్ సబ్కో లగ్తా హై డా. నైనా "అబ్బే విల్లా" ​​(ఎపిసోడ్ వన్)

వెబ్ సిరీస్

మార్చు
సంవత్సరం టైటిల్ పాత్ర ప్లాట్ ఫామ్
2019 ఇన్ సైడ్ ఎడ్జ్ 2 తీషా చోప్రా అమెజాన్ ప్రైమ్ వీడియో
2020 ఫ్లెష్ రెబా గుప్తా ఎరోస్ నౌ
2020–ప్రస్తుతం మిస్ మ్యాచ్డ్ జీనత్ కరీం నెట్‌ఫ్లిక్స్
2020 వూజ్ యువర్ డాడి మోనికా బగ్గా ఆల్ట్ బాలాజీ, జీ5
2021 బామిని అండ్ బాయ్స్ బామిని డిస్నీ+ హాట్‌స్టార్
2022 డా. అరోరా వైశాలి సోనీ లీవ్

అవార్డులు, నామినేషన్లు

మార్చు
సంవత్సరం సినిమా పురస్కారం కేటగిరి ఫలితం
2004 ఇంతేహా ఫిల్మ్‌ఫేర్ అవార్డు ఉత్తమ మహిళా అరంగేట్రం
స్క్రీన్ అవార్డులు ఉత్తమ మహిళా అరంగేట్రం
స్టార్ గిల్డ్ అవార్డులు ఉత్తమ మహిళా అరంగేట్రం
స్టార్‌డస్ట్ అవార్డులు రేపటి సూపర్ స్టార్- స్త్రీ
బెస్ట్ బ్రేక్ త్రూ పెర్ఫార్మెన్స్ – ఫిమేల్
2009 కిడ్నాప్

మూలాలు

మార్చు
  1. "Happy Birthday Vidya Malvade: 10 SIZZLING pics of the Chak De! girl to make your day : Bollywood News - Bollywood Hungama". Bollywood Hungama (in ఇంగ్లీష్). 2018-03-02. Archived from the original on 16 July 2021. Retrieved 2021-07-16.
  2. "B'day Special: 48 साल की हुईं 'चक दे' गर्ल विद्या मालवडे, फिल्मों में आने से पहले थीं एयर होस्टेस" [B'day Special: 'Chak De' girl Vidya Malvade turns 48, was an air hostess before doing films]. News18 Hindi (in హిందీ). 2021-03-02. Archived from the original on 16 July 2021. Retrieved 2021-07-16.
  3. "Giving Life A Second Chance". Archived from the original on 21 August 2023. Retrieved 2023-08-21 – via PressReader.
  4. "Inteha tests your patience". www.rediff.com. Archived from the original on 24 April 2018. Retrieved 2019-12-26.
  5. Webster, Andy (2007-08-11). "Chak De! India - Movies - Review". The New York Times (in అమెరికన్ ఇంగ్లీష్). ISSN 0362-4331. Archived from the original on 25 November 2016. Retrieved 2019-12-26.
  6. Kumar, Anuj (2015-11-06). "Yaara Silly Silly: Silly indeed!". The Hindu (in Indian English). ISSN 0971-751X. Archived from the original on 26 December 2019. Retrieved 2019-12-26.
  7. I don’t socialise much – Vidya Malvade – Filmi Bhatein – It's All About Bollywood. Bollywood.allindiansite.com. Retrieved on 2011-06-23.
  8. "Alliance Air Boeing 737 crashes near Patna". Rediff.com. 2000-07-19. Archived from the original on 27 April 2008. Retrieved 2011-06-23.
  9. "Alliance Air Boeing 737 crashes near Patna". Rediff.com. 2000-07-19. Archived from the original on 27 April 2008. Retrieved 2011-06-23.
  10. "There was a time I wanted to die". Free Press Journal (in ఇంగ్లీష్). June 2, 2019. Archived from the original on 21 May 2022. Retrieved 2020-11-26.