ఉత్తేజ్

నటుడు, మాటల రచయిత

ఉత్తేజ్ సుప్రసిద్ధ తెలుగు హాస్యనటుడు, రచయిత. ఇతను ఆగష్టు 15, 1975లో ఉమ్మడి నల్గొండ జిల్లా సీతారాంపురంలో జన్మించాడు. ఉత్తేజ్ ఒక పేద కళాకారుల కుటుంబంలో జన్మించాడు. ఈయన తండ్రి ఆకుపత్ని శ్రీరాములు నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసిన స్వాతంత్ర్యసమరయోధుడు, తల్లి సుద్దాల శకుంతల. ఉత్తేజ్ తాత, తండ్రి ఇద్దరు డ్రామాలు వేసేవారు, రచనలు కూడా చేసేవారు, ఆ ప్రభావమే నటుడు కావాలని ఉత్తేజ్ పై పడింది. కళలంటే చిన్నప్పటి నుంచే ఆసక్తి ఉన్న ఉత్తేజ్ ఆరేడేళ్ల వయసులోనే రంగస్థలంపై అడుగుపెట్టి హరిశ్చంద్ర నాటకంలో లోహితాస్యుని పాత్ర పోషించాడు.[1] ఇంటర్మీడియట్ చదవటానికి హైదరాబాదు వచ్చి నాంపల్లి ప్రభుత్వ జూనియల్ కళాశాలలో ఇంటర్మీడియట్, సిటీ కాలేజీలో డిగ్రీ పూర్తిచేశాడు. డిగ్రీ చదువుతున్న సమయంలోనే సినిమాలపై ఆసక్తితో రాంగోపాల్ వర్మ వద్ద శివ (1989) సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు. అదే సినిమాలో క్యాంటీన్ బాయ్ గా నటించాడు. ఉత్తేజ్ మేనమామ సుద్దాల అశోక్ తేజ తెలుగు సినీ రంగంలో ప్రసిద్ధ గీత రచయిత.

ఉత్తేజ్
ఉత్తేజ్ UTTEJ.jpg
జననంఆకుపత్ని ఉత్తేజ్
(1975-08-15) 1975 ఆగస్టు 15 (వయస్సు: 44  సంవత్సరాలు)
భారత దేశంసీతారాంపురం, నల్గొండ జిల్లా
ఎత్తు5"7

సైన్స్‌ గ్రాడ్యుయేట్‌ అయిన ఉత్తేజ్‌ కళ్ళు చిత్రానికి అప్రెంటిస్‌ డైరక్టర్‌గా పనిచేసి రావుగారిల్లు సినిమాతో అసిస్టెంట్‌ అయ్యాడు. అప్పుడు రాంగోపాల్ వర్మతో ఏర్పడిన పరిచయం పెరుగుతూ శివ చిత్రం నుంచి రంగీలా వరకు వర్మ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసాడు. శివ, గాయం, మనీ, మాస్టర్‌ తదితర చిత్రాల్లో నటించాడు. మైమ్‌, మేజిక్‌లలో ఆసక్తి గల ఉత్తేజ్‌ రేడియో, నాటికల్లో, టెలీ సీరియళ్ళలోనూ నటించాడు. 1989 నుంచి ఉత్తేజ్ 197 సినిమాలలో నటించాడు.

ఉత్తేజ్ సహాయ దర్శకుడు, హాస్యనటుడిగానే కాక సంభాషణల రచయితగా కూడా సినీరంగంలో ప్రసిద్ధి చెందాడు. మనీ, మనీ మనీ, అంతం, రాత్రి, ఖడ్గం, నిన్నే పెళ్ళాడతా, డేంజర్ మొదలైన తొమ్మిది సినిమాలకు సంభాషణలు వ్రాశాడు.

చందమామ సినిమాకు ఉత్తమ హాస్య నటునిగా నంది బహుమతి పొందాడు.

నటించిన చిత్రాలుసవరించు

మాటల రచయితగాసవరించు

  • మనీ
  • మనీ మనీ
  • అంతం
  • రాత్రి
  • ఖడ్గం
  • నిన్నే పెళ్ళాడతా
  • డేంజర్

మూలాలుసవరించు

  1. ఈనాడు ఆదివారం సంచిక నవంబరు 30, 2008
  2. "143 review". idlebrain. Retrieved 16 May 2019. Cite web requires |website= (help)
  3. తెలుగు ఫిల్మీబీట్. "143 (సినిమా)". telugu.filmibeat.com. Retrieved 16 May 2019.
"https://te.wikipedia.org/w/index.php?title=ఉత్తేజ్&oldid=2832976" నుండి వెలికితీశారు