విశ్వనిర్మాణ శాస్త్రం

విశ్వనిర్మాణ శాస్త్రం లేక విశ్వసృష్టి శాస్త్రం (కాస్మాలజీ) అంటే ఈ విశ్వం పుట్టుకను గురించి అధ్యయనం చేసే శాస్త్రం. ఇది భౌతిక, అధిభౌతిక శాస్త్రాలకు ఉపవిభాగం. ఖగోళ శాస్త్రంలో విశ్వం అనేది ఎలా పుట్టింది, కాలక్రమంలో ఎలా మార్పు చెందుతూ వస్తోంది అని అధ్యయనం చేస్తారు. మత, ధార్మిక పురాణాలలో కూడా విశ్వసృష్టి గురించి అనేక కథనాలు, భావనలు, మార్మిక విషయాలు ఇమిడి ఉన్నాయి.

2012 సెప్టెంబరులో హుబుల్ ఎక్స్ట్రీం డీప్‌ఫీల్డ్ చిత్రీకరించిన విశ్వం. అప్పటి కాలానికి అత్యంత దూరంలో ఉన్న గెలాక్సీలను (నక్షత్ర మండలాలు) కూడా అది బంధించగలిగింది. ఘనంగా కనిపిస్తున్న కొన్ని నక్షత్రాలను మినహాయిస్తే, ఇందులో ఉన్న ప్రతి చుక్క ఒక ప్రత్యేకమైన గెలాక్సీనే. వాటిలో కొన్ని 1320 కోట్ల సంవత్సరాల వయసు గలవి; మనం పరిశీలించగల విశ్వంలో 2 ట్రిలియన్ల కంటే ఎక్కువ గెలాక్సీలు ఉన్నట్లు ఒక అంచనా.[1]

విశ్వసృష్టి భౌతిక అధ్యయనంలో భూమి కేంద్రంగా, మన దగ్గర ఉన్న టెలిస్కోపుల సాయంతోనూ, విశ్వంలోకి ప్రయోగించబడిన స్పేస్ ప్రోబ్ సాయంతోనూ గమనించి గలిగిన విశ్వం ఎలా మొదలైందీ, దాని స్థూల నిర్మాణం, చలనం, చివరికి అది ఏమవుతుంది, దాన్ని నిర్దేశించే శాస్త్ర నియమాలు ఏమిటి అని అధ్యయనం చేస్తారు.[2] ఇందులో ఖగోళ శాస్త్రవేత్తలు, భౌతిక శాస్త్రవేత్తలు లాంటి వైజ్ఞానిక వేత్తలే కాక భౌతిక, అదిభౌతిక శాస్త్రాలు, కాలం - ప్రాంతాలు లాంటి వాటిని తాత్విక ధోరణిలో అధ్యయనం చేసే తత్వవేత్తలు కూడా పాల్గొంటారు. ఈ శాస్త్రాన్ని శాస్త్రీయంగానూ, అశాస్త్రీయంగానూ అధ్యయనం చేయడం వలన రెండు రకాల సిద్ధాంతాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. ఈ సిద్ధాంతాల్లో పరీక్షించదగినవి, పరీక్షించలేనివి రెండూ ఉంటాయి.

మూలాలు

మార్చు
  1. Hille, Karl, ed. (13 October 2016). "Hubble Reveals Observable Universe Contains 10 Times More Galaxies Than Previously Thought". NASA. Retrieved 17 October 2016.
  2. "Introduction: Cosmology – space" Archived 3 జూలై 2015 at the Wayback Machine. New Scientist. 4 September 2006.