విప్రనారాయణ (1937 సినిమా)
1937 తెలుగు సినిమా
1937లో విడుదలైన విప్రనారాయణ తెలుగు చిత్రాన్ని కలకత్తాలో నిర్మించారు. దీని దర్శకుడు అహీంద్ర చౌదరి, ఛాయాగ్రాహకుడు నిమాయి ఘోష్, సంగీతదర్శకుడు ప్రఫుల్ల మిత్ర తదితర సాంకేతిక వర్గమంతా బెంగాళీవాళ్ళే. ఈ సినిమాలో 12 ఏళ్ల సూర్యకుమారితో పాటపాడించటానికై ప్రత్యేకంగా ఆమె కొరకు సినిమాలో ఒక పాత్రను సృష్టించారు.[1] ఈ సినిమాతోనే ఛాయాగ్రాహకునిగా పరిచయమైన నిమాయి ఘోష్ కాంచనమాలకు తొలిసారిగా తెరపరీక్ష చేశాడు.[2] 1937, నవంబర్ 5న విడుదలైన తెలుగు చలనచిత్రంకు ఆహింద్ర చౌదరి దర్శకత్వం వహించగా ఈ చిత్రంలో చిత్తజల్లు కాంచనమాల, కస్తూరి లక్ష్మీనరసింహారావు, టంగుటూరి సూర్యకుమారి తదితరులు నటించగా, ప్రఫుల్ల మిత్ర సంగీతం అందించాడు.
విప్రనారాయణ
మూల దేశం | బ్రిటిషు భారతదేశం |
---|---|
సినిమా లేదా టీవీ షో మూల భాష | తెలుగు |
ప్రచురణ తేదీ | 1937 |
విప్రనారాయణ (1937 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | అహీంద్ర చౌదరి |
---|---|
తారాగణం | చిత్తజల్లు కాంచనమాల, కస్తూరి లక్ష్మీనరసింహారావు, టంగుటూరి సూర్యకుమారి |
సంగీతం | ప్రఫుల్ల మిత్ర |
నేపథ్య గానం | కాంచనమాల, కస్తూరి నరసింహారావు |
గీతరచన | త్రిపురారిభట్ల వీరరాఘవస్వామి |
ఛాయాగ్రహణం | నిమాయి ఘోష్ |
నిర్మాణ సంస్థ | అరోరా పిక్చర్స్ |
భాష | తెలుగు |
తారాగణం
మార్చుసాంకేతికవర్గం
మార్చు- దర్శకత్వం :అహీంద్ర చౌదరి
- సంగీతం: ప్రఫుల్ల మిత్ర
- నేపథ్య గానం: కాంచనమాల, కస్తూరి నరసింహారావు
- గీతరచన: త్రిపురారిభట్ల వీరరాఘవస్వామి
- ఛాయాగ్రహణం: నిమాయి ఘోష్
- నిర్మాణ సంస్థ: అరోరా పిక్చర్స్
పాటలు
మార్చు- ఆర్తత్రాణపరా రంగా అనవరతాశ్రితరక్షణ దీక్షా, గానం. కస్తూరి వెంకట నరసింహరావు
- ఆహాహా ఆ పిల్ల ఎవ్వతె వోహో బంగారు పసిమి తళుకు , గానం. రామబ్రహ్మం
- ఏ నవరసగీతికలను పాడునో నా హృది వీణ , గానం.కాంచనమాల
- ఏబ్రసాపడి తోటకేతెంచు నందాక పనిజేయు , గానం. కస్తూరి వెంకట నరసింహరావు
- ఒరే మూఢ నీ వొక్కడవే ధృతితోడ మాయా బాధ త్రోసి , గానం .కస్తూరి. వెంకట నరసింహారావు , రామబ్రహ్మం, వెంకట సుబ్బయ్య
- కరములు నీ పాద కైంకర్యమును మాని లలితాంగి , గానం. కస్తూరి వెంకట నరసింహరావు
- కరుణామృతస్యందివిలోకన పాహిమాం రంగా రంగా , గానం: బృందం
- కరుణింపగదవయ్య విపృపయినన్ గాసంత దోసము, గానం.కాంచనమాల
- కాకులు రావిపండ్లు దిని జేర శిలామయదేవమందిరా , రచన: వెంకట సుబ్బయ్య
- గతించెగా యవ్వనభాగ్యము ఏవిధి తాళుదున్ కాంచనమాల
- గతియేమున్నది నాకు నీ చరణ కైంకర్యము లేకున్న , గానం. కస్తూరి వెంకట నరసింహరావు
- చాల్ ఛీ ఛీ సిగ్గులేదా నీకు చాలు పొ బొంకులేలా టక్కుజేసి, గానం. సరళ, వెంకట కృష్ణయ్య
- దడదడమని హృదయము దిన నిశము కొట్టుకొనెడి , గానం.కాంచనమాల
- దేవా నాదు హృది జొచ్చితివా ఓహో దేవా , గానం. కస్తూరి వెంకట నరసింహరావు
- నాధా నీ పదముల కర్పణజేసెద ప్రీతితో గైకొను , గానం.కాంచనమాల
- నాధు కౌగలించునొ నాదు బాహులత నాదు మదిలోని వాంఛ , రచన:కాంచనమాల, రమణీ మణి
- నీపాదపద్మముల నిరతము గొలిచెద నెనరున బ్రోవవే, గానం. బృందం
- ప్రేమకు ఫలితమిట్లు గలుగునే విరిసి కనుల నింపనాయె , గానం. కస్తూరి వెంకట నరసింహరావు
- ప్రేమమె ధర్మము ప్రేమమె కర్మము ప్రేమమె ఈశ్వర చింత, గానం. కస్తూరి వెంకట నరసింహరావు, కాంచనమాల
- భరింప భరింప ప్రియ నిశ్చయము భరింప, గానం. కాంచనమాల , కస్తూరి వెంకట నరసింహరావు
- ముద్దులు పెట్టుకొంటాన్ ఓ పెండ్లమ నా పెండ్లమ , గానం. వెంకట కృష్ణయ్య
- రంగనాధ ప్రభో రావగదేల పిలిచి పిలిచి నే నలసితిన్, గానం. కస్తూరి వెంకట నరసింహరావు
- రంగుపిల్లా వేయకుమా పదను చూపు బాణములు
- రతిసుఖసారే గతమభిసారే మదనమనోహర వేషం , గానం.రామబ్రహ్మం
- రూపమున గుంటికాదు కురూపి కాదు వారసతియై , గానం. కస్తూరి వెంకట నరసింహరావు
- శ్రీహరీ కరుణాసాగరా దీనుల బ్రోవంగన్ భారంబంతయు, గానం. బృందం
- స్మర శాస్త్రంబు పటింపజేతు జలజాక్షధ్యానమున్ మాన్పి , గానం. కాంచనమాల
- స్వామి యేమని విన్నవింతు నతికష్టంబైన నా జన్మ , గానం. కాంచనమాల
- హరిహరి యెంతమాట యెటులాడితివే తరలాయతాక్షి , గానం. రమణీ మణి.
- ప్రేమ నగరమున గాంచేద సుఖము సంసారము, గానం.కాంచనమాల.
మూలాలు
మార్చు- ↑ http://www.guardian.co.uk/news/2005/may/18/guardianobituaries.artsobituaries
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-09-28. Retrieved 2009-09-19.
3.ghantasala galaamrutamu, kolluri bhaskararao blog.