వినయ్ నటు
వినయ్ శ్రీధర్ నటు మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మహారాష్ట్ర శాసనసభకు గుహగర్ శాసనసభ నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1][2][3]
వినయ్ నటు | |||
పదవీ కాలం 1995 – 2009 | |||
ముందు | శ్రీధర్ నాటు | ||
---|---|---|---|
తరువాత | భాస్కర్ జాదవ్ | ||
నియోజకవర్గం | గుహగర్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
తల్లిదండ్రులు | శ్రీధర్ నటు | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
రాజకీయ జీవితం
మార్చువినయ్ నటు తన తండ్రి శ్రీధర్ నటు అడుగుజాడల్లో భారతీయ జనతా పార్టీ రాజకీయాల్లోకి వచ్చి 1995 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో గుహగర్ శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఐఎన్‌సీ అభ్యర్థి మోహితే దయానంద్ భగురామ్‌పై 37412 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 1999 ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎన్‌సీపీ అభ్యర్థి చంద్రకాంత్ ధోండుపై 13735 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి, 2004 ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎన్‌సీపీ అభ్యర్థి నందకిషోర్ రాజారాం పవార్‌పై 28183 ఓట్ల మెజారిటీతో గెలిచి వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
వినయ్ నటుకు 2009 ఎన్నికలలో బీజేపీ టికెట్అ దక్కకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి మూడోస్థానంలో నిలిచాడు. ఆయన ఆ తరువాత తిరిగి భారతీయ జనతా పార్టీలో చేరి 2014 ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎన్‌సీపీ అభ్యర్థి భాస్కర్ జాదవ్ చేతిలో 32764 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.
మూలాలు
మార్చు- ↑ Hindustantimes (27 May 2024). "Political dynasties in Maharashtra". Retrieved 14 December 2024.
- ↑ The Hindu (7 October 2009). "Rebel may upset BJP-Sena’s fortunes in Guhagar" (in Indian English). Retrieved 14 December 2024.
- ↑ DNA India (3 October 2019). "Maharashtra Assembly polls: Saffron partners differ over choice of seats" (in ఇంగ్లీష్). Retrieved 14 December 2024.