వినుకొండ పురపాలక సంఘం
వినుకొండ పురపాలక సంఘం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం,పల్నాడు జిల్లాకు చెందిన మున్సిపాలిటీ.ఈ పురపాలక సంఘం నరసారావుపేట లోక్‌సభ నియోజకవర్గం లోని,వినుకొండ శాసనసభ నియోజకవర్గం పరిధికి చెందిన పురపాలక సంఘం.
వినుకొండ | |
స్థాపన | 2005 |
---|---|
రకం | స్థానిక సంస్థలు |
చట్టబద్ధత | స్థానిక స్వపరిపాలన |
కేంద్రీకరణ | పౌర పరిపాలన |
కార్యస్థానం | |
సేవలు | పౌర సౌకర్యాలు |
అధికారిక భాష | తెలుగు |
ప్రధానభాగం | పురపాలక సంఘం |
జాలగూడు | అధికార వెబ్ సైట్ |
చరిత్ర
మార్చువినుకొండ పురపాలక సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పల్నాడు జిల్లాలోని మునిసిపాలిటీ. రాష్ట్ర రాజధానికి అమరావతికి 101 కి.మీ దూరంలో ఉంది.2005 లో గ్రేడ్ -3 మున్సిపాలిటీగా స్థాపించబడింది.ఈ మునిసిపాలిటీలో 26 ఎన్నికల వార్డులు ఉన్నాయి. 2018 లో గ్రేడ్ II మునిసిపాలిటీకి అప్‌గ్రేడ్ చేయబడింది.
జనాభా గణాంకాలు
మార్చు2011 భారత జనాభా లెక్కల ప్రకారం 62,550 జనాభా ఉండగా అందులో పురుషులు 31,566 ,మహిళలు 30,984 మంది ఉన్నారు.అక్షరాస్యత పురుష జనాభాలో 80.45,ఉండగా స్త్రీ జనాభాలో 64.79% అక్షరాస్యులు ఉన్నారు.0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 6798 ఉన్నారు.ఈ పురపాలక సంఘం లో మొత్తం 14,994 గృహాలు ఉన్నాయి.[1]
ప్రస్తుత చైర్‌పర్సన్, వైస్ చైర్మన్
మార్చుప్రస్త్తుత చైర్‌పర్సన్‌గా ఖాజీపూర్ జాన్బీ,[2]వైస్ చైర్మన్‌గా శ్రీనివాస రావు పనిచేస్తున్నారు.[2]
పట్టణంలోని దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు
మార్చు- ప్రసన్న రామలింగేశ్వరస్వామి దేవాలయం
- వీరాంజనేయస్వామి దేవాలయం
ఇతర వివరాలు
మార్చుఈ పురపాలక సంఘం 22.82 చ.కి.మీ.విస్తీర్ణం కలిగి ఉంది.12 రెవెన్యూ వార్డులు,26 ఎన్నికల వార్డులు ఉన్నాయి.ఈ పురపాలక సంఘం లో మురికివాడల సంఖ్య 34 ఉండగా అందులో జనాభా 47962 ఉన్నారు.1 ప్రభుత్వ ఆసుపత్రి,2 కూరగాయల మార్కెట్ ఉన్నాయి.
మూలాలు
మార్చు- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-07-06. Retrieved 2020-07-04.
- ↑ 2.0 2.1 "List of Elected Municipal Chairpersons, 2014 (Andhra)" (PDF). State Election Commission. 2014. Archived from the original (PDF) on 6 సెప్టెంబరు 2019. Retrieved 13 May 2016.