విన్‌స్టన్ బెంజిమన్

(విన్‌స్టన్ బెంజమిన్ నుండి దారిమార్పు చెందింది)

1964, డిసెంబర్ 31న జన్మించిన విన్‌స్టన్ బెంజమిన్ (Winston Benjamin) వెస్టీండీస్కు చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు. 21 టెస్టు మ్యాచ్‌లకు, 85 వన్డే మ్యాచ్‌లకు ఇతడు వెస్టీండీస్ తరఫున ప్రాతినిధ్యం వహించాడు. బెంజమిన్ తన తొలి టెస్టును 1987-88లో భారత్ పై ఢిల్లీలో ఆడినాడు.

Winston Benjamin
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
Winston Keithroy Matthew Benjamin
పుట్టిన తేదీ (1964-12-31) 1964 డిసెంబరు 31 (వయసు 59)
All Saints, Antigua and Barbuda
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుRight-arm fast
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు1987 నవంబరు 25 - ఇండియా తో
చివరి టెస్టు1995 ఏప్రిల్ 29 - ఆస్ట్రేలియా తో
తొలి వన్‌డే1986 అక్టోబరు 17 - పాకిస్తాన్ తో
చివరి వన్‌డే1995 మే 28 - ఇంగ్లాండ్ తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1985–1995Leeward Islands
1986–1993Leicestershire
1994–1996Hampshire
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలుs]] ఫస్ట్ లిస్ట్ ఎ
మ్యాచ్‌లు 21 85 171 222
చేసిన పరుగులు 470 298 3,985 1,725
బ్యాటింగు సగటు 18.80 7.45 22.51 14.13
100లు/50లు 0/2 0/0 2/21 1/4
అత్యుత్తమ స్కోరు 85 31 117 104*
వేసిన బంతులు 3,694 4,442 26,876 10,716
వికెట్లు 61 100 476 263
బౌలింగు సగటు 27.01 30.79 25.96 26.61
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 1 23 5
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 2 0
అత్యుత్తమ బౌలింగు 4/46 5/22 7/54 5/17
క్యాచ్‌లు/స్టంపింగులు 12/– 16/– 95/– 46/–
మూలం: Cricket Archive, 2010 అక్టోబరు 20

టెస్ట్ క్రికెట్

మార్చు

బెంజిమన్ 1987-88లో తొలిసారిగా భారత్ పై ఢిల్లీలో టెస్ట్ క్రికెట్ ఆరంగేట్రం చేశాడు. 8 టెస్టులు ఆడిన తరువాత 1993 వరకు జట్టులో స్థానం దక్కలేదు. రెండు సంవత్సరాలు ఆడిన తరువాత మళ్ళీ 1994-95లో ఆస్ట్రేలియా పర్యటన తరువాత ఉధ్వాసనకు గురైనాడు. మొత్తం 21 టెస్టు మ్యాచ్‌లు ఆడి 470 పరుగులు, 61 వికెట్లు సాధించాడు. టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక స్కోరు 85 పరుగులు. టెస్ట్ బౌలింగ్‌లో అత్యుత్తమ బౌలింగ్ విశ్లేషణ 46 పరుగులకు 4 వికెట్లు.

వన్డే క్రికెట్

మార్చు

బంజిమన్ మొత్తం 85 వన్డేలలో ప్రాతినిధ్యం వహించి 298 పరుగులు, 100 వికెట్లు సాధించాడు. వన్డేలలో అత్యుత్తమ బౌలింగ్ విశ్లేషణ 22 పరుగులకు 5 వికెట్లు.

ప్రపంచ కప్ క్రికెట్

మార్చు

బెంజిమన్ 1987, 1992 ప్రపంచ కప్ క్రికెట్‌లో వెస్ట్‌ఇండీస్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.

కోచ్‌గా

మార్చు

క్రీడాజీవితం అత్యున్నత దశ తరువాత కోచ్‌గా కొత్త అవతారం ఎత్తి లీవార్డ్ ఐలాండ్ జట్టుకు కోచ్‌గా కొద్దికాలం వ్యవహరించాడు. కాని 2005 జూన్లో తొలిగించబడ్డాడు.[1]

మూలాలు

మార్చు
  1. [1] Leewards sack Benjamin, జూలై 1, 2005, accessed మార్చి 16, 2007