విశ్వనాధ నాయకుడు

విశ్వనాథ నాయకుడు 1987 లో విడుదలైన చారిత్రాత్మక తెలుగు సినిమా. నిర్మాత వడ్డే రమేష్

విశ్వనాధ నాయకుడు
(1987 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం దాసరి నారాయణరావు
నిర్మాణం వడ్డే రమేష్
తారాగణం కృష్ణంరాజు,
శివాజీ గణేశన్,
కృష్ణ,
కె.ఆర్.విజయ,
జయప్రద,
శరత్‌బాబు
నిర్మాణ సంస్థ విజయ మాధవీ కంబైన్స్
భాష తెలుగు

తారాగణం

మార్చు

పాటల జాబితా

మార్చు
  • ఈచిత్రంలోని పాటల రచయితలు : ఆర్రుద్ర, సి నారాయణ రెడ్డి.
  • లలితకళా , వి.రామకృష్ణా, మాధవపెద్ది రమేష్, ప్రకాశరావు
  • ఇది నాట్య నీరాజనం , గానం: సుశీల
  • మరువనంటోంది మనసు , గానం: మాధవపెద్ది రమేష్, సుశీల
  • ఓక నర్తకి , గానం: రాజ్ సీతారామ్, సుశీల
  • ఇటు నారీ , గానం: సుశీల, వాణి జయరాం
  • ఎవని, గానం: మాధవపెద్ది రమేష్, వి రామకృష్ణా
  • వాన మయూరి , గానం: మాధవపెద్ది రమేష్, పి సుశీల
  • కత్తికి కత్తి , గానం:మాధవపెద్ది సత్యం , మాధవపెద్ది రమేష్
  • విద్యానగరా, గానం: మాధవపెద్ది రమేష్
  • బుర్రకథ , గానం.ప్రకాశరావు .

సంక్షిప్త చిత్రకథ

మార్చు

బలిజ నాయక వంశ రాజ్య పాలనకు ఆద్యుడు విశ్వనాధనాయకుడు. శ్రీకృష్ణదేవరాయల సర్వసేనాని నాగమనాయకుని కుమారుడు విశ్వనాధ నాయకుడు. నాగమనాయకునికి చాలా కాలం సంతానం కలగలేదు. భార్యతో కాశీ యాత్ర చేసిన తరువాత కుమారుడు కలిగేడు. విశ్వనాధుని దయతో కలిగినాడని విశ్వనాధనాయకుడని నామకరణం చేసేడు నాగమనాయకుడు. నాగమనాయకుడు ప్రభుభక్తి పరాయణునిగా కీర్తి గాంచేడు. శ్రీ కృష్ణదేవరాయలకు అత్యంత ఆప్తులలో, ఆంతరంగికులలో ఒకడు నాగమనాయకుడు. తండ్రి పలుకుబడితో ప్రమేయం లేకుండా స్వయంప్రతిభతో శ్రీ కృష్ణదేవరాయలి అంగరక్షకునిగా నియమితుడైనాడు విశ్వనాధ నాయకుడు.

మధురనేలుతున్న పాండ్య రాజు, తంజావూరు పాలకుడు చోళ రాజు శ్రీకృష్ణదేవరాయల సామంతులు. చోళరాజు పాండ్యుని పై దండయాత్ర చేసి పాండ్యరాజుని రాజ్యభ్రష్టుని చేసేడు. పాండ్యరాజు శ్రీకృష్ణదేవరాయలితో మొర పెట్టుకున్నాడు. శ్రీకృష్ణదేవరాయలు చోళ రాజుని శిక్షించి, పాండ్యరాజుని తిరిగి సింహాసనం పై పునఃప్రతిష్ఠ వలిసిందిగా నాగమనాయకుని ఆదేశిస్తాడు. నాగమనాయకుడు చోళుని ఓడించి రాజ్యాన్ని హస్తగతం చేసుకుంటాడు. కానీ రాజాజ్ఞను ధిక్కరించి తనను స్వతంత్ర రాజుగా ప్రకటించుకుంటాడు. ఊహించని ఈ పరిణామానికి శ్రీకృష్ణదేవరాయలు విస్తుపోతాడు. నాగమనాయకుని పట్టి బంధించగల వారెవరని నిండు సభలో ప్రశ్నిస్తాడు శ్రీకృష్ణదేవరాయలు.. ఎవరూ ముందుకు రారు. విశ్వనాధ నాయకుడు తండ్రి నెదుర్కొనడానికి ముందుకొస్తాడు. విశ్వనాధనాయకుడి తల్లి ఈ పరిణామానికి తల్లడిల్లుతుంది. ఎవరికి ఆపద జరిగినా తనకు తీరని దుఃఖం కలుగుతుందని కలవరపడుతుంది.. తండ్రి ద్వారా సంక్రమించిన కళంకాన్ని చెరపవలసిన బాధ్యత తనదే అని తల్లిని ఒప్పించి, శ్రీకృష్ణదేవరాయల, మహామంత్రి ఆశిస్సులతో దాడికి వెడలుతాడు విశ్వనాధనాయకుడు. నాగమనాయకుని కుమారుని తనతో కలవమంటాడు.. విశ్వనాధుని భవిష్యత్తు కై తానీ నిర్ణయం తీసుకున్నానని నచ్చచెప్ప బోతాడు. శ్రీకృష్ణదేవరాయల వారి మన్నింపు కోరి రాజాజ్ఞ పాటించమంటాడు విశ్వనాధనాయకుడు. తండ్రికొడుకుల మధ్య యుధ్దం అనివార్యమవుతుంది. యుధ్దంలో తండ్రిని ఎదిరించి, ఓడించి, బంధించి ప్రభువు ముందు నిలుపుతాడు విశ్వనాధనాయకుడు. నాగమనాయకుని మన్నించి విశ్వనాధనాయకుని పాండ్యరాజ్యానికి రాజుగా ప్రకటిస్తాడు శ్రీకృష్ణదేవరాయలు. పాండ్యరాజుకు విజయనగరంలో ఆశ్రయం కల్పిస్తాడు శ్రీకృష్ణదేవరాయలు.

చిత్రం ఆశించినంతగా విజయవంతం కాలేదు.

అవార్డులు

మార్చు
సంవత్సరం ప్రతిపాదించిన విభాగం పురస్కారం ఫలితం
1987 పి.సుశీల
("కవిజన సమాజ భోజ" గానమునకు)
నంది ఉత్తమ నేపథ్య గాయనీమణులు గెలుపు
1987 వి. ఎస్. ఆర్. స్వామి నంది ఉత్తమ ఛాయాగ్రాహకులు గెలుపు
1987 భాస్కర రాజు నంది ఉత్తమ కళా దర్శకులు గెలుపు

బయటి లింకులు

మార్చు