వెలంపేట

విశాఖపట్నం నగరంలోని ఒక వాణిజ్య ప్రాంతం

వెలంపేట, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం నగరంలోని ఒక వాణిజ్య ప్రాంతం.[1] ఇది మహా విశాఖ నగరపాలక సంస్థ స్థానిక పరిపాలన పరిమితుల్లో ఉన్న ఈ ప్రాంతం ద్వారకా బస్ స్టేషన్ నుండి సుమారు 4 కి.మీ. దూరంలో ఉంది.

వెలంపేట
సమీపప్రాంతం
వెలంపేట is located in Visakhapatnam
వెలంపేట
వెలంపేట
వెలంపేట ప్రాంతం ఉనికి
Coordinates: 17°42′17″N 83°17′46″E / 17.704597°N 83.296238°E / 17.704597; 83.296238
దేశం భారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లావిశాఖపట్టణం
Government
 • Bodyమహా విశాఖ నగరపాలక సంస్థ
భాషలు
 • అధికారికతెలుగు
Time zoneUTC+5:30 (భారత ప్రామాణిక కాలమానం)
పిన్ కోడ్
530001
Vehicle registrationఏపి-31

విశాఖపట్నం నగరంలోని పాత ప్రాంతాలలో ఈ వెలంపేట ఒకటి. 1970ల నుండి ఇది నగరానికి వాణిజ్య కేంద్రంగా ఉంది. ఇక్కడ జిల్లాల బిఎస్ఎన్ఎల్ కార్యాలయం కూడా ఉంది.[2]

భౌగోళికం

మార్చు

ఇది 17°42′17″N 83°17′46″E / 17.704597°N 83.296238°E / 17.704597; 83.296238 ఆక్షాంశరేఖాంశాల మధ్య ఉంది. సముద్ర మట్టానికి 27 మీటర్ల ఎత్తులో ఉంది.

జనాభా

మార్చు

వెలంపేట 655 హెక్టార్ల విస్తీర్ణంలో ఉంది. ఇక్కడ మొత్తం జనాభా 16248 కాగా ఇందులో పురుషులు 8405 మంది, స్త్రీలు 7,843 మంది ఉన్నారు. ఇక్కడ 3802 గృహాలు ఉన్నాయి.

సమీప ప్రాంతాలు

మార్చు

వెలంపేటకు దక్షిణం వైపు విశాఖపట్నం మండలం, దక్షిణం వైపు గాజువాక మండలం, ఉత్తరం వైపు కొత్తవలస మండలం, ఉత్తరం వైపు ఆనందపురం మండలం ఉన్నాయి.

రవాణా

మార్చు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో వెలంపేట మీదుగా బక్కన్నపాలెం, మధురవాడ, యెండాడ, హనుమంతువాక, మద్దెలపాలెం, ఆర్టీసీ కాంప్లెక్స్, జగదాంబ సెంటర్, టౌన్ కొత్తరోడ్, రవీంద్ర నగర్, విశాలాక్షి నగర్, గురుద్వార, సత్యం జంక్షన్, సీతమ్మధార, సింహాచలం, అరిలోవ మొదలైన ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది.[3] పెందుర్తి రైల్వే స్టేషను, సింహాచలం నార్త్ రైల్వే స్టేషను వేలంపేటకు సమీపంలో ఉన్నాయి.

విద్యాసంస్థలు

మార్చు
  1. టి.ఎస్.ఆర్.ఎన్ జూనియర్ కాలేజీ
  2. సెయింట్ జేవియర్ ఎస్ డిగ్రీ కళాశాల
  3. గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & మేనేజ్మెంట్
  4. భాష్యం హైస్కూల్
  5. అమర్‌కాన్సెప్ట్ హెచ్‌ఎస్ స్కూల్

మూలాలు

మార్చు
  1. "Velampeta Village , Pendurthi Mandal , Visakhapatanam District". www.onefivenine.com. Retrieved 4 May 2021.
  2. Gopal, B Madhu (10 August 2016). "BSNL 4-G services in city soon". The Hindu. Retrieved 4 May 2021.
  3. "Local Bus Routes". www.onefivenine.com. Retrieved 4 May 2021.
"https://te.wikipedia.org/w/index.php?title=వెలంపేట&oldid=3898343" నుండి వెలికితీశారు