వెన్నెల 2005లో దేవ కట్టా దర్శకత్వంలో విడుదలైన తెలుగు సినిమా. ఎన్నారై విద్యార్థుల జీవితాలను తనదైన శైలిలో ఈ చిత్రం ద్వారా తెరకెక్కించారు.

వెన్నెల
(2005 తెలుగు సినిమా)
దర్శకత్వం కట్టా దేవా
కథ కట్టా దేవా
తారాగణం రాజా
పార్వతీ మెల్టన్
వెన్నెల కిశోర్
శర్వానంద్
బ్రహ్మానందం
రవివర్మ
సంభాషణలు కట్టా దేవా
నిర్మాణ సంస్థ ఫోర్త్ డైమెన్షన్ ఫిల్మ్స్
విడుదల తేదీ 26 నవంబర్ 2005
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

పావని (పార్వతీ మెల్టన్) స్వతంత్రభావాలు కలిగిన ఓ యువతి. అమెరికాకి ఉన్నత విద్య అభ్యసించడానికి వచ్చిన ఆమెకు అంతకు క్రితమే కాలేజీలో రితేష్ (శర్వానంద్) అనే యువకుడితో పరిచయం ఉంటుంది. అదే పరిచయం ప్రేమగా మారుతుంది. అయితే సయ్యద్ (రవివర్మ) అనే మరో విద్యార్థి మూలంగా రితేష్ చెడు సావాసాలకు అలవాటు పడిపోతాడు. పావని అతనిని మార్చడానికి ప్రయత్నించినా, అతను మారకపోవడంతో ఆమె ఆ రిలేషన్‌షిప్‌కు స్వస్తిచెప్పి అమెరికాకి వచ్చేస్తుంది. అమెరికాలో ఓ కాలేజీలో చేరాక, అక్కడే ఆమెకు నవీన్ (రాజా) పరిచయమవుతాడు. తన స్నేహితులతో పాటు అమెరికాకి వచ్చిన నవీన్‌కి దేశమే కాదు.. అక్కడ మనుషుల తీరుతెన్నులు, సంస్కృతి అన్నీ కొత్తే. పార్టుటైమ్ జాబ్ కోసం ఈ కుర్రాళ్లు పచ్చళ్ల పరమానందం (బ్రహ్మానందం)అను ఒక ఎన్నారైని ఆశ్రయిస్తారు.

పార్వతి, నవీన్ స్నేహితులగానే మెలుగుతుంటారు. కానీ అదే కాలేజీలో చేరిన పావని పాత క్లాస్‌మేట్ సయ్యద్, ఆమె నవీన్‌తో ప్రేమలో ఉన్నట్లు రితేష్‌కు చెబుతాడు. రితేష్ ఆగమేఘాల మీద అమెరికాకి వస్తాడు. రితేష్ ఇంకా మారకపోవడం చూసి ఆమె నిజంగానే తనను అసహ్యించుకుంటుంది. రితేష్‌కు ఏం చేయాలో అర్థం కాదు. ఒకానొక సందర్భంలో సయ్యద్ తన ప్రియురాలి చిత్రాలను మార్ఫింగ్ చేయడం చూసిన తను, తన స్నేహితుడు చేస్తున్న ద్రోహాన్ని ఆలస్యంగా పసిగడతాడు. ఒక సైకోలా మారతాడు. తొలుత సయ్యద్‌ను హతమారుస్తాడు. ఆ తర్వాత కారులో వెళుతున్న నవీన్, పావనిల మీద కూడా దాడి చేస్తాడు. అయితే సమయానికి పోలీసులు వచ్చి రితేష్‌ను కాల్చి చంపడంతో కథ ముగుస్తుంది.

నటినటులు

మార్చు

పాటల జాబితా.

మార్చు

ప్రేయసి కావు , గానం: శుదిప్ , సైంధవి

భాగ్యం పొద్దున , గానం: దేవన్ , అరవింద్, శుదిప్

సూపర్ మోడల్ , గానం.టీప్పు

నింగీ నేల , గానం.శుదిప్ , సైందవీ

నేల తాకని , గానం.మహేష్

చేస్తారా లవ్ , గానం.రవివర్మ ,దేవ కౌశిక్

బిజీ లైఫ్ , గానం; కార్తీక్ , శైందవి

ఈస్ట్ వెస్ట్ , గానం.శుదిప్ , సైంధవీ .

మూలాలు

మార్చు