విల్సన్ హెరాల్డ్

విల్సన్ హెరాల్డ్ ఒక తెలుగు సినీ నేపథ్యగాయకుడు.[1] అదివరకు కొన్ని చిత్రాలలో పాడినా, పెళ్ళి చూపులు (2016 సినిమా)లో పాడిన రాలు పూల రాగ మాల తో ఈయనకి పేరు వచ్చింది. ఈ పాటలో అచ్చం ఘంటసాల తొలినాళ్ళలో పాడినటువంటి గళం వలె ఇతని గళం కూడా ఉండటమే దీనికి కారణం. ఇతని గళం పేరు చంద్రతేజ . (ఒక స్పీచ్ లో సి నారాయణ రెడ్డి పాట పాడితే చంద్రతేజ, పద్యం పాడితే సూర్యతేజ అని సెలవివ్వటంతో విల్సన్ కు ఈ గళం పేరు వచ్చింది.) హూస్టన్ లో జరిగిన తెలుగు అసోసియేషన్ నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలలో విల్సన్ పద్యగాన గంధర్వ అనే బిరుదు కూడా అందుకొన్నారు.

విల్సన్ నెల్లూరుకు చెందినవారు. చిన్ననాటనే వీరిలోని గాత్రపటిమను గుర్తించిన తల్లి ఇతనికి సంగీతం నేర్పించాలని నిశ్చయించింది. శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో వీరు శాస్త్రీయ సంగీతాన్ని అభ్యసించారు. వీరి గళం ఘంటసాల గళం వలె ఉండటంతో వీరు ఎల్లప్పుడూ ఘంటసాల గీతాలను ఆలపిస్తూ శ్రోతలను అలరించేవారు. శాస్త్రీయ సంగీతంలో ప్రావీణ్యుడు ఐన విల్సన్ కేవలం శాస్త్రీయ సంగీతమే కాక జానపద, లలిత, సినీగీతాలను కూడా చక్కగా ఆలపించారు. స్వరాభిషేకం (ధారావాహిక)లో పలు గీతాలను ఆలపించి శ్రోతల మన్ననలను పొందారు.

పెళ్ళిచూపులు సినిమా తో బ్రేక్ మార్చు

పెళ్ళిచూపులలో సినిమాలో రాలు పూల రాగ మాల గీతం వినగనే సినీగీత ప్రియులు ఇదేదో ఘంటసాల గారి పాట రీమిక్స్ చేశారు అనుకొన్నారు. ఘంటసాల పాడిన ఒరిజినల్ ఏ చిత్రంలో ఉన్నదో తెలియక విస్తుపోయారు. టీవీ9కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఇది రీమిక్స్ కాదని, ఇది వరకూ ఏ చిత్రంలో దీనిని ఘంటసాల గారు ఆలపించలేదని, కేవలం ఈ చిత్రం కోసమే ఇది ప్రత్యేకంగా రాయబడ్డదని స్పష్టం చేశారు. ఘంటసాల గళానికి దగ్గర ఉన్నందుకు, తెలుగు సినిమా పాత సంప్రదాయాన్ని గుర్తు చేసినందుకు సినీగీత ప్రియులు విల్సన్ ను వేనోళ్ళ పొగిడారు.

ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు మార్చు