స్మితా పాటిల్

భారతీయ నటి

స్మితా పాటిల్ (జ.17 అక్టోబర్ 1955[1] – మ.13 డిసెంబర్ 1986[3][4]) ఒక భారతీయ సినిమా, టెలివిజన్ నటీమణి.[5] ఈమె ఒక దశాబ్దకాలంలో 80కి పైగా [2] హిందీ, మరాఠీ సినిమాలలో నటించింది.[6] ఈ సమయంలో ఈమెకు రెండు భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు ఒక ఫిల్మ్‌ఫేర్ అవార్డ్ లభించాయి. భారత ప్రభుత్వం ఈమెను 1985లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.

స్మితా పాటిల్
జననం(1955-10-17)1955 అక్టోబరు 17
पुणे, పూణే, మహారాష్ట్ర, భారతదేశం[1][2]
మరణం1986 డిసెంబరు 13(1986-12-13) (వయసు 31)
ముంబాయి, మహారాష్ట్ర, భారతదేశం
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు1974–1986
గుర్తించదగిన సేవలు
మంథన్ (1977),
భూమిక (1977),
ఆక్రోష్ (1980),
చక్ర (1981),
చిదంబరం (1985),
మిర్చ్ మసాలా (1985),
గులామీ (1985)
జీవిత భాగస్వామిరాజ్ బబ్బర్
పిల్లలుప్రతీక్ బబ్బర్
తల్లిదండ్రులుశివాజీ రావ్ గిరిధర్ పాటిల్
విద్యాతాయి పాటిల్
బంధువులువిద్యా మాల్వాదే (మేనకోడలు)

ఈమె నటిగా మాత్రమే కాక ఒక స్త్రీవాద ఉద్యమకారిణిగా కూడా ప్రజల దృష్టిని ఆకర్షించింది. ఈమె స్త్రీల సమస్యల పరిష్కారం పట్ల, వారి అభ్యున్నతి పట్ల నిబద్ధురాలై పనిచేసింది. సినిమాలలో భారతీయ సమాజంలోని సాంప్రదాయ స్త్రీల పాత్రలను పోషించి నాగరిక వాతావరణంలో మధ్య తరగతి స్త్రీలలో కలిగే మార్పులను, వారి లైంగిక భావనలను తన నటన ద్వారా చర్చించింది.[7]

ఈమె సినీ నటుడు రాజ్ బబ్బర్‌ను పెళ్ళాడింది. ఈమె 1986 డిసెంబర్ 13న తన 31వ యేట కాన్పు వల్ల కలిగిన సంక్లిష్టత కారణంగా మరణించింది. ఈమె మరణానంతరం ఈమె నటించిన సినిమాలు సుమారు పది విడుదలయ్యాయి. ఈమె కుమారుడు ప్రతీక్ బబ్బర్ 2008లో సినీనటుడిగా రంగప్రవేశం చేశాడు.

ప్రారంభ జీవితం

మార్చు

ఈమె పూనాలో[8] ఒక మరాఠా కుటుంబంలో జన్మించింది. ఈమె తండ్రి శివాజీరావు గిరిధర్ పాటిల్ మహాష్ట్రకు చెందిన ఒక రాజకీయ నాయకుడు. తల్లి విద్యాతాయి పాటిల్ ఒక సామాజిక సేవకురాలు. ఈమె పూనాలోని రేణుకా స్వరూప్ మెమోరియల్ హైస్కూలులో చదివింది.

ఈమె తొలిసారి 1970లో దూరదర్శన్ లో వార్తలు చదవడం ద్వారా కెమెరా ముందు నిలబడింది.[9] ఈమె పూనాలోని ఫిల్మ్‌ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్‌లో నటనలో డిగ్రీని పొంది శ్యాం బెనగల్ [10] చిత్రం "చరణ్‌దాస్ చోర్" తో సినిమారంగంలోకి అడుగిడింది[11] (1975).

వృత్తి

మార్చు

స్మితా పాటిల్ ప్రధాన స్రవంతిలోని అనేక సినిమాలలో నటించడంతో పాటు సమాంతర సినిమాలలో నటించిన అగ్రనాయికల కోవలో చేరింది. [12] ఈమె మంతన్[1][11] (1977), భూమిక[1] (1977),[11] ఆక్రోష్ (1980), చక్ర (1981), చిదంబరం (1985) , మిర్చ్ మసాలా[13] (1985)[1][12] మొదలైన సినిమాలలో ఎన్నదగిన పాత్రలను వేసింది.

ఈమె షబానా అజ్మీ తరానికి చెందిన నటి. ఆమె మాదిరి ఈమె స్మితా పాటిల్ కూడా విప్లవ రాజకీయ సినిమాలలో నటించింది. ఆర్ట్ సినిమాలు లేదా సమాంతర సినిమాలుగా పిలువబడే చిత్రాలలో ఈమె శ్యాం బెనగల్,[11] గోవింద్ నిహలాని, సత్యజిత్ రే,[4] జి.అరవిందన్, మృణాల్ సేన్ వంటి దర్శకుల వద్ద పనిచేసింది. ఈమె దూరదర్శన్‌లో న్యూస్ రీడర్‌గా కూడా పనిచేసింది. శ్యాం బెనగల్ ఈమెను ఒక ఫోటోగ్రాఫర్‌గా కూడా గుర్తించాడు.[14]

1984లో ఈమె మాంట్రియల్ వరల్డ్ ఫిలిం ఫెస్టివల్‌లో జ్యూరీ సభ్యురాలిగా వ్యవహరించింది.[15] కేతన్ మెహతా 1987లో తీసిన "మిర్చ్ మసాలా" చిత్రంలో ఈమె నటనను ఫోర్బ్స్ పత్రిక "భారత సినిమాలలో 25 అత్యున్నత నట ప్రదర్శనల" జాబితాలో చేర్చింది.[16]

వ్యక్తిగత జీవితం

మార్చు

ఈమె సినీ నటుడు రాజ్ బబ్బర్ తో ప్రేమాయణ కొనసాగించడం[17] ఆమె అభిమానులు, ప్రసార మాధ్యమాల నుండి తీవ్ర విమర్శలకు దారితీసింది. రాజ్ బబ్బర్ తన భార్య నదీరా బబ్బర్‌ను వదిలివేసి ఈమెను వివాహం చేసుకున్నాడు.[18]

ఈమె ప్రతీక్ బబ్బర్‌ను కన్న తరువాత రెండు వారాల తరువాత కాన్పు వల్ల కలిగిన అనారోగ్య సమస్యల కారణంగా 1986, డిసెంబర్ 13న మరణించింది.[4][19]

అవార్డులు

మార్చు
Award Film Character Year Result Notes
జాతీయ ఉత్తమ నటి పురస్కారం భూమిక ఉష/ఊర్వశి డాల్వి 1977 గెలుపు
చక్ర అమ్మ 1980 గెలుపు
ఉత్తమనటిగా ఫిల్మ్‌ఫేర్ పురస్కారం జైత్ రే జైత్ చింధీ 1978 గెలుపు మరాఠీ సినిమా
భూమిక ఉష/ఊర్వశి డాల్వి 1978 ప్రతిపాదించబడింది
ఉంబర్తా సులభా మహాజన్ 1981 గెలుపు మరాఠీ సినిమా
చక్ర అమ్మ 1982 గెలుపు
బజార్ నజ్మా 1983 ప్రతిపాదించబడింది
ఆజ్ కీ ఆవాజ్ రజనీ దేశ్‌ముఖ్ 1985 ప్రతిపాదించబడింది
ఉత్తమ సహాయనటిగా ఫిల్మ్‌ఫేర్ పురస్కారం అర్థ్ కవితా సన్యాల్ 1984 ప్రతిపాదించబడింది
మండీ జీనత్ 1984 ప్రతిపాదించబడింది
పద్మశ్రీ, భారత ప్రభుత్వం చే పౌర పురస్కారం 1985

సినిమాలు

మార్చు
సంవత్సరం సినిమా పాత్ర ఇతర వివరాలు
1974 మేరే సాత్ చల్ గీత
1974 సామ్నా[3][20] కమ్లీ మరాఠీ సినిమా
1975 నిశాంత్ రుక్మిణి[11]
1975 చరణ్‌దాస్ చోర్ రాకుమారి
1976 మంతన్[3] బిందు
1977 భూమిక[3][21] ఊర్వశి డాల్వి జాతీయ ఉత్తమనటి పురస్కారం
1977 జైత్ రే జైత్[20] చిందీ మరాఠీ సినిమా 25వ జాతీయ చలనచిత్రోత్సవంలో ఉత్తమ మరాఠీ చిత్రంగా రాష్ట్రపతి రజిత పతకం
1977 సాల్ సోల్వన్ ఛడ్‌యా పింకీ పంజాబీ సినిమా
1978 కొందూరా / అనుగ్రహం పార్వతి హిందీ / తెలుగు సినిమా
1978 గమన్ ఖైరమ్‌ హుసేన్
1978 సర్వసాక్షి సుజాత మరాఠీ సినిమా
1980 భవానీ భవై[1] ఉజాన్ గుజరాతీ సినిమా
1980 ఆక్రోష్ నాగి లాహన్య
1980 ఆల్బర్ట్ పింటో కో గుస్సా క్యో ఆతాహై జోన్
1980 ది నక్సలైట్స్ అజిత
1980 అన్వేషణె రేవతి[22] కన్నడ సినిమా
1981 చక్ర అమ్మ ఫిల్మ్‌ఫేర్ ఉత్తమనటి పురస్కారం, జాతీయ ఉత్తమనటి పురస్కారం
1981 సద్గతి ఝరియా టెలి ఫిలిం
1981 తజుర్బా
1982 అర్థ్ కవితా సన్యాల్
1982 బద్లేకీ ఆగ్ బిజిలీ
1982 బజార్ నజ్మా
1982 భీగీ పల్కె శాంతి
1982 దర్ద్ కా రిస్తా డా.అనూరాధ
1982 దిల్ ఏ నాదాన్ షీలా
1982 నమక్ హలాల్ పూనమ్‌
1982 శక్తి రోమా దేవి
1982 సితమ్ మీనాక్షి
1982 సుబాహ్ మరాఠీ సినిమా ఉంబర్తాకు హిందీ డబ్బింగ్
1982 ఉంబర్తా[1][3] సులభా మహాజన్ మరాఠీ సినిమా, హిందీలోనికి 'సుబాహ్' అనే పేరుతో డబ్బింగ్ చేయబడింది. ఉత్తమ నటిగా మహారాష్ట్ర ప్రభుత్వం నుండి చిత్రపథ్ పురస్కారం.
1983 మండీ జీనత్[11]
1983 ఘుంగ్రూ కేసర్ బాయి
1983 అర్ధ్ సత్య[3][21] Jyotsna Gokhale
1983 ఖయామత్ శశి
1983 హాద్సా ఆశా
1983 చట్‌పటి
1984 ఆజ్ కీ రజనీ దేశ్‌ముఖ్
1984 రావణ్ గంగా
1984 పేట్ ప్యార్ ఔర్ పాప్
1984 మేరా దోస్త్ మేరా దుష్మన్ లల్లీ
1984 తరంగ్[3] జానకి
1984 శపథ్ శాంతి
1984 కానూన్ మేరీ ముఠ్ఠీమే
1984 గిద్ద్ హనుమి
1984 ఆనంద్ ఔర్ ఆనంద్ కిరణ్
1984 ఫరిస్తా కాశీబాయ్
1984 హమ్‌ దో హమారే దో
1984 కసమ్‌ పైదా కర్నే వాలే కీ ఆరతి
1985 చిదంబరం[3] శివగామి మలయాళం సినిమా
1985 గులామీ సుమిత్ర సుల్తాన్ సింగ్
1985 దేబాషిషు సీత బెంగాలీ సినిమా[23]
1985 ఆఖిర్ క్యో? నిషా
1985 మేరా ఘర్ మేరే బచ్చే గీతా భార్గవ్
1985 జవాబ్ రజని / రాధా గుప్తా / ఫ్రెడీ మార్టిస్/ సల్మా హుసేన్
1986 ఆప్ కే సాథ్ గంగా
1986 అమృత్ కమలా శ్రీవాత్సవ్
1986 దిల్‌వాలా సుమిత్రాదేవి
1986 దెహ్లీజ్ దీప
1986 అంగారే ఆర్తి వర్మ
1986 కాంచ్ కి దీవార్ నిషా
1986 అనోఖా రిస్తా డా.ప్రమీలా
1986 తీస్రా కినారా
1987 మిర్చ్ మసాలా సోన్‌బాయి
1987 డ్యాన్స్ డ్యాన్స్ రాధ
1987 టికానా శశి గోయల్
1987 సూత్రధార్ ప్రేరణ
1987 ఇన్‌సానియత్ కే దుష్మన్ లక్ష్మీనాథ్
1987 అహ్సాన్
1987 రాహీ రానో/సంధ్య
1987 నజ్రానా ముక్తా
1987 ఆవామ్ డా.షబ్నమ్‌
1987 షేర్ శివాజీ
1988 వారిస్ పరమ్‌జీత్
1988 హమ్‌ ఫరిస్తే నహీఁ Roma
1988 ఆకర్షణ్ - ప్రత్యేక పాత్ర
1989 గలియోంకా బాద్‌షా తులసి

ప్రభుత్వ గుర్తింపు

మార్చు

2012లో ఈమె గౌరవార్థం " స్మితా పాటిల్ డాక్యుమెంటరీ అండ్ షార్ట్ ఫిలిం ఫెస్టివల్" నిర్వహించారు.[24] [2] 2013, మే 3వ తేదీన భారత ప్రభుత్వం తపాలా శాఖవారు భారతీయ సినిమా శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఈమె గౌరవార్థం ఒక స్మారక తపాలాబిళ్ల విడుదల చేసింది.

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 Subodh Kapoor (1 July 2002). The Indian Encyclopaedia: Biographical, Historical, Religious, Administrative, Ethnological, Commercial and Scientific. Indo-Pak War-Kamla Karri. Cosmo Publication. pp. 6699–. ISBN 978-81-7755-257-7. Retrieved 29 December 2012.
  2. 2.0 2.1 D. Sharma (1 January 2004). Mass Communication : Theory & Practice In The 21St Century. Deep & Deep Publications. pp. 298–. ISBN 978-81-7629-507-9. Retrieved 29 December 2012.
  3. 3.0 3.1 3.2 3.3 3.4 3.5 3.6 3.7 Annette Kuhn (1990). The Women's Companion to International Film. University of California Press. pp. 310–. ISBN 978-0-520-08879-5. Retrieved 29 December 2012.
  4. 4.0 4.1 4.2 Andrew Robinson (1989). Satyajit Ray: The Inner Eye. University of California Press. pp. 258–. ISBN 978-0-520-06946-6. Retrieved 29 December 2012.
  5. "A blazing talent remembered". The Hindu. 20 December 2002. Archived from the original on 3 అక్టోబరు 2003. Retrieved 2 మే 2017.
  6. Gulzar; Nihalani, Govind; Chatterji, Saibal (2003). Encyclopaedia of Hindi Cinema. Popular Prakashan. p. 601. ISBN 81-7991-066-0.
  7. [1] Archived 2007-08-14 at the Wayback Machine "Reminiscing About Smita Patil"
  8. http://www.sscnet.ucla.edu/southasia/Culture/Cinema/Smita.html
  9. Gulazāra; Govind Nihalani; Saibal Chatterjee (2003). Encyclopaedia of Hindi Cinema: An Enchanting Close-Up of India's Hindi Cinema. Popular Prakashan. pp. 625–. ISBN 978-81-7991-066-5. Retrieved 29 December 2012.
  10. Si. Vi Subbārāvu (2007). Hyderabad: the social context of industrialisation, 1875-1948. Orient Blackswan. pp. 82–. ISBN 978-81-250-1608-3. Retrieved 29 December 2012.
  11. 11.0 11.1 11.2 11.3 11.4 11.5 William van der Heide (12 June 2006). Bollywood Babylon: Interviews with Shyam Benegal. Berg. pp. 208–. ISBN 978-1-84520-405-1. Retrieved 29 December 2012.
  12. 12.0 12.1 Lahiri, Monojit (2002-12-20). "A blazing talent remembered". The Hindu. Archived from the original on 2003-10-03. Retrieved 2011-02-01.
  13. Hena Naqvi (1 January 2007). Journalism And Mass Communication. Upkar Prakashan. pp. 202–. ISBN 978-81-7482-108-9. Retrieved 29 December 2012.
  14. "Indian Cinema - Smita Patil", SSCnet UCLA
  15. "Awards of the Montreal World Film Festival - 1984". Montreal World Film Festival. Archived from the original on 13 మార్చి 2014. Retrieved 13 March 2014.
  16. Prasad, Shishir; Ramnath, N. S.; Mitter, Sohini (27 April 2013). "25 Greatest Acting Performances of Indian Cinema". Forbes. Archived from the original on 12 జనవరి 2016. Retrieved 27 January 2015.
  17. "'She was a great human being'". Rediff.com. 13 December 2006. Retrieved 27 Dec 2011.
  18. "'25 years on, a phenomenon named Smita Patil '". ibnlive.in.com. 13 December 2006. Archived from the original on 8 జనవరి 2012. Retrieved 27 Dec 2011.
  19. Ram Awatar Agnihotri (1998). Film stars in Indian politics. Commonwealth Publishers. ISBN 978-81-7169-506-5. Retrieved 29 December 2012.
  20. 20.0 20.1 "Marathi Cinema Database". Archived from the original on 2019-07-07. Retrieved 2017-05-02.
  21. 21.0 21.1 Anwar Huda (1 January 2004). Art And Science Of Cinema. Atlantic Publishers & Dist. pp. 52–. ISBN 978-81-269-0348-1. Retrieved 29 December 2012.
  22. "Anveshane Movie Plot". Archived from the original on 2016-03-05. Retrieved 2017-05-02.
  23. "Debashishu". Archived from the original on 2009-07-17. Retrieved 2017-05-02.
  24. staff. "Smita Patil Documentary and Short Film Festival". Time Out. Retrieved 19 December 2015.

బయటి లింకులు

మార్చు