వినరా సోదర వీరకుమారా

వినరా సోదర వీరకుమారా 2019లో విడుదలైన తెలుగు సినిమా.[1] లక్ష్మణ్ సినీ విషన్స్ బ్యానర్ పై ల‌క్ష్మ‌ణ్‌ క్యాదారి నిర్మించిన ఈ సినిమాకు సతీష్ చంద్ర నాదెళ్ళ దర్శకత్వం వహించాడు. శ్రీ‌నివాస్‌ సాయి, ప్రియాంక జైన్, ఉత్తేజ్, ఝాన్సీ, జెమిని సురేష్‌, ర‌విరాజ్‌, ప‌వ‌న్‌ర‌మేష్‌, స‌న్ని, రోష‌న్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 22 మార్చి 2019న విడుదలైంది.

వినరా సోదర వీరకుమారా
దర్శకత్వంసతీష్ చంద్ర నాదెళ్ళ
రచనసతీష్ చంద్ర నాదెళ్ళ
నిర్మాతల‌క్ష్మ‌ణ్‌ క్యాదారి
తారాగణంశ్రీ‌నివాస్‌ సాయి, ప్రియాంక జైన్, ఉత్తేజ్, ఝాన్సీ, జెమిని సురేష్‌
ఛాయాగ్రహణంర‌వి.వి
కూర్పుమార్తాండ్ కె.వెంకటేష్
సంగీతంశ్ర‌వ‌ణ్‌ భ‌ర‌ద్వాజ్‌
నిర్మాణ
సంస్థ
లక్ష్మణ్ సినీ విషన్స్
విడుదల తేదీ
2019 మార్చి 22 (2019-03-22)
దేశం భారతదేశం
భాషతెలుగు

కథ మార్చు

ఆటో డ్రైవర్ అయిన రమణ(శ్రీనివాస్ సాయి), ఇంజినీరింగ్ చదివే సులోచన (ప్రియాంక జైన్) ను ప్రేమిస్తాడు. అయితే సులోచన మాత్రం రమణ ప్రేమను ఒప్పుకోదు. కానీ రమణ మాత్రం ఆమె ప్రేమను దక్కించుకోవడానికి అనేక ప్రయత్నాలు చేసి చివరకు సులోచనతో ఒకే చెప్పించుకుంటాడు . అయితే సులోచన మాత్రం పెళ్లికి మాత్రం ఒప్పుకోక, తన బావను పెళ్లి చేసుకుంటానంటుంది. దాంతో రమణ ఏం చేశాడు? సులోచనను పెళ్లి చేసుకున్నాడా లేదా? అనేదే మిగతా సినిమా కథ.[2]

నటీనటులు మార్చు

  • శ్రీ‌నివాస్‌ సాయి - రమణ
  • ప్రియాంక జైన్ - సులోచన
  • ఉత్తేజ్
  • ఝాన్సీ
  • జెమిని సురేష్
  • ర‌విరాజ్‌
  • ప‌వ‌న్‌ర‌మేష్‌
  • స‌న్ని
  • రోష‌న్‌
  • చంటి
  • అశ్విని

సాంకేతిక నిపుణులు మార్చు

  • బ్యానర్: లక్ష్మణ్ సినీ విషన్స్
  • నిర్మాత: ల‌క్ష్మ‌ణ్‌ క్యాదారి
  • కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సతీష్ చంద్ర నాదెళ్ళ
  • సంగీతం: శ్ర‌వ‌ణ్‌ భ‌ర‌ద్వాజ్‌
  • సినిమాటోగ్రఫీ: ర‌వి.వి
  • నృత్యాలు: అజయ్ సాయి
  • ఎడిటర్: మార్తాండ్ కె.వెంకటేష్

మూలాలు మార్చు

  1. Vaartha (14 October 2018). "'వినరా సోదర వీరకుమారా' !". Archived from the original on 2 సెప్టెంబరు 2021. Retrieved 2 September 2021.
  2. IndiaGlitz (23 March 2019). "Vinara Sodara Veera Kumaraa review. Vinara Sodara Veera Kumaraa Telugu movie review, story, rating". Archived from the original on 2 సెప్టెంబరు 2021. Retrieved 2 September 2021.