విషాద కామరూప
విషాద కామరూప జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీత, ప్రముఖ రచయిత్రి ఇందిరా గోస్వామి రచించిన అస్సామీ నవలకు తెలుగు అనువాదం. ఊనే ఖోవా హొదా అనే ఆధునిక చారిత్రిక నవలను విషాద కామరూపగా గంగిశెట్టి లక్ష్మీనారాయణ అనువదించారు.
విషాద కామరూప | |
కృతికర్త: | ఇందిరా గోస్వామి |
---|---|
అసలు పేరు (తెలుగులో లేకపోతే): | ఊనే ఖోవా హొదా |
అనువాదకులు: | గంగిశెట్టి లక్ష్మీనారాయణ |
ముఖచిత్ర కళాకారుడు: | యు.టి.సురేష్ |
దేశం: | భారతదేశం |
భాష: | మూలం:అస్సామీ, అనువాదం:తెలుగు |
ప్రక్రియ: | చారిత్రిక నవల |
ప్రచురణ: | సాహిత్య అకాడమీ |
విడుదల: | 2002(అనువాదం) |
పేజీలు: | 321 |
ఐ.ఎస్.బి.ఎన్(ISBN): | 81-260-1555-X |
రచన నేపథ్యం
మార్చుఇందిరా గోస్వామి నవలను గంగిశెట్టి లక్ష్మీనారాయణ అనువదించగా 2002లో సాహిత్య అకాడమీ ప్రచురించింది. నవలలో కనిపించే ప్రధాన పాత్రలు రచయిత్రి రక్త సంబంధీకుల రూపచిత్రాలేనని, ఆ సంఘటనలు వాస్తవంగా జరిగినవేనని అనువాదకులు తెలిపారు. ఈ కథలోని సత్త్రా రచయిత్రిదేనని, నవలకు ఆధారంగా నిలిచే ప్రతి పత్రమూ వారింటిలో లభ్యమైనదేనని ఆయన పేర్కొన్నారు.[1]
రచయిత గురించి
మార్చుఇందిరా గోస్వామి(1942 - 2011) కలంపేరు మమోనిరైసామ్ గోస్వామి. ఆమె ఢిల్లీ విశ్వవిద్యాలయంలో ఆధునిక భారతీయ భాషా విభాగంలో ఆచార్యులుగా పనిచేశారు. ఆమె వందకుపైగా కథలు, పదిహేను నవలలు, ఒక్కొక్క ఆత్మకథ, సాహిత్యవిమర్శ, కవిత్వ సంకలనం రచించారు. కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారం, జ్ఞానపీఠ్ పురస్కారం, అస్సాం సాహిత్య సభల పురస్కారాలు అందుకున్నారు. అనువాదకులు గంగిశెట్టి లక్ష్మీనారాయణ తెలుగు అనువాద రంగంలో సుప్రసిద్ధులు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో సెంటర్ ఫర్ కంపారెటివ్ స్టడీస్‌కు డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.[2]
ఇతివృత్తం
మార్చువిషాద కామరూప ఆధునిక చారిత్రిక నవల. ఒకప్పుడు సర్వ కళా తంత్రశాస్త్రాల అధ్యయనానికి పెట్టినపేరు అస్సాం రాష్ట్రంలో కామరూప జిల్లాలోని సత్త్రాలు (వైష్ణవ మఠాలు). ఒకానొక సత్త్రం చుట్టూ ఉన్న చిన్న గ్రామాన్నీ, సత్త్రాల నేటి దయనీయ స్థితినీ ప్రతిబింబించే నవల విషాదకామరూప.[2]