వెనిస్
వెనిస్ ఇటలీ దేశంలో గల ఒక నగరం పేరు. ఇది నీటిపై తేలియాడే నగరంగా ప్రసిద్ధి గాంచింది. ఇటాలియన్ భాషలో ఈ నగరం పేరు Venezia, Venesia లేదా Venexia. ఇది ఇటలీ ఉత్తర భాగంలో ఉన్న నగరం. వెనిటో అనే విభాగానికి పాలనా కేంద్రం. 2004లో ఈ నగరం జనాభా 271,251. ( పాడువా పట్టణంతో కలిపి). వెనిస్ నగరానికి "La Dominante", "Serenissima", "Queen of the Adriatic", "City of Water", "City of Bridges", "The City of Light" అని వివిధ వర్ణనాత్మక నామాలున్నాయి. ప్రపంచంలో అత్యంత సుందరమైన నగరాలలో ఒకటగా వెనిస్ పేరు పొందింది.[1] వెనిస్ నగరం ఏడ్రియాటిక్ సముద్రంలో 118 చిన్న దీవుల, వెనీషియన్ లాగూన్ యొక్క సముదాయం. ఈ లాగూన్ దక్షిణాన పో, ఉత్తరాన పియావె అనే నదుల మధ్య విస్తరించి ఉంది.
ఐరోపా చరిత్ర మధ్యయుగంలోను, రినసాన్స్ కాలంలోను, క్రూసేడులు కాలంలోను "వెనీషియన్ రిపబ్లిక్ చాలా ముఖ్యమైన నౌకాబలం కలిగిన దేశం. అప్పటిలో సిల్కు, ధాన్యం, సుగంధ ద్రవ్యాలు వర్తకానికి ఈ నగరం కేంద్రంగా ఉండేది. 13వ శతాబ్దం నుండి 17వ శతాబ్దం చివరి వరకు ఇది కళలకు కేంద్రంగా వర్ధిల్లింది.
చరిత్ర
మార్చువెనిస్ ను సా.శ. 421 ప్రాంతంలో నిర్మించారు. ఇది మొదట్లో ఉప్పు తయారీ కేంద్రం. తర్వాతి రోజుల్లో పర్యాటక కేంద్రంగా ప్రసిద్ధి పొందింది. పద్నాలుగో శతాబ్దంలో అక్కడ రెండు లక్షల మంది నివాసం ఉండేవారు. కానీ 2100 మేరకు దీని ఉనికే ప్రశ్నార్థకం అవుతుందంటున్నారు పర్యావరణ వేత్తలు. 1966 లో వచ్చిన వరద తాకిడికి వెనిస్ లో నీటిమట్టం మీటరు ఎత్తుకు పెరిగింది. అప్పటి నుంచీ అక్కడి జనాభా తగ్గుతూ వస్తోంది.
పూర్వీకులు
మార్చువెనిస్ నగరం పూర్వీకుల చారిత్రక ఆధారపూర్వమైన సమాచారం అందుబాటులో లేవు. సప్రదాయం, లభించే సాక్ష్యాధారలను అనుసరించి చరిత్రకారులు వెనిస్ నగర అసలైన నివాసులు వెనిస్ సమీపంలో ఉన్న రోమన్ నగరాల నుండి పారిపోయి వచ్చిన శరణార్ధులని భావిస్తున్నారు. వీరు రోమన్ లోని పడువా, అక్విలియా, ట్రెవిసో, ఆల్టినో మరియో కాంకార్డియా ( ప్రస్తుత పోర్టోగ్ర్యూరొ ), గుర్తించడానికి వీలుకాని గ్రామాల నుండి జర్మనీ, హన్ దండయాత్రల కారణంగా అక్కడి ప్రజలు పారిపోయి ఈ నగరానికి వలసలు కొనసాగించారని భావిస్తున్నారు. సమీపకాలంగా వెలుగులోకి వచ్చిన రోమన్ ఆధారాలు ద్వీపంలోని జాలరులు ఒకప్పటి నీట మడులలో చేపలు పట్టే జాలరుని చెప్తున్నాయి. వారిని ఇంకోలే లాకూనే (" నీటి మడుగు నివాసులు ") అని అంటారు. అతి చిన్న ద్వీప ఖండంలో ఉన్న మొదటి చర్చి శాన్ జియైమోకో ఆరాధన సంప్రదాయం అనుసరించడం ఆధారంగా దీనిని కనుగొన్నారు.
ఉత్తర ఇటలీ ద్వీపకల్పంలో చివరి శాశ్వత వలస 568లో జరిగిందిగా భావిస్తున్నారు. తూర్పు రోమ్ సామ్రాజ్యం ప్రాంతాన్ని వదిలి ప్రస్తుత వెనెటో ప్రాంతంలో స్థిరపడ్డారు. అందు వలన ప్రధాన మత సంస్థలు మిగిలిన రాజ్యానికి బదిలీ చేయబడ్డారు, వెలెటియన్ మడుగులలో మలామొక్కొ, టేర్సెల్లో లలో కొత్త రేవులు నిర్మాణం చేయబడ్డాయి. ఈ ద్వీపంలో క్రీ.పూ 568లో మొట్ట మొదటి కేంద్రీయ ప్రభుత్వం ఏర్పడింది. కేంద్ర, ఉత్తర ఇటలీ ఆధిక్యం ఫలితంగా చివరకు 751 లో ఆస్టిప్ ఎక్సర్ చేట్ రవేన్నా మీద విజయ కేతనం ఎగరవేసాడు. అప్పుడు ల్యూట్ ప్రాండ్ బైజాంటైన్ నుండి విమానంలో వచ్చిన ఎక్సార్చ్ పౌల్ కు వెనిటియన్లు ఆశ్రయం ఇచ్చారు. ఈ సమయంలో బైజాంటైన్ గవర్నర్ స్థానం మలామొక్కొలో ఉంది. బైజాంటైన్ ప్రదేశాల మీద లోంబర్డ్ విజయం తరువాత ద్వీపంలోని నీటి మడుగుల వద్ద స్థిరపడడం అభివృద్ధి చెందింది.
8వ శతాబ్ధపు మొదటి దశాబ్ధాలలో నీటి మడుగుల ప్రజలు వారి మొదటి నాయకుడైన ఉర్సస్ ను ఎన్నుకున్నారు. హైప్టస్, డక్స్ వంటి బిరుదులతో సత్కరిండబడిన ఉర్సస్ చారిత్రకంగా డోగ్ ఆప్ వెనిస్ గా గుర్తింపు పొందాడు.
775/776 లో ఏర్పాటు చేయబడిన ఆనివొలో (హెలిపోలిస్) ఎపిస్కోపల్ స్థానం సామంత ప్రభువు ఏగ్నిలో పర్టిషియాకో (811–827) పాలనా కాలంలో మలామొక్కొ నుండి అత్యంత సురక్షితమైన రియాల్టో (ప్రస్తుత వెనిస్ ప్రాంతం) కు బదిలీ చేయబడింది. తరువాత సెయింట్ జాక్రి యొక్క మొదటి మఠము మొదటి సైనిక కార్యాలయం, సెయింట్ మార్క్ చర్చ్ ఆలివేలోమరియు రియాల్టోల మధ్య నిర్మించబడింది. వెనిస్ నగరమంతటి నుండి కనిపించే రెక్కల సింహాలు సెయింట్ మార్క్ చిహ్నంగా నిలిచాయి.
చార్ల్ మాగ్నే మొదటి సారిగా వెనిస్ మీద ఆధిపత్యం చూపుతూ వెనిస్ నగరాన్ని తన పాలనలోకి తీసుకోవాలని పెంటాపోలిస్ నుండి వెనిటియన్లను ఆర్డియాటిక్ తీరాలకు పంపమని పోప్ కు ఆజ్ఞలను జారీ చేసాడు. చార్ల్ మాగ్నే కుమారుడు ఇటలీ రాజప్రతినిధి లాంబర్డ్స్ రాజు అయిన పెపిన్ అతని తండ్రి అధికారం క్రింద వెనిస్ నగరం మీద దండయాత్ర చేసి స్వాధీన పరచుకున్నాడు. ఇందు కొరకు వారు చివరకు అతి ఖరీదైన మూల్యం చెల్లించి ఓటని పాలైయ్యారు. పెపిన్ సైల్యం చివరకు ప్రాంతీయంగా ఉన్న బురద నేలల వలన అంటు వ్యాధి సోకి ఫలితంగా వెనిస్ మీద తమ ఆధిపత్యాన్ని వెనుకకు తీసుకున్నారు. తరువాత కొన్ని మాసాలకు పెపిన్ కూడా మరణించాడు. తరువాత ఈ వ్యాధి ఆ ప్రాంతం అంతటా ప్రబలి పోయింది. తరువాత చార్ల్ మాగ్నే, నైస్ ఫోరస్ ల మధ్య వెనిస్ బైజాంటైన్ ప్రదేశంగానూ అలాగే ఆర్డియాటిక్ తీరం వెంట నగర వాణిజ్యహక్కులు గుర్తించబడడం వంటి విషాయాల మీద ఒప్పందం కుదిరింది.
అలెగ్జాండ్రియా నుండి వచ్చిన అద్భుతమైన నైపుణ్యంతో 828 లో సెయింట్ మార్క్ అవశేషాల నుండి సరికొత్త నగరం పైకి లేచింది. పాట్రియార్చల్ స్థానం కూడా రియాల్టోకు మార్చబడింది. ఇక్కడ ఒక ప్రత్యేక సమాజం కూడా నిరంతరాయంగా రూపు దిద్దుకుని బైజాంటైన్ శక్తిని బలహీనపరచి స్వయంప్రతిపత్తి పొంది చివరకు స్వాతంత్ర్యం సాధించింది.
విస్తరణ
మార్చు9-12 శతాబ్ధాల మధ్య కాలంలో వెనిస్ నగరంగానూ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన యూనియన్ ప్రదేశంగానూ అభివృద్ధి చెందింది. ఇటలీలోని మిగిలిన యూనియన్ ప్రదేశాలు జెనోవా, పీసా, అమలిఫ్. వ్యూహాత్మకంగా వెనిస్ ఆడ్రియాటిక్ శిరోభాగాన ఉండడం దానిని రేవుపట్టణంగా, బలమైన వాణిజ్య కేంద్రంగానూ అభివృద్ధి చేసింది. డాల్మేటియన్ తీరంలో సముద్రపు దొంగలను నిషేధించిన తరువాత ఈ నగరం పశ్చిమ ఐరోపా, మిగతా ప్రపంచంలో వాణిజ్యకేద్రంగా ప్రఖ్యాతి చెందింది. ప్రత్యాకంగా బైజాంటైన్ సామ్రాజ్యం, ముస్లిం దేశాలలో ఖ్యాతి చెందింది. 12వ శతాబ్దంలో వెనిస్ వారు శక్తి పుజుకున్నారు. 1104 వెనిటియన్ ఆయుధాలు నిర్మాణ దశలో ఉన్నాయి.
1200 ముందే వెనిస్ రిపబ్లిక్ ఆడ్రియాటిక్ ప్రదేశాలను అనేకం స్వాధీనం చేసుకున్నాయి. సముద్రపు దొంగల భయం వలన వ్యాపారం దెబ్బతింటుందనే ఈ ప్రదేశాలు స్వాధీనం చేసుకోబడ్డాయి. డోగ్ అప్పటికే డ్యబక్ ఆప్ డాల్మేటియా, డ్యూక్ ఆప్ ఇష్టరియా అన్న బిరుదులు పొంది ఉన్నాడు. తరువాత ప్రధాన భూములు కూడా స్వాధీనం చేసుకుని తరువాత అడ్డానది పడమరలో ఉన్న గార్డా సరసు వరకు ఈ విస్తరణ కొనసాగింది. కయ్యానికి కాలుదువ్వే ప్రతిధ్వందులు, అక్రమంగా నివాసితులు, వాణిజ్యానికి అనుకూలించే ఆల్ ఫైన్ వాణిజ్యమార్గం, ప్రధాన ప్రదేశం నుడి నగరానికి ఆధారమైన గోధుమ సరఫరా కావడం వంటి విషయాలతో నగరం అభివృద్ధి చెందసాగింది. సముద్ర వాణిజ్య సామ్రాజ్యనిర్మాణం చేస్తూ ఉప్పు ఉత్పత్తిలో ఆధిక్యత సాధించింది. ఏజియన్ సముద్రంలో ఉన్న సాప్రస్, క్రేట్ వంటి ద్వీపాలతో సహా మిగిలిన ద్వీపాలను స్వాధీనపరచుకుని తూర్పు భూభాగంలో శక్తివంతంగా నిలదొక్కుకుంది. కాలక్రమేణా ప్రధాన భూభాగంలో వెనిస్ కార్యనిర్వహణతో ప్రభానితులైన బర్గామే, బెర్కియా, వెరోనాలు వెనిటియన్ సామ్రాజ్యంతో సత్సంబంధాలు ఏర్పరచుకొని ఆక్రమణదారుల దాడులను ఏదుర్కొన్నాయి.
వెనిస్ కాంస్టాంటినోపుల్ తో సత్సంభాధాలు ఏర్పరచుకుని తూర్పు రోమన్ లో గేల్డెన్ బుల్స్ లేక క్రైసో బుల్స్ పారుతో విశేష అధికారాన్ని రెండు విడతలు పొంది ఫలితంగా నార్మన్, టర్కిష్ వారిని తూర్పు సామ్రాజ్యంలో ప్రవేశించకుండా ఆపగలిగింది. మొదటి క్రైసో బుల్స్ వెనిస్ సామ్రాజ్యానికి విధేయత ప్రకటించాలని గ్రహించింది బైజాంటియమ్ శక్తి క్షీణించడం వెనిటియన్ శక్తి బలం పుంజుకోవడం వలన రెండవది అలా చేయలేదు.
వెనిస్ వద్ద ఆర్థిక సాయం పొందిన క్రుసేడర్లు 1204లో కాంస్టాంటినోపుల్ ను ఆక్రమిండిన తరువాత క్రమంగా వెనిస్ రాజ్యాంగ శక్తిగా అవతరించి లాటిన్ సామ్రాజ్య స్థాపన చేసింది. ఈ విజయ యాత్ర అనంతరం చెప్పతగినంత బైజాంటైన్ సంపదను దోచుకుని వెనిస్ కు తీసుకురాబడింది. ఈ దోపిడీలో హిప్పోడ్రోం ఆప్ కాంస్టాంటినోపుల్ కు చెందిన బంగారు పూత కలిగిన ఇత్తడి గుర్రాలు కూడా ఒకటి. వాటిని మొదట సెయింట్ మార్క్స్ కాథ్డ్రల్ ముఖద్వారం వద్ద ఉంచారు. తరువాత వాటి స్థానంలో నకలు బొమ్మలు ఉంచి వాటిని ప్రథుతం బాసిలికాలో బద్రపరిచారు. కాంస్టాంటినోపుల్ పతనం తరువాత రోమన్ సామ్రాజ్యాన్ని క్రుసేడర్లు, వెనిటియన్లు భాగాలుగా పంచుకున్నారు. తరువాత వెనిస్ మధ్యధరాలో ప్రభావవంతమై డచ్ ఆఫ ది ఆర్చిపెలాగోగా గుర్తింపు పొందింది.
కాంస్టాంటినోపుల్ ఆక్రమణ తరువాత అనటోలియన్ యుద్ధంలో మాంజికర్ట్ ను కూడా కోల్పోయిన తరువాత బైజాంటియన్ సామ్రాజ్యం ముగింపుకు వచ్చిన విషయం నిర్ధారితం అయింది. అబినప్పటికి బైజంటైన్ అర్ధ శతాబ్దం తరువాత తిరిగి ఈ నగరాన్ని శిథిలావస్థలో స్వాధీనం చేసుకున్నాయి. చివరకు బైజంటైన్ సామ్రాజ్యం బలహీలపడిన స్థితిలో ఈ నగరం 1453లో మెహమత్ స్వాధీన పరచుకునే వరకు పాతజ్ఞాపకాల అవసేషంగా మిగిలి పోయింది.
ఆడ్రియాక్ సముద్రం శరోభాగాన ఉన్న కారణంగా వెనిస్ బైజంటైన్ సామ్రాజ్యం, ముస్లిం ప్రపంచం అంతటా వ్యాపారం చేస్తూ వచ్చింది. 13వ శతాబ్దం చివరికి వెనిస్ ఐరోపా మొత్తంలో అధిక సంపన్నవంతమైన నగరంగా మారింది. వెనిస్ శక్తి శిఖరాగ్రాన్ని చేరిన సమయంలో ఈ నగరానికి 3,300 నౌకలు 36,000 మంది నావికులను కలిగి మధ్యధరా సముద్ర వ్యాపారంలో ఆధిక్యత సాధించింది. ఈ సమయంలో వెనిస్ లోని సంపన్నులు ఒకరుకంటే ఒకరు మించి బ్రహ్మాండమైన రాజభవనాలు నిర్మించారు. ఈ భవనాలు అత్యంత నైపుణ్యం కలిగిన నిర్మాణ కౌశలంతో కళాత్మకంగా నిర్మించబడ్డాయి.
పరిపాలన
మార్చుఈ నగరం గ్రేట్ కౌన్సిల్ నిర్వహణలో పాలించబడుతుంది. ఈ కౌన్సిల్ సభ్యులు పేరెన్నకగన్న కుటుంబాల నుండి ఎంచుకొనబడతారు. ప్రజలు ఎన్నుకున్న 200 సెనేట్ సభ్యులు, 300 ఇండివిద్యుయల్ (స్వతంత్ర ) సభ్యులను కైన్సిల్ సభ్యులు ప్రభుత్వ కార్యదర్శులుగా నియనిస్తారు. ఈ సభ్యుల సంఖ్య ప్రతిభావంతమైన పాలన అందించడానికి కావలసిన దానికంటే అధికమే. డ్యూకల్ కౌన్సిల్ లేక సిగ్లోరియా అని పిలువబడే ఈ బృందాలు నగర పాలనను సమర్ధవంతంగా నియంత్రిస్తాయి. గ్రేట్ కౌన్సిల్ నుండి ఒక సభ్యుడిని డోగ్ గానూ సెరిమోనియల్ అధ్యక్షుడుగా ఎన్నుకుంటారు. ఆయనకు ఈ బిరుదు ఆమరణాంతం ఉంటుంది.
వెనిటిటియన్ ప్రభుత్వ నిర్వహణా వ్వవస్థ లోని కొన్ని విధానాలు ముందు రోమన్ రిపబ్లిక్ విధానాలను పోలి ఉంటుంది. చర్చ్, ఇతర ప్రభుత్వ ఆస్తులు సైనిక ఆధిపత్యంలోనే ఉంటుంది. రిపబ్లిక్ వెనిస్ లో రాజకీయాలు సైనికాధిపత్యం ప్రత్యేకంగానే ఉంటాయి. కొన్ని ప్రత్యాక సందర్భాలలో మాత్రమే డోగ్ సైన్యానికి ఆధిపత్యం వహిస్తాడు.
వెనిస్ నగరం చిత్రమాలిక
మార్చు-
Santa Maria della Salute
-
Grand Canal
-
Piazza San Marco and its famous pigeons.