వెంకటాచర్ కల్పన

వెంకటాచర్ కల్పన (జననం 1961 జూలై 18) భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన మాజీ టెస్ట్ ఒక రోజు అంతర్జాతీయ క్రికెట్ క్రీడాకారిణి.[1] ఆమె కుడిచేతి బ్యాట్స్‌ ఉమన్, వికెట్ కీపర్. ఆమె మూడు టెస్టులు, ఎనిమిది ఒక రోజు అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ లు ఆడింది.[2] ఆమె సారా ఇల్లింగ్‌వర్త్‌తో కలిసి మహిళల ప్రపంచ కప్ క్రికెట్ మ్యాచ్‌లో ఒక ఇన్నింగ్స్‌లో వికెట్ కీపర్‌గా అత్యధిక బ్యాట్స్ విమెన్ లను అవుట్ చేసిన రికార్డును నమోదు చేసింది.[3]

వెంకటాచర్ కల్పన
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
వెంకటాచర్ కల్పన
పుట్టిన తేదీ (1961-07-18) 1961 జూలై 18 (వయసు 63)
కర్ణాటక, భారత దేశము
బ్యాటింగుకుడిచేతి వాటం
పాత్రవికెట్ కీపర్, ఆల్ రౌండర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 32)1986 జూన్ 26 - ఇంగ్లాండ్ తో
చివరి టెస్టు1991 ఫిబ్రవరి 9 - ఆస్ట్రేలియా తో
తొలి వన్‌డే (క్యాప్ 34)1986 26 జులై - వెస్ట్ ఇండీస్ తో
చివరి వన్‌డే1993 29 జులై - డెన్మార్క్ తో
కెరీర్ గణాంకాలు
పోటీ మహిళా టెస్ట్ క్రికెట్ WODI
మ్యాచ్‌లు 3 8
చేసిన పరుగులు 71 69
బ్యాటింగు సగటు 14.20 9.85
100లు/50లు 0/0 0/0
అత్యధిక స్కోరు 34 31
క్యాచ్‌లు/స్టంపింగులు 1/3 6/10
మూలం: CricketArchive, 2009 18 సెప్టెంబర్

జాతీయ స్థాయిలో ఎంపిక చేసే అధికారి (సెలెక్టర్) పదవికి ఐదుగురు సభ్యుల ప్యానెల్‌లో ఒకరిగా 3 సంవత్సరాల పాటు కల్పన నియమింపబడింది. ఈ ప్యానెల్‌కు మాజీ స్పిన్నర్ నీతూ డేవిడ్ నేతృత్వం వహించారు. ఇతర సెలెక్టర్లుగా రేణు మార్గ్రేట్, మిథు ముఖర్జీ, ఆరతీ వైద్య పనిచేసారు.[4]

ప్రస్తావనలు

మార్చు
  1. "V Kalpana". CricketArchive. Retrieved 2009-09-18.
  2. "V Kalpana". Cricinfo. Retrieved 2009-09-18.
  3. "Cricket Records | Records | Women's World Cup | Most dismissals in an innings | ESPN Cricinfo". Cricinfo. Retrieved 2017-07-25.
  4. "Life comes full circle for women's cricket selector Renu Margrate". HindustanTimes. 9 October 2020. Retrieved 24 August 2023.