వీర్ల అంకాళమ్మ ఆలయం (కారంపూడి)
విజ్ఞాన సర్వస్వంతో సమ్మిళితం కావాలంటే ఈ వ్యాసం నుండి ఇతర వ్యాసాలకు మరిన్ని లింకులుండాలి. (జూన్ 2017) |
వీర్ల అంకాళమ్మ ఆలయం, గుంటూరు జిల్లా, పల్నాటి యుద్ధం రణ క్షేత్రమైన కారంపూడిలో ఉంది.ఇది పురాతన ఆలయం.పల్నాటి వీరులచే కొలవబడే వీర్ల అంకాళమ్మ భక్తుల పాలిట ఇలవేల్పు.ఈ ఆలయం ఒకపక్కన ఆధ్యాత్మిక చింతన కలిగిస్తూనే, మరోపక్కన పల్నాటి వీరత్వాన్ని ప్రబోధిస్తూ ఉంటుంది. గుడిలో అమ్మవారు విగ్రహం తల కొంచెం ఎడమవైపుకు ఒరిగినట్లు కన్పిస్తుంది. ఆలయం తూర్పు ముఖద్వారంగా గల ఎదురు గోడకు చిన్న కిటికీ ఉంది. ఆ కిటికీ గుండా చూస్తే నాగులేరు ఒడ్డున పల్నాడు రణక్షేత్రం కన్పిస్తుంది,మరుభూమిలో పల్నాటి వీరులు నేలరాలి పోతున్న వారి కోసం అంకాళమ్మ అమ్మవారు దుఃఖిస్తునట్లుగా చెప్పుకుంటారు.అమ్మవారి ఎడమకంటి నుంచి కన్నీరు వస్తుందని, ఆ నీరు కిందపడితే అరిష్టం కలుగుతుంది అని ఓ చిన్న పాత్ర అక్కడ అంచుకే వుంచారని భక్తుల విశ్వాసం.