మమతా బెనర్జీ

భారతదేశ రాజకీయ నాయకురాలు

మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి. ఈమె 5 జనవరి 1955 నాడు మమతా బెనర్జీ (బందోపాధ్యాయ) పుట్టింది. దిగువ మధ్య తరగతి కుటుంబానికి చెందిన ప్రోమిలేశ్వర్ బెనర్జీ, గాయత్రి బెనర్జీ లకు పుట్టింది. 1970 దశకంలో రాజకీయ జీవితం ప్రారంభించి, అతివేగంగా, (1976-1980) రాష్ట్ర మహిళా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ పదవిని పొందింది. జాగమయాదేవి కాలేజిలో ఆనర్స్ డిగ్రీ, కలకత్తా విశ్వవిద్యాలయం నుంచి ఎమ్.ఏ (ఇస్లామిక్ చరిత్ర) పట్టాను పొందింది. శ్రీ శిక్షాయతన్ కాలేజి నుంచి ఉపాధ్యాయ విద్యలో కూడా పట్టా పొందింది. జోగేష్ చంద్ర కళాశాల నుంచి 'లా' డిగ్రీని పొందింది. మొండి పట్టుదలకు మొదటి పేరు, భారత దేశమంతటా పేరున్నవనిత. 1984 నాటికి పశ్చిమ బెంగాల్లో వామపక్ష కూటమి మహాయోధులు రాజకీయ రంగ ప్రముఖులుగా వున్న కాలంలో మమతా బెనర్జీ ఒక విద్యార్థినాయకురాలు. కాంగ్రెస్ నాయకుడు సుబ్రతా ముఖర్జీ నాయకత్వంలో, విద్యార్థిరాజకీయాల్లో ముఖ్యంగా కనిపించే, ఈ 'అగ్నిజ్వాల', ఆ కాలంలో వామపక్షంలో, బాగా పేరు ప్రతిష్ఠలున్న నాయకుడు 'సోమనాధ ఛటర్జీ' తో 1984 ఎన్నికలలో పోటీచేసింది. జాదవ్‌పూర్ నియోజక వర్గంలో 'సోమనాధ ఛటర్జీ' తో పోటీ చేయటానికి పెద్ద పెద్ద కాంగ్రెస్ నాయకులు వెనకడుగు వేసిన కాలమది. సోమనాఢ ఛటర్జీకి జాదవ్‌పూర్ నియోజక వర్గం కంచుకోట. చిచ్చర పిడుగు మమతా బెనర్జీ, ఇంటింటికీ వెళ్ళి, పేద సాదలతో ముచ్చటించి, వారితో పాటే తేనీరు సేవించి, వారిని కౌగిలించుకుని, నేనూ మీలో ఒక మనిషినని, మీరు పంపితే, నేను లోక్ సభకు వెళ్లగలను అని ప్రజలతో పాలు నీళ్ళలా కలిసిపోయింది. అటువంటి ప్రచారాన్ని, అట్టడుగు ప్రజలకు చేర్చి, సోమనాధ ఛటర్జీని మట్టి కరిపించింది. 1984లో వామపక్షాల దిమ్మ తిరిగిపోయింది. అప్పటినుంచి మమతా బెనర్జీకి 'ఫైర్ బ్రాండ్'పేరు స్థిరపడింది. ఈమె పెళ్ళి చేసుకోలేదు. సింగూరులో టాటా కంపెనీని గుజరాత్కి తరిమేసి, అక్కడి, బలవంతపు భూసేకరణను ఆపివేయించి, రైతు బంధుగా రైతుల అభిమానాన్ని పొందింది. ఆనాటి పాలక వామ పక్షం దౌర్జన్నాన్ని అతి వీరోచితంగా ఎదుర్కొంది. ఆ సంఘటనతో, వామపక్షం పరువు పోగొట్టుకొని, ప్రజలకు దూరమయ్యింది.[3]

  • మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో రైల్వే మంత్రిగా పనిచేసింది.
  • 13 మే 2011 నాడు, 34 ఏళ్ల కమ్యూనిష్ట్ పాలనను, పశ్చిమ బెంగాల్లో కూకటి వేళ్లతో పెకలించి వేసింది. మమతా బెనర్జీ నిరాడంబర మహిళ (పుచ్చలపల్లి సుందరయ్య లాగ). బట్టలు, వస్తువులు, అలంకారాలు ఏమీ వేసుకోకుండా, అతి సామాన్యంగా గడుపుతుంది. చూపుకి అతి బీదరాలులా కనిపిస్తుంది. ఏవిధమైన అలంకరణ చేసుకోదు. భుజానికి ఓ గుడ్డ సంచి ( వావిలాల గోపాలకృష్ణయ్య లాగ), గుండెనిండా పట్టుదల, మెదడు నిండా పశ్చిమ బెంగాల్ అభివృద్ధి ఆలోచనలు, మాటలనిండా ఆదర్శపు నిప్పు కణికలు ధరించి చేతల్లో నిరూపించిన ధీరవనిత, వీరవనిత. 1996లో తనపై ప్ర్రాణాంతకమైన దాడిని సైతం గుండె నిబ్బరంతో ఎదురొన్న ధీశాలిని. మరో దుర్గామాతగానే, బెంగాల్ ప్రజలు భావిస్తారు.
మమతా బెనర్జీ
মমতা ব্যানার্জী
Portrait of Mamata Banerjee
8th Chief Minister of West Bengal
గవర్నర్M. K. Narayanan
అంతకు ముందు వారుBuddhadeb Bhattacharjee
నియోజకవర్గంభబానీపూర్
Assumed office
20 May 2011
Minister of Railways
In office
22 May 2009 – 19 May 2011
అంతకు ముందు వారుLalu Prasad Yadav
తరువాత వారుManmohan Singh
Member of Parliament
In office
1991–2011
అంతకు ముందు వారుBiplab Dasgupta[1]
తరువాత వారుSubrata Bakshi
వ్యక్తిగత వివరాలు
జననం
মমতা বন্দ্যোপাধ্যায় (Mômôta Bôndyaepadyayô)

(1955-01-05) 1955 జనవరి 5 (వయసు 69)[2]
Kolkata, West Bengal, India
జాతీయతIndian
రాజకీయ పార్టీIndian National Congress (1970–1997)
Trinamool Congress
(1997–present)
నివాసంHarish Chatterjee Street, Kolkata, West Bengal, India
కళాశాలUniversity of Calcutta
Shri Shikshayatan College
Jogamaya Devi College
Jogesh Chandra Chaudhuri Law College
నైపుణ్యంPolitician
EthnicityBengali

పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రిగా

మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రిగా 5 మే 2021న ప్రమాణస్వీకారం చేసింది. గవర్నర్‌ జగదీప్‌ ధన్‌కడ్‌ ఆమెచేత ప్రమాణ స్వీకార చేయించాడు. మమతా బెనర్జీ వరుసగా మూడోసారి పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రిగా భాద్యతలు చేపట్టింది.[4][5]

మూలాలు

  1. Kolkata Dakshin (Lok Sabha constituency)
  2. "Mamata Banerjee's Biodata in Lok Sabha's Document". loksabha.nic.in. Archived from the original on 2012-05-25. Retrieved 2014-01-04.
  3. fullformfactory (2021-12-03). "TMC Full Form | What Does TMC Stands For?". FullForm Factory (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-12-06.[permanent dead link]
  4. NDTV (5 May 2021). "Mamata Banerjee Takes Oath As Bengal Chief Minister For 3rd Time". Archived from the original on 5 మే 2021. Retrieved 5 May 2021.
  5. Sakshi (5 May 2021). "బెంగాల్‌ సీఎంగా మమతా బెనర్జీ ప్రమాణస్వీకారం". Archived from the original on 5 మే 2021. Retrieved 5 May 2021.