వీరప్పన్ లేదా కూసే మునిస్వామి వీరప్పన్ గౌండర్ (తమిళం: கூஸ் முனிசாமி வீரப்பன்; Kannada: ಕೂಸ್ ಮುನಿಸ್ವಾಮೀ ವೀರಪ್ಪನ್ ಗೌಂದೆರ್; జనవరి 18, 1952అక్టోబర్ 18, 2004) భారతదేశానికి చెందిన పేరుమోసిన బందిపోటు. చందనం కలప ఏనుగుదంతాల స్మగ్లర్ వీరప్పన్. కన్నడకంఠీరవుడు ఇంకా కొందరు నాయకులను కిడ్నాప్ చేశాడు. కొందరిని చంపాడు. ఇతనిచేత హతమైన వారిలో కర్ణాటక రాష్ట్ర క్యాడర్‌కు చెందిన ఐ.ఎ.ఎస్. అధికారి పందిళ్లపల్లి శ్రీనివాస్ ఉన్నాడు.

కూసఏ మునిస్వామి వీరప్పన్[1]
వీరప్పన్
జననం.(1952-01-18) 1952 జనవరి 18 [1]
గోపీనాథం, కర్ణాటక [2]
మరణం2004 అక్టోబరు 18 (2004-10-18)(వయసు 52)[1]
పప్పరపత్తి, ధర్మపురి, తమిళనాడు
స్థావరంMoolakadu, Tamil Nadu.
కార్యకలాపాలుహత్యలు
అపహరణలు
ఆక్రమణలు
స్మగ్లింగ్ [1]
జీవిత భాగస్వామిముత్తులక్ష్మి
పిల్లలుముగ్గురు

ఇతడు ఇతని అనుచరుల్ని పట్టుకునేందుకు తమిళనాడు పోలీస్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఆపరేషన్ కుకూన్ పేరుతో ప్రణాళికను రచించింది. ఈ ఆపరేషన్ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ విజయకుమార్ నాయకత్వంలో సాగింది. 1991లో ఆరంభమైన ఈ ఆపరేషన్ 2004 అక్టోబర్ 18న వీరప్పన్, అతని అనుచరులు సేతుకాళి గోవిందన్, చంద్రె గౌడ, సేతుమునిలను కాల్చిచంపడంతో ముగిసింది. ఇది దాదాపు రూ.100 కోట్ల ఖర్చుతో భారతదేశ చరిత్రలోకెల్లా అత్యంత ఖర్చు అయిన ఆపరేషన్ గా నిలిచింది.

వీరప్పన్ భార్య ముత్తులక్ష్మి మైసూర్ జైల్లోఉంది. జామీనుపై విడుదలకు సహకరించాల్సిందిగా వీరప్పన్ భార్య ముత్తులక్ష్మి వేడుకుంది. ఎప్పుడో నా భర్త చేశాడని చెబుతున్న నేరానికి తనను అక్రమంగా అరెస్టు చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. అప్పట్లోనే తనను అరెస్టు చేసి ఉంటే ఈ పాటికి శిక్షాకాలం కూడా పూర్తయి ఉండేదని చెప్పింది. తాను జైల్లోనే గడపడంతో ఇద్దరు కుమార్తెల భవిష్యత్తు ఆందోళన కల్గిస్తోందని వాపోయింది.[3] ఇటీవలే అనగా 2020 లో వీరప్పన్ కుమార్తె విద్యా రాణి బీజేపీ పార్టీ ద్వారా రాజకీయ తీర్థం పుచ్చుకున్నారు[4].

మూలాలుసవరించు

  1. 1.0 1.1 1.2 1.3 "Veerappan". nndb.com.
  2. Oliver, Mark (19 October 2004). "Death of a 'demon'". The Guardian.
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2009-09-04. Retrieved 2009-09-08.
  4. "Sandalwood Smuggler Veerappan's Daughter Vidya Rani Joins BJP". NDTV.com. Retrieved 2020-02-23.

యితర లింకులుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=వీరప్పన్&oldid=2859903" నుండి వెలికితీశారు