వి.డి.రాజప్పన్

భారతీయ నటుడు

వి.డి.రాజప్పన్ కేరళకు చెందిన ప్రముఖ హాస్యనటుడు ప్రముఖ కథాప్రసంగ కళాకారుడు.

వి.డి.రాజప్పన్ (വി. ഡി. രാജപ്പൻ)
జననం
వెలికుజియిల్ దేవదాసన్ రాజప్పన్

(1950-03-23)1950 మార్చి 23
కొట్టాయం, కేరళ, భారతదేశం
మరణం (aged 66)
కొట్టాయం, కేరళ, భారతదేశం
జాతీయతభారతీయులు
వృత్తినటుడు, స్క్రిప్ట్ రచయిత,మాటల రచయిత, హాస్యనటుడు
క్రియాశీల సంవత్సరాలు1982–2005
జీవిత భాగస్వామిసులోచన
పిల్లలురాజేష్, రాజీవ్

జీవిత విశేషాలు

మార్చు

రాష్ట్రంలో ఒకప్పుడు అత్యంత ప్రసిద్ధమైన కళ కథాప్రసంగం 70వ దశకంలో ఒక వెలుగు వెలిగింది. ఈ కళలో రాజప్పన్ విశిష్టుడు. నటన, గానం, మాటలు, సంగీత వాయిద్యాలు మేళవిపుంతో ఆయన చేసే కథా ప్రసంగం బహుళ ప్రాచుర్య పొందింది. దీంతోపాటుగా సందర్భానుసారంగా అదనంగా జోడించే పేరడీ పాటలు ఆయన ప్రతిభకు అద్దం పట్టేవి. దేశ, విదేశాలలో 6,000 పైగా ప్రదర్శనలు ఇచ్చారు. అనంతరం ఆయన మలయాళ సినీ పరిశ్రమలో ప్రవేశించారు. 1982 నుంచి 2005వరకు తనదైన హాస్యపాత్రలతో సినీ అభిమానులను అలరించారు. మేలే పరాంబిల్ అనవీడు, అలి బాబాయుం అరారా-కల్లన్ మారుం, ముతారం కున్ను, కుస్రిత్తుక్కట్టు తదితర 100 కు పైగా ఎక్కువ చిత్రాలలో ఆయన నటించారు.[1][2]

ఆయన మార్చి 24 2016 గురువారం తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.[3]

మూలాలు

మార్చు

ఇతర లింకులు

మార్చు