వీరేష్ ప్రతాప్ చౌదరి
భారతీయ సామాజిక కార్యకర్త
వీరేష్ ప్రతాప్ చౌదరి ఒక భారతీయ సామాజిక కార్యకర్త, రాజకీయవేత్త, ఆర్య విద్యాలయ అనే ప్రభుత్వేతర సంస్థ అధ్యక్షుడు.[1][2][3] 1938లో ఢిల్లీలో జన్మించిన ఆయన భారత జాతీయ కాంగ్రెస్ చేరిన తరువాత భారత యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అయ్యాడు.[2][1] ఆయన పార్టీని విడిచిపెట్టి జనతాదళ్ లో చేరి ఢిల్లీ ప్రదేశ్ యూనిట్ అధ్యక్షుడయ్యాడు. తరువాత ఆయన జనతాదళ్ ను విడిచిపెట్టి భారతీయ జనతా పార్టీ సభ్యుడయ్యాడు.[1] ఆయన అనేక సామాజిక కార్యకలాపాలలో పాల్గొన్నాడు. ప్రధానంగా ఆర్య విద్యాలయ ఆధ్వర్యంలో ఆయన ఢిల్లీ పటౌడీ హౌస్ యూనిట్ అధ్యక్షుడిగా ఉన్నాడు.[2] చౌదరి 2002 లో భారత ప్రభుత్వం చేత నాల్గవ అత్యున్నత భారతీయ పౌర పురస్కారం పద్మశ్రీ సత్కరించబడ్డాడు. అతను 2013 సెప్టెంబర్ 5 న ఢిల్లీలో మరణించాడు. అతని భార్య బాలా, కుమార్తె సంగీత, కుమారుడు నితిన్.[4][5][2][1]
వీరేష్ ప్రతాప్ చౌదరి
| |
---|---|
జననం | 1938 ఢిల్లీ, ఇండియా
|
మరణం | 5 సెప్టెంబర్ 2013 న్యూ ఢిల్లీ, ఇండియా
|
వృత్తి | సామాజిక కార్యకర్త |
గుర్తింపు | సామాజిక సేవ |
జీవిత భాగస్వామి | బాలా |
పిల్లలు | 2 పిల్లలు |
పురస్కారాలు | పద్మశ్రీ |
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 1.2 1.3 "The Hindu". The Hindu. 7 September 2013. Retrieved 1 February 2015.
- ↑ 2.0 2.1 2.2 2.3 "Arya samaj". Arya samaj. 2013. Retrieved 1 February 2015.
- ↑ "Arya Anthyalay". NGO Reporter. 2015. Retrieved 1 February 2015.
- ↑ "Padma Awards" (PDF). Padma Awards. 2015. Archived from the original (PDF) on 15 October 2015. Retrieved 11 November 2014.
- ↑ "Obituary". Obituary. 2015. Retrieved 1 February 2015.