వెన్న నాగార్జున

తెలుగు వికీపీడియాకు శ్రీకారం చుట్టింది వెన్న నాగార్జున. బోస్టన్ నగరంలో సమాచార సాంకేతిక నిపుణుడిగా పనిచేస్తున్నపుడు రూపొందించిన పద్మ అనే లిప్యాంతరీకరణ పరికరం (ఇది ఇంగ్లీషు కీబోర్డ్ తో తెలుగు వ్రాసే తెలుగు భాషా అనువాద పరికరం) నెట్ లో తెలుగు సమాచార అభివృద్ధికి ఒక మైలురాయి. క్రమంగా తెలుగు భాషాభిమానులను ఇది విశేషంగా ఆకర్షించింది. పద్మ అనే లిప్యాంతరీకరణ పరికరం సృష్టితో వెలుగులోకి వచ్చిన నాగార్జునకి వికీ నిర్వాహకులలో ఒకరైన విలియంసన్ పంపిన విద్యుల్లేఖ (టపా) తెలుగు వీకీపీడియా ఆవిర్భావానికి నాంది పలికింది. ఆసక్తి ఉండి నిర్వహిస్తామని నమ్మకం ఉంటే తెలుగు వికీపీడియాను రూపొందించి ఇస్తామని దాని సారాంశం. దానిని సవాలుగా తీసుకొని నాగార్జున అనుకూలంగా స్పందించి అంగీకారాన్ని తెలిపాడు. ఈ విధంగా తెవికీ 2003 డిసెంబర్ 10న[1] ఆవిర్భవించింది. తెలుగు వికీపీడియాలోని మొదటి చిహ్నాన్ని (లోగోని) రూపొందించిన ఘనత ఆయనదే. ప్రధానంగా సాంకేతికాంశాలపై 170 మార్పులు చేసిన అతని చివరిమార్పు 2006 జూలై 21 న జరిగింది.

వెన్న నాగార్జున

విద్యాభ్యాసం మార్చు

రీజినల్ ఇంజనీరింగ్ కాలేజీ, వరంగల్ లో 1996 లో కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్ లో పట్టభద్రుడయ్యాడు.2009 లో మసాచ్‌సెట్స్ సాంకేతిక సంస్థ స్లోన్ నిర్వహణ పాఠశాలలో మాస్టర్స్ పట్టా పుచ్చుకున్నాడు.

వృత్తి మార్చు

వివిధ వుద్యోగాలు నిర్వహించాడు. బోస్టన్ లో సాఫ్టవేర్ కంపెనీ బిట్సైట్ టెక్నాలజీస్ 2010 నుండి వ్యవస్థాపకుడు, ముఖ్య ఉత్పత్తి అధికారిగా [2] పనిచేస్తున్నాడు.

వనరులు మార్చు