విశాఖపట్నం-సికింద్రాబాద్ దురంతో ఎక్స్‌ప్రెస్
విశాఖపట్నం-సికింద్రాబాద్ దురంతో ఎక్స్‌ప్రెస్ అనేది భారతీయ రైల్వే సూపర్ ఫాస్ట్ ఏసి ఎక్స్‌ప్రెస్ రైలు. ఇది 2011-12 రైల్వే బడ్జెట్లో అప్పటి భారతీయ రైల్వేమంత్రి మమతా బెనర్జీ ద్వారా సికింద్రాబాద్ నుండి విశాఖపట్నం వరకు కలుపబడింది. ఇది రెండు నగరాల మధ్య అత్యంత వేగవంతమైన మార్గం, 18 కోచ్‌లను కలిగి ఉంటుంది.[1] 2012, జూన్ 30న, రైలును జూలై 6న ప్రారంభించనున్నట్లు భారతీయ రైల్వే ప్రకటించింది.[2] అయితే 2012. జూలై 12న విశాఖపట్నం నుండి ప్రారంభించబడింది.[3]
విశాఖపట్నం-సికింద్రాబాద్ ఏసీ దురంతో ఎక్స్‌ప్రెస్ | |||||
---|---|---|---|---|---|
సారాంశం | |||||
రైలు వర్గం | దురంతో ఎక్స్‌ప్రెస్ | ||||
స్థానికత | ఆంధ్రప్రదేశ్, తెలంగాణ | ||||
తొలి సేవ | 2012 జూలై 12 | ||||
ప్రస్తుతం నడిపేవారు | దక్షిణ మధ్య రైల్వే | ||||
మార్గం | |||||
మొదలు | సికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషను | ||||
ఆగే స్టేషనులు | 2 | ||||
గమ్యం | విశాఖపట్నం జంక్షన్ రైల్వే స్టేషను | ||||
ప్రయాణ దూరం | 701 km (436 mi) | ||||
సగటు ప్రయాణ సమయం | 10 గంటల 30 నిమిషాలు | ||||
రైలు నడిచే విధం | త్రై-వీక్లీ | ||||
రైలు సంఖ్య(లు) | 22203/22204 | ||||
సదుపాయాలు | |||||
శ్రేణులు | ఏసీ 1, 2, 3 | ||||
కూర్చునేందుకు సదుపాయాలు | ఉంది | ||||
పడుకునేందుకు సదుపాయాలు | ఉంది | ||||
ఆహార సదుపాయాలు | లేదు | ||||
చూడదగ్గ సదుపాయాలు | పెద్ద కిటికీలు | ||||
బ్యాగేజీ సదుపాయాలు | సీట్ల క్రింద | ||||
సాంకేతికత | |||||
రోలింగ్ స్టాక్ | ఎల్హెచ్బి రేక్ | ||||
పట్టాల గేజ్ | బ్రాడ్ - 1,676 mm (5 ft 6 in) | ||||
వేగం | గంటకు 73 కి.మీ.లు | ||||
|
వివరాలు మార్చు
విశాఖపట్నం-సికింద్రాబాద్ దురంతో ఎక్స్‌ప్రెస్ 10 గంటలు, 15 నిమిషాలలో 701 km (436 mi) దూరాన్ని కవర్ చేయడానికి రెండు నగరాల మధ్య రెండు స్టాప్‌లను కలిగి ఉంది. ఇది రెండు నగరాల మధ్య వేగవంతమైన 2వ రైలు.[4] ఈ రైలుకు విజయవాడ జంక్షన్, గుంటూరు జంక్షన్లలో వాణిజ్య స్టాప్‌లు ఉన్నాయి. గుంటూరు, విశాఖపట్నం మధ్య కనెక్టివిటీని పెంచడానికి 2021, అక్టోబరు 1 నుండి ఇది గుంటూరు జంక్షన్ మీదుగా మళ్ళించబడింది.[5]
కాల పట్టిక మార్చు
విశాఖపట్నం-సికింద్రాబాద్ దురంతో ఎక్స్‌ప్రెస్ | ||||
---|---|---|---|---|
22204 | స్టేషన్లు | 22203 | ||
రాక | నిష్క్రమణ | రాక | నిష్క్రమణ | |
---- | 20:15 | సికింద్రాబాద్ జంక్షన్ | 06:05 | ---- |
23:53 | 23:55 | గుంటూరు జంక్షన్ | 01:25 | 01:27 |
01:00 | 01:10 | విజయవాడ జంక్షన్ | 00:30 | 00:40 |
06:25 | ---- | విశాఖపట్నం జంక్షన్ | ---- | 19:50 |
కోచ్, రేక్ మార్చు
సిసి;- 1ఏసీ—1, 2ఏసీ—3, 3ఏసీ—11, ఈఓజి—2 మొత్తం 18 ఎల్హెచ్బి కోచ్‌లు ఉన్నాయి. ఈ రైలు లాల్లగూడ WAP-7 ద్వారా లాగబడింది, ఈ రైలుకు ఆర్ఎస్ఏ లేదు. సింగిల్ డెడికేటెడ్ రేక్. పిఎం @ ఎస్సీ/ఎస్సీఆర్
మూలాలు మార్చు
- ↑ "Duronto Express on tracks soon". CityofVizag.com. Archived from the original on 22 March 2012. Retrieved 31 March 2012.
- ↑ "Secunderabad–Visakhapatnam Duronto will officially be flagged off on 6th July". IndiaRailInfo.com. Retrieved 2 July 2012.
- ↑ "Tri-weekly Duronto from tomorrow". The Hindu. 11 July 2012. Retrieved 12 July 2012.
- ↑ "New tri-weekly Duronto express between Secunderabad-Vizag introduced". Business Line. Retrieved 12 July 2012.
- ↑ "South Central Railway".