విరియాల లక్ష్మీపతి
విరియాల లక్ష్మీపతి తెలుగు కవి, రచయిత.
విరియాల లక్ష్మీపతి | |
---|---|
జననం | 1943 జూలై 7 |
మరణం | 2012 జనవరి 18 విశాఖపట్నం |
ప్రసిద్ధి | కవి, నాటకకర్త |
పిల్లలు | విరియాల గౌతమ్ |
తండ్రి | వెంకటరావు |
తల్లి | భాగీరథి |
జననం
మార్చువిరియాల లక్ష్మీపతి 1943 జూలై 7 న విశాఖపట్నం లోని ఎండాడలో జన్మించాడు. తల్లిదండ్రులు వెంకటరావు, భాగీరథి శిక్షణలో ఇతిహాసాలను ఔపోసన పట్టాడు. చిన్నతనంలోనే సాహిత్యం పట్ల మక్కువను పెంచుకున్నాడు. సాహితీ గురువులైన పురిపండా అప్పలస్వామి, ఆవంత్స సోమసుందర్ ల ప్రేరణతో కవిగా రాణించాడు.
సాహితీ జీవితం
మార్చువిరియాల లక్ష్మీపతి అభ్యుదయ రచయితల సంఘం ప్రధాన కార్యదర్శిగా, ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి గౌరవాధ్యక్షుడుగా పనిచేశాడు. 2000లో అభ్యుదయ సాహితీ కరదీపికకు సంపాదకుడిగా పనిచేశాడు. లక్ష్మీపతి రచనలు ఎక్కువగా ప్రగతిశీల భావజాలాన్ని ప్రతిబింబిస్తూ ఉంటాయి. 'దేవుణ్ణి చేసిన మనిషి' అనే కవితలో కవి, సమాజంలో ప్రబలిపోతున్న మూఢత్వాన్ని, మతమౌఢ్యాన్ని దేవుడిపేరుతో ప్రజల్ని మోసగిస్తున్న తీరును, శ్రమదోపిడీని చాలా చక్కగా చిత్రీకరించాడు. అలాగే వరకట్న హోమంలో ఆహుతైన ఒక స్త్రీ ఇతివృత్తాన్ని 'అగ్నిపునీతం' నాటకంలో తెలిపాడు. ఇక 'పంచమవేదం' నాటకం లక్ష్మీపతికి ఎంతో పేరు తెచ్చింది. ఈ నాటకం ద్వారా దళితులకు జరిగిన అన్యాయాల్ని ఎత్తిచూపాడు. ఈ నాటకాన్ని మద్రాసులో చూసిన ఆత్రేయ లక్ష్మీపతిని ఎంతగానో మెచ్చుకున్నాడు. అలాగే లక్ష్మీపతి సింహాచలభక్తుడు శ్రీకాంతకృష్ణమాచార్యుని జీవితగాథ ఆధారంగా రాసిన శ్రీకాంత కృష్ణతాండవంకు ఆయనకు నంది అవార్డు వచ్చింది.
ఆయన ఎన్నో అనువాదాలు కూడా చేశాడు. 'లోర్కా' అనువాద కవితలతో పాటు, అటల్ బిహారీ వాజ్‌పాయి అనువాద కవితలను ప్రచురించాడు. అలాగే కురుక్షేత్రం, దినకర్ హిందీ కావ్యాలకు తెలుగు అనువాదం చేశారు. [1]
మరణం
మార్చు2012 సంవత్సరంలో తన బంధువుల ఇంటిలో ఓ కార్యక్రమానికి కుటుంబ సమేతంగా ఖమ్మం వెళ్లిన లక్ష్మీపతి, జనవరి 18వ తేదీన రాత్రి సమయంలో నిద్రలోనే పరమపదించాడు. ఆయన స్మృత్యర్థం విశాఖపట్నం 'అరసం', విశాఖపట్నం మార్క్సిస్టు అధ్యయన కేంద్రం వారు కలిసి 'విరియాల లక్ష్మీపతి సాహితీపురస్కారం' పురస్కారాన్ని ప్రతీయేటా ప్రదానం చేస్తున్నారు.[2]
రచనలు
మార్చు- అగ్నిమీళే పురోహితం (కవిత్వం)
- ఆరు బయట అరుణోదయం (1976లో అనిశెట్టి అవార్డు పొందిన కవితాసంపుటి)
- క్రాంతి వత్సర (దీర్ఘకవిత)
- గురుముద్ర (కవిత్వం)
- చిలుకతత్తడిరౌత (దీర్ఘ కవిత)
- ధీరసమరం (కవిత్వం)
- పుడమి ఆక్రోశించింది (కవిత్వం)
- భారతజ్యోతి (కవిత్వం)
- ముక్త శిల్పి (కవిత్వం)
- అగ్నిపునీతం (నాటకం)
- నగారా (నాటకం)
- ఆముక్తమాల్యద (నాటకం)
- పంచమవేదం (1988 లో కళాసాగర్ అవార్డు పొందిన నాటకం)
- శంకర విజయం (నాటకం)
- విజన్ 3కె (నాటకం)
- అక్షర విజయం (నాటిక)
- అరిచేలోయలు (నాటిక)
- అబలాకాండ (నాటిక)
- పెళ్ళివారోచ్చారు (నాటిక)
- మరమనిషి (నాటిక)
- తోలుబొమ్మలాట (నాటిక)
- శివతాండవం (నాటిక)
- శ్రీకాంత కృష్ణ తాండవం (2011 లో నంది అవార్డు పొందిన పౌరాణిక నాటకం)
- అతడు అడివిని జయించాడు (1992 లో జాతీయ పురస్కారం పొందిన రేడియో నాటకం)
మూలాలు
మార్చు- ↑ "విశాలాంధ్ర పత్రికలో వెలమల సిమ్మన్న గారి వ్యాసం". Archived from the original on 2021-05-07. Retrieved 2021-05-07.
- ↑ "విరియాల లక్ష్మీపతి సాహిత్య పురస్కార వివరాలు".
{{cite web}}
: CS1 maint: url-status (link)
యితర లింకులు
మార్చు- విశాలాంధ్రలో వ్యాసం Archived 2021-05-07 at the Wayback Machine
- ఆంధ్రజ్యోతిలో వ్యాసం
- సిలికానాంధ్రలో వ్యాసం
- సారంగ వెబ్ పత్రికలో వ్యాసం Archived 2020-07-16 at the Wayback Machine
- ఆర్కైవ్స్లోని సమాచారం