విప్లవ రచయితల సంఘం

(విరసం నుండి దారిమార్పు చెందింది)

విప్లవ రచయితల సంఘం (వి.ర.సం.) మార్క్సిజం - లెనినిజం - మావో ఆలోచ‌నతో భార‌త‌దేశంలో జ‌రుగుతున్న నూత‌న ప్ర‌జాస్వామిక విప్ల‌వ కార్య‌చ‌ర‌ణ‌ను ఎత్తిప‌డుతూ సాహిత్య సాంస్కృతిక రంగాల్లో కృషి చేస్తున్న సంస్థ‌.

పరిచయము

మార్చు

తెలుగు సాహిత్యంపై నక్సల్బరీ పతాకం. ఈ మాట ప్రతీకాత్మకం కాదు. వర్ణనామయం అంతకంటే కాదు. భారత సామాజిక చరిత్ర నక్సల్బరీలోకి ప్రవహించి విరసానికి జన్మనిచ్చింది. తెలుగు సాహిత్య కళా, మేధో రంగాల్లో నక్సల్బరీ చైతన్యానికి విరసం తల్లి వేరుగా నిలిచింది. శ్రీకాకుళ విస్ఫోటనలోంచి ప్రజ్వరిల్లిన ప్రత్యామ్నాయ పంథాను విరసం సాహిత్య రంగంలోకి తీసుకొని వచ్చి నక్సల్బరీకి సాంస్కృతిక ప్రతినిధి అయింది. సమూల మార్పు లక్ష్యంగా సాయుధపోరాటాన్ని స్వీకరించిన సామాజిక, రాజకీయ ఉద్యమంలో తాను అంతర్భాగమని సగర్వంగా ప్రకటించుకుంది. సాహిత్యంలో సాహసానికి, తిరుగుబాటుకు, ధిక్కారానికి చిరునామాగా నిలిచింది. అందువల్లే తీవ్ర అణచివేతను, నిర్బంధాన్ని, చివరికి నిషేధాన్ని ఎదుర్కొన్నది. ప్రజల మనిషిగా పునర్జీవమైంది.

నక్సల్బరీ శ్రీకాకుళ ఆదివాసీ విప్లవ శిశువుగా విరసం.. విప్లవోద్యమం వెనువెంట నడుస్తూ భారత పోరాట ప్రజల చరిత్రలో విస్తరిస్తోంది. సమాజంలోని ధిక్కారధారలన్నిటినీ ప్రభావితం చేస్తూ తాను వాటితో ప్రభావితమవుతోంది. విప్లవమంటే.. ప్రగతి దిశగా నేర్చుకోవడం, నేర్పించడం, మార్చడం, మార్పుకు లోనుకావడం అనే గతితర్క భావనకు సాహిత్య, మేధో రంగాల్లో తానే ఒక ఉదాహరణగా నిలిచింది. నిరంతరం సామాజిక వైరుధ్యాలను తట్టి లేపడం, వాటి బృహద్రూపాలను వెలికి తీయడం, వాటితో తలపడుతూ ప్రజలను పరిష్కర్తలుగా తీర్చిదిద్దడం, ప్రజల నేతృత్వంలో మార్పు దిశగా సాగడం.. అనే విప్లవాచరణలో విరసం ఎల్లవేళలా విద్యార్థి. తెలుగు నేల సరిహద్దులు దాటి సువిశాల మధ్య భారతదేశంమంతా, ఉత్తరాంధ్ర నుంచి ఒడిషా మీదుగా లాల్‌గడ్‌ అంతా విప్లవోద్యమం సాధించిన విస్తృతిని విరసం తన చైతన్యంలో అంతర్వాహినిగా మార్చుకున్నది. ప్రత్యామ్నాయ సామాజిక అభివృద్ధికి ప్రయోగశాలగా దండకారణ్యం ప్రపంచాన్ని ఆకర్షిస్తున్న తరుణంలో విరసం తన సృజనశక్తినంతా ధారపోసి దాన్ని విశ్లేషిస్తున్నది. చిత్రిస్తున్నది. ఉత్పత్తి, వర్గపోరాటం, సాంఘిక విముక్తి లక్ష్యంగా సాగుతున్న దండకారణ్య విప్లవోద్యమంలోని సాహిత్య కళా వికాసాన్ని తెలుగు సాహిత్య సాంస్కృతికోద్యమంలో అంతర్భాగం చేస్తున్నది. ప్రజాసైన్యం, ప్రజాయుద్ధం అనే నుడికారం వాప్తవరూపం ధరించిన ఈ వర్తమానంలో ప్రజలపై భారత ప్రభుత్వం చేస్తోన్న యుద్ధంలో విప్లవం పక్షాన నిలబడదామని ఆలోచనాపరులతో చేయి కలపడమే విరసం తన ఏకైక సాంస్కృతిక కర్తవ్యంగా భావిస్తోంది.

సభ్యులు

మార్చు

బయటి లింకులు

మార్చు