వినోద్ కినరివాలా
వినోద్ కినరివాలా ( 1924 సెప్టెంబరు 20 - 1942 ఆగస్టు 10) గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాదుకు చెందిన భారతీయ స్వాతంత్ర్య కార్యకర్త. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నాడు.[1][2]
వినోద్ కినరివాలా | |
---|---|
జననం | |
మరణం | 1942 ఆగస్టు 10 | (వయసు 17)
వృత్తి | భారత స్వాతంత్ర్య సమరయోధుడు |
జీవిత చరిత్ర
మార్చువినోద్ కినరివాలా 1924, సెప్టెంబరు 20న గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాదులో జమ్నాదాస్ కినారివాలాకు జన్మించాడు. అహ్మదాబాద్‌లోని గుజరాత్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదివాడు.[3] 1942 ఆగస్టు 9న మహాత్మా గాంధీ నేతృత్వంలో క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభమైంది. మరుసటి రోజు లా కాలేజీ విద్యార్థులు నిర్వహించిన ర్యాలీ గుజరాత్ కళాశాలకు చేరుకున్న తరువాత ఆ ర్యాలీని చెదరగొట్టడానికి పోలీసులు లాఠీఛార్జి జరిపారు. ఆ సమయంలో కళాశాల ముందు నిరసన తెలుపుతూ భారత జెండాను ఎగురవేయడానికి ప్రయత్నించిన కినరివాలాను బ్రిటీష్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ పోలీసులు కాల్చి చంపారు.[3][4][5]
స్మారక చిహ్నం, గుర్తింపు
మార్చువినోద్ కినరివాలా జ్ఞాపకార్థం 1947లో లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ కళాశాల ప్రాంగణంలో వీర వినోద్ కినరివాలా మెమోరియల్‌ను ప్రారంభించారు.[1][6] రవిశంకర్ రావల్ రూపొందించిన ఈ స్మారకంలో బ్రిటీష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా యువతకు చిహ్నంగా ఎద్దును కొమ్ముల ద్వారా తీసుకుంటున్నట్లు చిత్రీకరించబడింది. భారత జాతీయ జెండాతో ఒక చేయి, స్వాతంత్ర్య ఉద్యమానికి ప్రతీకగా విరిగిన హ్యాండ్‌కఫ్‌ను కూడా ఇది వర్ణిస్తుంది.[4] ప్రతి సంవత్సరం ఆగస్టు 9న, ఆల్ ఇండియా డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ స్మారక చిహ్నం వద్ద వినోద్ కినరివాలాకు నివాళి అర్పిస్తుంది.[1]
వినోద్ కినరివాలా మరణించిన రహదారికి షాహిద్ వీర్ కినారివాలా మార్గ్ అని పేరు పెట్టారు.[6]
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 1.2 "Tributes to Quit India Movement martyrs". Times of India. 17 February 2013. Archived from the original on 17 February 2013. Retrieved 3 September 2021.
- ↑ "અમદાવાદના શહીદ વિનોદ કિનારીવાલાની વીરતા અને તેની કહાની ન ભૂલી શકાય". GSTV (in అమెరికన్ ఇంగ్లీష్). 2018-08-14. Archived from the original on 2021-12-20. Retrieved 3 September 2021.
- ↑ 3.0 3.1 Chopra, P. N. (1969). Who's Who of Indian Martyrs. Vol. I. Ministry of Education and Youth Services, Government of India. p. 1931. ISBN 978-81-230-2180-5.
- ↑ 4.0 4.1 "Gujarat: Vinod Kinariwala Memorial reminds of sacrifices for freedom". DNA India (in ఇంగ్లీష్). 2019-08-10. Retrieved 3 September 2021.
- ↑ "History of Gujarat College". www.gacc.in. Archived from the original on 18 జూలై 2020. Retrieved 3 September 2021.
- ↑ 6.0 6.1 "Veer Vinod Kinariwala Memorial". Gujarat College, Government of Gujarat. Archived from the original on 28 ఆగస్టు 2015. Retrieved 3 September 2021.