విశాఖ ఉక్కు కర్మాగారం

భారత్ ఉక్కు తయారీ సంస్థ
విశాఖపట్నం-విజయవాడ రైలు మార్గము
ఖుర్దా రోడ్ - విశాఖపట్నం రైలు మార్గము వైపునకు
కొత్తవలస-కిరండల్ రైలు మార్గము వైపునకు
24
కొత్తవలస
15
పెందుర్తి
8
ఉత్తర సింహాచలం
7
సింహాచలం
6
గోపాలపట్నం
జాతీయ రహదారి 16
మార్షలింగ్ యార్డు (కుడివైపు లైన్లు
4
మర్రిపాలెం
[[File:BSicon_/ విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం.svg|x20px|link=|alt=|/ [[విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం]]]]
నావల్ డాక్ యార్డు
ఎస్సార్ స్టీల్
ఐరన్ ఓర్ సైడింగులు
9
కొత్తపాలెం
విశాఖపట్నం పోర్టు - హార్బరు లోపల
0
విశాఖపట్నం
హిందూస్థాన్ జింక్ లిమిటెడ్
భారత్ హెవీ ప్లేట్ అండ్ వెసెల్స్(బిహెచ్‌పివి)
జాతీయ రహదారి 16
కోరమాండల్ ఇంటర్నేషనల్
విశాఖపట్నం రిఫైనరీ ఆఫ్ హెచ్‌పిసిఎల్
విశాఖపట్నం పోర్టు చానల్ (నీలం)
విశాఖపట్నం పోర్టు - హార్బర్ లోపల
హిందూస్థాన్ షిప్ యార్డ్
విశాఖపట్నం పోర్టు - హార్బరు బయట
డాల్ఫిన్స్ నోస్ (కొండతో లైట్‌హౌస్)
బంగాళాఖాతంలింకుకు
విశాఖ ఉక్కు కర్మాగారం
గంగవరం పోర్ట్
17
దువ్వాడ
జాతీయ రహదారి 16
సింహాద్రి ఎస్‌టిపిపి అఫ్ ఎన్‌టిపిసి
27
తాడి
జాతీయ రహదారి 16
33
అనకాపల్లి
38
కశింకోట
42
బయ్యవరం
జాతీయ రహదారి 16
50
నరసింగపల్లి
57
ఎలమంచిలి
జాతీయ రహదారి 16
62
రేగుపాలెం
75
నర్సీపట్నం రోడ్డు
86
గుల్లిపాడు
జాతీయ రహదారి 16
తాండవ నది
97
తుని
105
హంసవరం
110
తిమ్మాపురం
113
అన్నవరం
120
రావికంపాడు
123
దుర్గాడ గేటు
133
గొల్లప్రోలు
138
పిఠాపురం
150 / 13
సామర్లకోట
సర్పవరం
కాకినాడ టౌన్
0
కాకినాడ పోర్టు
నాగార్జున ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్
కాకినాడ
కోరమాండల్ ఇంటర్నేషనల్
గోదావరి ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్
6
కొవ్వాడ
10
అర్తలకట్ట
15
కరప
18
వాకాడ
22
వేలంగి
24
నరసపురపుపేట
30
రామచంద్రపురం
35
ద్రాక్షారామం
39
కుందూరు
42
గంగవరం
45
కోటిపల్లి
కోటిపల్లి రేవు (యార్డు)
155
గూడపర్తి
159
మేడపాడు
162
పెదబ్రహ్మదేవం
167
బిక్కవోలు
171
బలభద్రపురం
177
అనపర్తి
181
ద్వారపూడి
185
కేశవరం
జివికె పవర్ ప్లాంట్
191
కడియం
జాతీయ రహదారి 16
200
రాజమండ్రి
204
గోదావరి
[[File:BSicon_/ రాజమండ్రి విమానాశ్రయం.svg|x20px|link=|alt=|/ [[రాజమండ్రి విమానాశ్రయం]]]]
గోదావరి ఆర్చ్ వంతెన / గోదావరి
గోదావరి వంతెన / గోదావరి
208
కొవ్వూరు
211
పశివేదల
215
చాగల్లు
219
బ్రాహ్మణగూడెం
223
నిడదవోలు జంక్షన్
230
కాలధారి
234
సత్యవాడ
జాతీయ రహదారి 16
239
తణుకు
242
వేల్పూరు
245
రేలంగి
234
సత్యవాడ
250
అత్తిలి
252
మంచిలి
257
ఆరవిల్లి
260
లక్ష్మీనారాయణపురం
262
వేండ్ర
272 / 0
భీమవరం జంక్షను
30
నరసాపురం
26
గోరింటాడ
21
పాలకొల్లు
16
లంకలకోడేరు
13
శివదేవుచిక్కాల
11
వీరవాసరం
7
శృంగవృక్షం
5
పెన్నాడ అగ్రహారం
274
భీమవరం టౌన్
281
ఉండి
286
చెరుకువాడ
292
ఆకివీడు
302
పల్లెవాడ
308
కైకలూరు
316
మండవల్లి
319
మొఖాసాకలవపూడి
322
పుట్లచెరువు
324
పసలపూడి
327
గుంటకోడూరు
330
మోటూరు
337 / 0
గుడివాడ జంక్షన్
మచిలీపట్నం పోర్ట్ (ప్రణాళిక)
374
మచిలీపట్నం
370
చిలకలపూడి
364
పెడన
356
వడ్లమన్నాడు
352
కౌతరం
348
గుడ్లవల్లేరు
343
నూజెళ్ళ
7
దోసపాడు
9
వెంట్రప్రగడ
13
ఇందుపల్లి
18
తరిగొప్పుల
24
ఉప్పలూరు
30
నిడమానూరు
జాతీయ రహదారి 16
35
రామవరప్పాడు
39
మధురానగర్
230
మారంపల్లి
234
నవాబ్‌పాలెం
237
ప్రత్తిపాడు
243
తాడేపల్లిగూడెం
249
బాదంపూడి
254
ఉంగుటూరు
257
చేబ్రోలు
260
కైకరం
265
పూళ్ళ
271
భీమడోలు
277
సీతంపేట
281
దెందులూరు
జాతీయ రహదారి 16
290
ఏలూరు
292
పవర్‌పేట
299
వట్లూరు
జాతీయ రహదారి 16
309
నూజివీడు
315
వీరవల్లి
318
తేలప్రోలు
325
పెదఆవుటపల్లి
330
విజయవాడ విమానాశ్రయము
గన్నవరం
337
ముస్తాబాద
344
గుణదల
వరంగల్ కు
350 / 43
విజయవాడ జంక్షన్
కృష్ణానది
గుంటూరు-కృష్ణ కెనాల్ రైలు మార్గము నకు
విజయవాడ-చెన్నై రైలు మార్గము నకు


వైజాగ్ స్టీల్ (Vizag Steel) గా ప్రసిద్దమైన విశాఖ ఉక్కు కర్మాగారం (Visakhapatnam Steel Plant), భారతదేశంలోని అత్యాధునికమైన ప్రభుత్వరంగ ఉక్కు తయారీదారు. ఇది, విశాఖపట్టణం నగరానికి దాదాపు 26 కిలోమీటర్ల దూరంలో, జర్మనీ, సోవియట్ రష్యాల సాంకేతిక సహకారంతో నిర్మించబడింది. కర్మాగారం యొక్క ఉత్పత్తులు మన్నిక కలిగినవిగా దేశవిదేశాలలో పేరుగన్నవి. సంస్థ రాబడిలో 80% జపాన్, జర్మనీ, అమెరికా సంయుక్త రాష్ట్రాలు, దుబాయ్, సింగపూర్, ఆస్ట్రేలియా, దక్షిణ అమెరికా దేశాలకు చేయబడుతున్న ఎగుమతుల ద్వారానే వస్తున్నది. 2010 నవంబరు 10న నవరత్న హోదా పొందినది. కర్మాగారం విస్తరించి ఉన్న ప్రాంతం, భారతదేశం, ఆసియా మైనర్ లలోనే అతి పెద్దది.

చరిత్రసవరించు

 
వైజాగ్ స్టీల్ ప్లాంట్ వద్దనున్న స్మారక చిహ్నం

విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు అంటూ తమనంపల్లి అమృతరావు గారి ఆమరణ నిరాహారధీక్షతో ది.15.10.1966 న ప్రారంభమైన "విశాఖఉక్కు ఆంధ్రులహక్కు" ఉధ్యమం..ఆ ఉధ్యమం తదుపరి పదిరోజులకు "అఖిలపక్ష సంఘం ఏర్పాటు చేసిన దివంగత తెన్నేటి వారు. తెన్నేటి విశ్వనాధం అమృతరావు ధీక్షకు సానుభూతిగా నాడు నడిపిన ఉద్యమ ఫలితంగా, అప్పటి దేశ ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధీ అమృతరావుగారికి నాటి ప్రధాని ఇందిరాగాంధీ గారి లిఖితపూర్వక హామీ నాటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డిగారిచే ది.03.11.1966న హామీ.,1970 ఏప్రిల్ 17 విశాఖపట్నంలో ఉక్కు కర్మాగారాన్ని నెలకొల్పనున్నట్లు పార్లమెంటులో ప్రకటించింది. కర్మాగారం కోసం కురుపాం జమీందారులు 6000 ఎకరాలను 1970లో దానం చేసారు. 1970 జూన్ లో ఏర్పాటు చేసిన స్ఠల పరిశీలన కమిటీతో కర్మాగారాపు ప్రణాళికలు మొదలయ్యాయి. 1971 జనవరి 20న శ్రీమతి ఇందిరా గాంధీచేత కర్మాగారం యొక్క శంకుస్థాపన కార్యక్రమం జరిగింది.

1971 ఫిబ్రవరిలో సలహాదారులు నియమింపబడ్డారు. 1972 లో సాధ్యాసాధ్య నివేదిక (feasibility report) ప్రభుత్వానికి సమర్పంపబడింది. 1974 ఏప్రిల్ 7న మొదటి దశ స్థల సేకరణ జరిగింది. 1975 ఏప్రిల్ నెలలో సమగ్ర నివేదిక సమర్పంచేందుకు M/s M.N.దస్తూర్ & కోని సలహాదారుగా ఏర్పాటు చేయగా, 3.4 ఎం.టి.పి.ఏ ద్రవ ఉక్కు తయారీ సామర్థ్యత గల కర్మాగార ఏర్పాటుకై ప్రతిపాదనలు 1977 అక్టోబరులో ప్రభుత్వానికి చేరాయి. పూర్వ సంయుక్త రష్యా సహకారంతో నివేదికలో అనేక మార్పులు చేర్పులు జరిగాయి. 1980 నవంబరులో M/s M.N.దస్తూర్ & కో సమగ్ర నివేదికని సమర్పించింది. కోక్ ఒవెన్, సెగ కొలిమి, సింటర్ ప్లాంట్ల రూపకల్పనకై పూర్వపు రష్యా దేశంతో 1981 ఫిబ్రవరిలో ఒప్పందం కుదిరింది. 1982 జనవరిలో సెగ కొలిమి నిర్మాణానికి, ఉద్యోగస్ఠుల పట్టణానికి శంకుస్థాపన జరిగింది.

1982 ఫిబ్రవరిలో రాష్ట్రీయ ఇస్పాత్ నిగం లిమిటెడ్ (RINL) ఏర్పడింది. 1982 ఏప్రిల్ నెలలో వైజాగ్ స్టీల్, భారతీయ ఉక్కు సంస్థ (SAIL) ఉండి విడివడి RINL గా గుర్తింపు పొందినది.

33వేల ఎకరాలలో విస్తరించి ఉన్న వైజాగ్ స్టీల్, భారతదేశంలో తీర ప్రాంతంలో ఉన్న ఏకైక ఉక్కు కర్మాగారం. 3.6 MTగా ఉన్న ఉత్పత్తి సామర్థ్యాన్ని 6.3MTకి పెంచే రూ. 8,692కోట్ల విస్తరణ ప్రాజెక్టుని దేశ ప్రధాని శ్రీ మన్మోహన్ సింగ్ 2009 మే 29న ప్రారంభించారు.

విభాగాలుసవరించు

కర్మాగారం మొత్తంగా, 35 మైళ్ళ మేర 25 వేల ఎకరాలలో విస్తరించి ఉంది. సంస్థలోని విభాగాలు

 • రా మెటీరియల్ హాండ్లింగ్ ప్లాంట్ ( Raw Material Handling Plant - RMHP)
 • కోక్ ఒవెన్, కోల్ కెమికల్ ప్లాంట్ (Coke Ovens and Coal Chemical Plant)
 • సింటర్ ప్లాంట్ (Sinter Plant)
 • బ్లాస్ట్ ఫర్నెస్ (సెగ కొలిమి)
 • స్టీల్ మెల్ట్ షాప్, కంటిన్యుస్ కాస్టింగ్ (Steel Melt Shop and Continuous Casting)
 • లైట్ & మీడియం మర్చంట్ మిల్ల్ (Light and Medium Merchant Mill)
 • మీడియం మర్చంట్ & స్ట్రక్చరల్ మిల్ల్ (Medium Merchant and Structural Mill)
 • వైర్ రాడ్ మిల్ల్ (Wire Rod Mill)
 • థర్మల్ పవర్ ప్లాంట్ (THERMAL POWER PLANT)

ఉక్కుకర్మాగారం అధికార్ల వివరాలుసవరించు

ఉక్కుకర్మాగారం అధికార్ల వివరాలకు, వారి చిత్రాలకు చూడు [permanent dead link]

 • సి ఎండి (ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్).... పి. మధుసుదన్.
 • డైరెక్టర్ (పర్సనల్)..................వై.ఆర్.రెడ్డి.
 • డైరెక్టర్ (ఆపరేషన్స్)................. ఉమేష్ చంద్ర.
 • డైరెక్టర్ (ఫైనాన్స్) .................. పి.మధుసూదన్.
 • డైరెక్టర్ (కమర్షియల్)................. టి.కె. చాంద్.
 • ప్రభుత్వం నియమించిన డైరెక్టర్లు.
 • ఎ.ఎస్. అండ్ ఎఫ్.ఎ (స్టీల్), మినిస్ట్రీ ఆఫ్ స్టేల్, భారత ప్రభుత్వం .. ఎస్. మచేంద్రనాథన్.
 • జాయింట్ సెక్రటరీ (స్టీల్), మినిస్ట్రీ ఆఫ్ స్టేల్, భారత ప్రభుత్వం .. డా. దలిప్ సింగ్, ఐ.ఎ.ఎస్.
 • పార్ట్ టైమ్ నాన్-అఫీషియల్ (స్వతంత్ర) డైరెక్టర్లు.
 • ఎపివిఎన్ శర్మ
 • స్వాష్పవన్ సింగ్
 • హెచ్.ఎస్. చహర్
 • డా. యు.డి.చౌబే
 • చీఫ్ విజిలెన్స్ అధికారి ...- శ్రీనివాస్ గల్గలి, ఐ.టి.ఎస్.
 • జనరల్ మేనేజర్ (ఫైనాన్స్ అండ్ అక్కౌంట్స్) (ఎప్ అండ్ ఎ).
 • ఉక్కుకర్మాగారం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా పదోన్నతులు పొందిన అధికారులు 2011 ఆగస్టు 12 శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. కర్మాగారంలోని జనరల్ మేనేజర్లుగా పనిచేస్తున్న ఐదుగురు అధికారులకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా పదోన్నతులు కల్పిస్తూ యాజమాన్యం ఉత్తర్వులను జారీ చేసింది.
 • పదవి, పేరు....................................... .పదవి స్వీకరించిన తేది.
 • ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (వర్క్స్ ) - రాజేంద్ర రంజన్ ..............2011 ఆగస్టు 12
 • ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (మెయింటెనెన్స్) - పిసి మహాపాత్రో ............2011 ఆగస్టు 12
 • ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ప్రాజెక్ట్స్ అండ్ కమిషన్) - ఎన్.ఎస్.రావు ..........2011 ఆగస్టు 12
 • ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఎంఎం) - జివిఎస్ రెడ్డి ...............2011 ఆగస్టు 12
 • ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ప్రాజెక్ట్స్) -ఎన్.ఎస్ సుధాకర్ ...........2011 ఆగస్టు 12

పూర్వపు ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్లుసవరించు

 • బి.కె. పాండా ...... సెప్టెంబరు 2004
 • డి.కె.సింగ్ ....... 2002 ఆగస్టు 3
 • డా. బి.ఎన్.సింగ్... 2002 జూలై 27
 • వై. శివసాగర రావు
 • పి.కె.బిష్ణోయ్

ప్రమాదాలుసవరించు

కొత్తగా ఏర్పాటు చేయబడిన ఆక్సిజన్ ప్లాంట్ ని పరీక్షిస్తున్న సమయంలో (2012 జూన్ 13న), జరిగిన భారీ విస్ఫోటనంలో 19 మంది మృతి చెందారు. [1] కేంద్ర ఉక్కు శాఖా మంత్రి శ్రీ. బేణీ ప్రసాద్ వర్మ, మృతిచెందిన ఉద్యోగస్థుల కుటుంబాలకు 20 లక్షల నష్టపరిహారాన్ని ప్రకటించారు.

మూలాలుసవరించు

 1. "Massive explosion and fire in Vizag Steel plant, 16 dead, many injured". 13 June 2012.

బయటి లింకులుసవరించు