వి.బి.కమలాసన్ రెడ్డి

వి.బి.కమలాసన్‌ రెడ్డి 2004 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. ఆయన ఐజీ హోదాలో ప్రస్తుతం వెస్ట్‌జోన్‌ ఐజీగా పని చేస్తున్నాడు.[1]

వి.బి.కమలాసన్‌ రెడ్డి
వెస్ట్‌జోన్‌ ఐజీ
Assumed office
15 ఫిబ్రవరి 2022 - ప్రస్తుతం
కరీంనగర్‌ పోలీస్‌ కమిషనర్‌
Assumed office
2017 - 2021
వ్యక్తిగత వివరాలు
జననం1963
దరిపల్లి గ్రామం, శంకరంపేట మండలం, మెదక్ జిల్లా, తెలంగాణ రాష్ట్రం
జాతీయత భారతదేశం
జీవిత భాగస్వామిరాధికా
సంతానంరాజశేఖర్‌, దీపిక
తల్లిదండ్రులుగోవిందరెడ్డి
కళాశాలఉస్మానియా యూనివర్సిటీ
వృత్తిపోలీస్ అధికారి

జననం & విద్యాభాస్యం

మార్చు

వి.బి.కమలాసన్‌ రెడ్డి తెలంగాణ రాష్ట్రం, మెదక్ జిల్లా, శంకరంపేట మండలం, దరిపల్లి గ్రామంలో 1963లో జన్మించాడు. ఆయన ఐదో తరగతి వరకు దరిపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో, 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు మేనమామ ఊరు మహబూబ్‌నగర్‌, ధర్మవరంలో, 1979లో పదో తరగతి మహబూబ్‌నగర్‌లోని ఎంజీరోడ్డు హైస్కూల్‌లో పూర్తి చేసి, హైదరాబాద్‌లోని బడీచౌడీలోని చైతన్య కళాశాలలో ఇంటర్మీడియట్, సికింద్రాబాద్‌ సర్ధార్‌ పటేల్‌ కళాశాలలో డిగ్రీ, వరంగల్‌ కాకతీయ యూనివర్సిటీలో ఎల్‌ఎల్‌బీ, 1990లో ఉస్మానియా యూనివర్సిటీలో జర్నలిజం పూర్తి చేశాడు.

వృత్తి జీవితం

మార్చు

వి.బి.కమలాసన్‌ రెడ్డి 1990లో ఏపీపీఎస్‌సీ గ్రూప్‌–2ఎ ఉద్యోగం సాధించి, హ్యాండ్లూమ్‌ అండ్‌ టెక్స్‌టైల్స్‌ డిపార్ట్‌మెంట్‌లో అసిస్టెంట్‌ డెవలప్‌మెంట్‌ అధికారిగా ఉద్యోగంలో చేరి, మళ్లీ గ్రూప్‌–2ఏతోపాటు గ్రూప్‌–1 రాసి, గ్రూప్‌–2ఏలో తహసీల్దార్‌ ఉద్యోగం రాగా అందులో చేరాక తిరిగి 1993లో గ్రూప్‌–1లో సెలక్ట్‌ అయ్యి డీఎస్‌పీగా సెలక్ట్‌ అయ్యి వివిధ హోదాల్లో పని చేసి తరువాత 2004 బ్యాచ్‌ ఐపీఎస్‌గా పదోన్నతి అందుకున్నాడు.[2]వి.బి.కమలాసన్‌ రెడ్డి 2022 జనవరి 22న ఐజీగా పదోన్నతి అందుకున్నాడు.[3]

నిర్వహించిన భాద్యతలు

మార్చు
  • నర్సంపేట డీఎస్‌పీ
  • ఆదిలాబాద్ ఎస్పీ[4]
  • హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ
  • హైదరాబాద్ సెంట్రల్ జోన్ డీసీపీ
  • కరీంనగర్‌ పోలీస్‌ కమిషనర్‌ - 2016 అక్టోబర్‌ 11 నుండి 2021 జులై 27[5]
  • వెస్ట్‌జోన్‌ ఐజీ - 15 ఫిబ్రవరి 2022 నుండి ప్రస్తుతం [6]

మూలాలు

మార్చు
  1. Namasthe Telangana (15 February 2022). "వెస్ట్‌జోన్‌ ఐజీగా కమలాసన్‌రెడ్డికి బాధ్యతలు". Archived from the original on 15 February 2022. Retrieved 15 February 2022.
  2. Sakshi (26 May 2019). "పోలీస్‌ అవుతానని కలలో కూడా అనుకోలే..!". Archived from the original on 15 February 2022. Retrieved 15 February 2022.
  3. Andhra Jyothy (22 January 2022). "తెలంగాణలో 12 మంది ఐపీఎస్‌లకు పదోన్నతులు". Archived from the original on 15 February 2022. Retrieved 15 February 2022.
  4. Deccan Chronicle (27 October 2014). "Hyderabad gets new top police officers" (in ఇంగ్లీష్). Archived from the original on 15 February 2022. Retrieved 15 February 2022.
  5. Sakshi (27 July 2021). "కరీంనగర్ సీపీ కమలాసన్ రెడ్డిపై బదిలీ". Archived from the original on 15 February 2022. Retrieved 15 February 2022.
  6. Andhra Jyothy (15 February 2022). "వెస్ట్‌జోన్‌ ఐజీగా కమలాసన్‌ రెడ్డి". Archived from the original on 15 February 2022. Retrieved 15 February 2022.