విప్లవ శంఖం
విప్లవ శంఖం 1982 ఏప్రిల్ 9న విడుదలైన తెలుగు సినిమా. యువతరం పిక్చర్స్ పతాకం కిద్మ కె.రాధాకృష్ణ నిర్మించిన ఈ సినిమాకు బీరం మస్తాన్ రావు దర్శకత్వం వహించాడు. మాదాల రంగారావు, గిరిబాబు లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు చక్రవర్తి సంగీతాన్నందించాడు.[1]
విప్లవ సంఘం (1982 తెలుగు సినిమా) | |
![]() సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | బీరం మస్తాన్ రావు |
తారాగణం | గిరిబాబు , జయశీల |
సంగీతం | చక్రవర్తి |
నిర్మాణ సంస్థ | జ్యోతి ఆర్ట్ క్రియెషన్స్ |
భాష | తెలుగు |
కథాంశం సవరించు
సామాజిక రుగ్మతలతో తీసుకుంటున్న ఈ వ్యవస్థను సమూలంగా నిర్మూలించి దాని స్థానే సమ సమాజానికి దర్పణం పట్టే నూతన వ్యవస్థను నెలకొల్పాలనీ, ఇది ప్రజా విప్లవం ద్వారానే సుసాధ్యమని ఈ సినిమా ప్రబోధిస్తుంది.
వరకట్న పిశాచంవల్ల కుటుంబాలు ఎలా నాశనమవుతున్నాయో కుటుంబయ్య గాథ వేలెత్తి చూపుతుంది. ప్రభుత్వ కార్యాలయాల్లో తాండవిస్తున్న లంచగొండితనానికి బక్కచిక్కిన రైతులు ఎలా బలి అవుతున్నారో మరొక ఘటన నిరూపిస్తుంది. ఈ సమాజంలో నీతికి, నిజాయితీకి స్థానం లేదనీ, ప్రతిభ, అర్హత ఉన్నవారికి ఉద్యోగాలు దొరకడం లేదనీ మరి కొన్ని పాత్రల ద్వారా చెప్పడం జరిగింది.
కార్మికుల్లో, కర్షకుల్లో తమ హక్కుల సాధన కోసం చైతన్యాన్ని, సమైక్యతను తీసుకు వచ్చి ప్రజా కంటకుల, దోపిడీ దారుల ఆటలు కట్టించాలని సంభాషణల ద్వారా, పాటల ద్వారా సందేశం ఇచ్చారు ఈ చిత్రంలో.
తారాగణం సవరించు
- మాదాల రంగారావు,
- గిరిబాబు,
- నల్లూరి వెంకటేశ్వర్లు,
- చలపతిరావు,
- పి.జె.శర్మ,
- త్రివేణి,
- సీత లత
సాంకేతిక వర్గం సవరించు
- దర్శకత్వం: భీరం మస్తాన్ రావు
- నిర్మాత: కె. రాధాకృష్ణ, టి కృష్ణ
- స్వరకర్త: చక్రవర్తి (సంగీతం);
- సాహిత్యం: శ్రీశ్రీ, వంగపండు ప్రసాదరావు, అదృష్ట దీపక్, కామ్రేడ్ విజయలక్ష్మి
- కథ, మాటలు, స్క్రీన్ ప్లే: మాదాల రంగారావు
- ఛాయాగ్రహణం: రామారావు
పాటలు సవరించు
- చెరసాలల సిరుసులపై ఉరికొయ్యల చివరలపై (శ్రీ శ్రీ)
మూలాలు సవరించు
- ↑ "Viplava Shankam (1982)". Indiancine.ma. Retrieved 2023-04-22.
బాహ్య లంకెలు సవరించు
- "Indiancine.ma". Indiancine.ma. Retrieved 2023-04-22.